ఏపీలో కొనసాగేలా చూడండి : సీఎం చంద్రబాబుకు ఐఏఎస్ లు విజ్ఞప్తి
తమను ఏపీలోనే కొనసాగే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న తెలంగాణ కేడర్‌కు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.;
తెలంగాణ కేడర్‌కు కేటాయించబడి, ఏపీలో కొనసాగుతున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు జీ సృజన, ఎల్ శవశంకర్, హరికిరణ్‌లు సీఎం చంద్రబాబును కలిసి తమను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆ ముగ్గరు ఐఏఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఏపీలో కాకుండా కేటాయించబడిన తెలంగాణ కేడర్‌కు వెళ్లి పోవాలని డీవోపీటీ ఇటీవల వారికి ఆదేశాలు జారీ చేసింది. అక్టోబరు 16న తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబును కలవడంతో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలోనే కొనసాగేలా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడుతారా లేక తెలంగాణకు వెళ్లి పోవలసిందేనా అనేది ఇప్పుడు ఐఏఎస్ అధికార వర్గాల్లో చర్చగా మారింది.