ఏసీపీ మునావర్‌పై సస్పెన్షన్ వేటు

అవినీతి ఆరోపణల మధ్య కీలక నిర్ణయం తీసుకున్న సీపీ సజ్జనార్.

Update: 2025-12-10 07:59 GMT

కూల్సుంపుర ఏసీపీ మునావర్‌పై సీపీ సజ్జనార్ సస్పెన్సన్ వేటు వేశారు. అవినీతి, భూ వివాదాలు, కేసుల తారుమారు ఈ విధంగా ఏసీబీ మునావర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన వ్యవహారంలో పోలీసు శాఖ విచారణ చేపట్టింది. అందులో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. మునావర్.. తన పాట వినని సిబ్బంది పట్ల పరువు తీసేలా వ్యవహరించేవారిని నిర్ధారితమైంది. ఈ విషయం తెలియడంతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మునావర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవలే కూల్సుంపుర పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ సునీల్‌ను సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఓ కీలక కేసులో విచారణను ప్రభావితం చేసేలా వ్యవహరించారన్న కారణంగానే సునీల్‌పై కఠిన చర్యలు తీసుకున్నారు. కేసులో నిందితుల పేర్లను ఉద్దేపూర్వకంగా మార్చారని, తద్వారా ఒక వర్గానికి అనుకూలంగా కేసును మార్చే ప్రనయత్నం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా సదరు వర్గం నుంచి ఇన్‌స్పెక్టర్ భారీమొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను తమ దృష్టికి రావడంతో ఉన్నతాధికారులు ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్ ఏసీపీపై కూడా సస్పెన్షన్ వేటు పడటం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Tags:    

Similar News