నటి జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ కు చుక్కలు చూపిస్తున్న పోలీసులు
ముంబై సినటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను సీఐడీ పోలీసులు గుంటూరులో విచారిస్తున్నారు.
By : The Federal
Update: 2024-11-10 13:06 GMT
ముంబై సినటి కాదంబరి జెత్వానీ కేసులో వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ను సీఐడీ పోలీసులు గుంటూరులో విచారిస్తున్నారు. మూడు రోజుల పోలీసు కస్టడీకి విజయవాడలోని 3వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆయన్ను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలించారు. సినీనటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
విచారణ నిమిత్తం కుక్కల విద్యాసాగర్‌ను గుంటూరు తీసుకువచ్చిన పోలీసులు ముందు గుంటూరు జనరల్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలోనే మూడు రోజులపాటు విద్యాసాగర్‌ను సీఐడీ అధికారులు విచారించనున్నారు.
కాదంబరి జెత్వాని కేసులో ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను నవంబర్ 10 నుండి 12 వరకు విజయవాడలోని III అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు అనుమతి ఇచ్చింది. కౌంటర్ దాఖలు నిమిత్తం నవంబర్ 11కి వాయిదా వేశారు.
జెత్వాని భూకబ్జా కేసులో చిక్కుకున్నారని, కస్టడీలో వేధించారని పేర్కొన్నారు. తనపై అభియోగాలను రూపొందించడంలో ముగ్గురు అధికారుల పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఆ ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారని ఆమె ఆరోపించారు.
ఇప్పటికి పలుమార్లు విచారించినప్పటికీ ఎటువంటి సమాచారం ఆయన బయటపెట్టలేదు. తనకీ ఈ కేసుకీ సంబంధం లేదనే బుకాయిస్తున్నారు. ఈసారి ఆయన్నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు పట్టుదలతో విచారణకు సిద్ధమయ్యారు. ఎవరి ప్రమేయంతో ఆమెపై కేసు పెట్టారనేది తేల్చనున్నారు.