ఏపీలో పిడుగుపాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వడగాల్పులు, పిడుగు పాటు వర్షాలు తీవ్ర భయాందళనలకు గురి చేస్తున్నాయి.;
ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు ఠారెత్తిస్తుండగా మరో వైపు వడగాల్పులు, పిడుగులతో కూడిన వర్షాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వీటి ప్రభావంతో అకస్మాత్తుగా పిడుగులు పడే అకాశాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అకస్మాత్తుగా పిడుగులు పడిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కొంత మంది యువకులు క్రికెట్ ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో 17 ఏళ్ల సన్నీ, 18 ఏళ్ల ఆకాశ్ అనే యువకులు మరణించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే త్రీవంగా గాయపడిని ఆ యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడి ఇద్దరు యువకులు దుర్మణం పాలుకావడంతో పెద్దోబినేనిపల్లలో తీవ్ర విషాదం అలుముకుంది. యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగి పోయారు.