చాగంటికి అవమానమా? మీడియాపై కేసు పెట్టిన టిటిడి

ఏ కథనాలపై టిటిడి స్పందించింది. కొన్ని మీడియా సంస్థలపై పోలీసులు కూడా ఫిర్యాదు చేసింది.;

Update: 2025-01-29 11:51 GMT

ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావుకు తిరుమలలో అవమానం జరిగిందనే వార్తలు విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చాగంటి కోటేశ్వర రావు జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు 2024, డిసెంబర్ 20న టిటిడి ప్రొసిడింగ్స్ ఇచ్చింది. ఆమెరకు చాగంటి కి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు బుధవారం స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే,

తిరుమలలో చాగంటికీ అవమానం జరిగిందని ప్రచారం చేసిన మీడియా సంస్థ లు డయల్ న్యూస్, పోస్ట్ 360, జర్నలిస్ట్ వై ఎన్ ఆర్ నిర్వాహకులపై తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు టిటిడి అధికారులు లు ప్రకటించారు. ఆ మేరకు ఆ మీడియా సంస్థలపై కేసు నెం. 13/2025 ఈ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

తిరుమలలో ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు టీటీడీ గౌరవం అందించిన విషయాన్ని చెప్పినప్పటికీ ఆ మీడియా సంస్థలు వక్రీకరించి ఆయన టిటిడి తన ఫిర్యాదులు ఆరోపించింది.

" వాస్తవ విరుద్ధమైన వార్తలో ప్రసారం చేసిన ఆ సంస్థలపై ఎస్వీయూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు తో పాటు న్యూఢిల్లీ, విజయవాడలో ఉన్న పిఐబి ( press information bureau) కి కూడా ఫిర్యాదు చేసాం" అని టిటిడి వెల్లడించింది.

కొన్ని మాధ్యమాల ప్రచార తీరు ప్రవచనకర్త చాగంటి అభిమానులు, శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని టిటిడి అభిప్రాయపడింది. ఆ సోషల్ మీడియా సంస్థల లైసెన్స్ రద్దు చేయాలని యూట్యూబ్ మేటా మేనేజ్మెంట్ కు కూడా ఫిర్యాదు చేసినట్టు టీటీడీ స్పష్టం చేసింది.

తిరుమలలో ప్రవచనకర్త చాగంటికి ఫోటో కాల్ ప్రకారం స్వాగతించడం. చేసిన ఏర్పాట్లు పై టీటీడీ ఏమి చెబుతోంది అంటే..

"రాష్ట్ర ప్రభుత్వం లో చాగంటి కోటేశ్వరరావు కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ఉంది. ఆ మేరకు జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాటు చేసింది. అందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి తీసుకెల్లేందుకు బ్యాటరీ వాహనాలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు కూడా చేసిన ఏర్పాట్లను చాగంటి సున్నితంగా తిరస్కరించారు" టిటిడి సమాచార విభాగం జారీ చేసిన ప్రకటనలో వివరించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో

సామాన్య భక్తుల తరహాలోనే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయానికి చేరుకురుకుంటానని చాగంటి చెప్పడమే కాదు. ఆ విధంగా వెళ్ళిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించుకున్నారు అని తెలిపారు. ఇదిలా ఉంటే

జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో చాగంటి ప్రవచన కార్యక్రమాన్ని వాయిదా వేస్తే బాగుంటుందని భావించి ఇదే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. దీనికి చాగంటి కూడా సానుకూలంగా స్పందించి, పరిస్థితులు అనుకూలించాక మళ్లీ తిరుమలకు వస్తా చాగంటి చెప్పారని వివరించారు. ఆ మేరకు చాగంటి ఇచ్చే తేదీల్లో ఆయన ప్రవచనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టిటిడి అధికారులు స్పష్టం చేశారు.

ప్రవచనకర్త చాగంటి విషయంలో జరిగిన విషయాలు ఇవి. అయితే, బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసినట్లు అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేయడం సమంజసం కాదనే ఉద్దేశంతోనే కొన్ని మీడియా సంస్థలపై పోలీసులు ఫిర్యాదు చేయాల్సిన అని భారీగా పరిస్థితి ఏర్పడిందని టీటీడీ వివరించింది. తిరుమల, శ్రీవారి ఆలయానికి సంబంధించి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని కూడా టిటిడి అధికారులు హెచ్చరించారు.

Tags:    

Similar News