VIVEKA MURDER|వైఎస్ వివేకా కుమార్తె సునీత అసెంబ్లీకి ఎందుకొచ్చినట్టు?

"సార్, మీరు అధికారంలోకి వచ్చి కూడా ఐదు నెలలు దాటింది. అయినా మా నాన్న హత్య కేసు దర్యాప్తు అడుగు ముందుకు పడడం లేదు. మీరైనా న్యాయం చేస్తారా లేదా?" అన్నారు సునీత

Update: 2024-11-19 07:53 GMT
చంద్రబాబుకు వినతిపత్రం అందించిన సునీత (ఫైల్ ఫోటో)
"సార్, మీరు అధికారంలోకి వచ్చి కూడా ఐదు నెలలు దాటింది. అయినా మా నాన్న హత్య కేసు దర్యాప్తు అడుగు ముందుకు పడడం లేదు. మీరైనా న్యాయం చేస్తారా లేదా?" అని వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత (YS SUNITHA) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుణ్ణి అడిగినట్టు సమాచారం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోం మంత్రి అనితతో మాట్లాడేందుకు ఆమె నవంబర్ 19న ఉన్నట్టుండి ఏపీ అసెంబ్లీకి వచ్చారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఏనాడూ అసెంబ్లీ మొహం చూడని ఆమె ఇలా రావడం ఏమిటా అని అనుకుంటుండగానే ఆమెను కొందరు నేరుగా సీఎం చాంబర్ వైపు తీసుకుపోయారు. ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా తన వ్యక్తిగత సహాయకులతో కలిసి ఆమె అసెంబ్లీకి వచ్చారు.
సీఎం అసెంబ్లీలో ఉండడంతో వైఎస్ సునీత ముందుగా హోం మంత్రి వంగలపూడి అనితతో మాట్లాడారు. ఆ తర్వాత సీఎంవో కార్యాలయానికి వెళ్లారు. అధికారులతో చర్చించారు. తన తండ్రి హత్య కేసులో పురోగతికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు, దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS VIVEKA MURDER) 2019 ఎన్నికలకు కొద్ది కాలం ముందు హత్యకు గురయ్యారు. ఆయనది గుండెపోటని, ఆ తర్వాత హత్యని రకరకాల వార్తలు రావడంతో కేసును తొలుత సీఐడీ అధికారులు చేపట్టారు. ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగింది. ఎంపీ అవినాశ్ రెడ్డిపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఆమె అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి.. జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని సునీత కోరినట్టు తెలిసింది. సుప్రీం కోర్టులో వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు.. ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై అడిగి తెలుసుకున్నారు.
ముందుగా హోంమంత్రి అనితతో మాట్లాడిన సునీత.. ఆపై సీఎంవో కార్యాలయానికి వెళ్లి అధికారులతో చర్చించారు. తన తండ్రి హత్య కేసులో పురోగతికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కోర్టు కేసులు, దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖలపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి స్పందన రావాలని కోరుతున్నారు. తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు వైఎస్ సునీత విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి అనితతో కూడా వైఎస్ సునీత మాట్లాడినట్లు సమాచారం.
కోర్టులో కేసు విచారణ..
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. ఈ కేసులో అవినాశ్ కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని సునీత సుప్రీంను ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై నవంబర్ 19న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ మొదలైంది. దీంతో పాటు సీబీఐ అధికారి రాంసింగ్‌పై దాఖలైన ప్రైవేట్ కంప్లెయింట్‌పైన విచారణ జరుగుతోంది. పిటిషనర్లతో కుమక్కై పదేపదే హింసిస్తున్నారంటూ రాంసింగ్‌పై వెంకటకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అలాగే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతలపై దాఖలైన కేసులపైనా విచారణ జరుగుతోంది. సునీత, రాజశేఖరరెడ్డిల తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపిస్తున్నారు. అయితే సీబీఐ తరపున అలాగే అవినాశ్ తరపున ఎవరూ హాజరుకాలేదు.
ఈ పరిస్థితుల్లో వైఎస్ సునీత అసెంబ్లీకి రావడం, సీఎంతో చర్చించడం దేనికి సంకేతమనేది తెలియలేదు.
Tags:    

Similar News