తెలంగాణలో గేమ్ చేంజర్ ఎవరు..?

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజేపిలు తమదైనశైలిలో సర్వశక్తులను కూడగట్టుకొని బరిలో నిలిచాయి.

Byline :  Sampath Kumar
Update: 2024-04-18 10:42 GMT

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బిజేపిలు తమదైనశైలిలో సర్వశక్తులను కూడగట్టుకొని బరిలో నిలిచాయి. ఎక్కువ స్థానాల్లో విజయం సాదించాలని ఫలితంగా, రాష్ట్ర రాజకీయాలతోపాటు తమ పార్టీ భవిష్యత్‌ను కూడా నిర్ణయిస్తాయని బలంగా నమ్ముతున్నాయి. దీంతో ఆయా పార్టీలు తమదైన వ్యూహంతో ఎన్నికల బరిలోకి దిగాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, బీజేపీ 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ మాత్రం 14 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించి, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్‌ చోట్ల అభ్యర్ధులను ప్రకటించాల్సి వుంది.

ఆయా నియోజకవర్గాల వారీగా ప్రత్యర్థులు ఎవరో తేలడంతో, అటు పా ర్టీలు, ఇటు అభ్యర్థులు ప్రజాక్షేత్రంలో ప్రచారంతోపాటు, బలప్రదర్శనలు చేస్తున్నారు. 2013 ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రత్యర్థి పా ర్టీలపై ఆధిక్యాన్ని ప్రదర్శించాలని చూస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ 14 , బిజేపి 10 , బిఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాదించాలన్న లక్ష్యంతో కదన రంగంలో పావులు కదుపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్న స్థానాల్లో విజయం సాదించి రాష్ట్ర రాజకీయాల్లో పట్టు సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

14 లక్ష్యంగా కాంగ్రెస్‌ ....

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో విజయం సాదించిన కాంగ్రెస్, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం వుండబోదని, ముఖ్యమంత్రి రేవంత్ మనుగడపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఇతర పా ర్టీల నుంచి విజయం సాదించిన శాసన సభ్యులు పార్లమెంట్ ఎన్నికల ముందే కాంగ్రెస్ లో చేరుతారని ఆపార్టీ నాయకులు భావించినా, అంతగా అనుకూలంగా లేని పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ ఫలితాలు సాదిస్తేనే ఇతర పా ర్టీల నుంచి చేరికలు ఉంటాయనే అంచనాకు వచ్చినట్టు కనిపిస్తోంది.

తెలంగాణలో కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ఇప్పటికే విపక్షాల విమర్శలను ఎదుర్కుంటున్నది. వీటికి తోడు ప్రస్తుత వేసవి కాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సాగు, తాగునీటి కష్టాలు, కరెంటు కోతలు, వరికి బోనస్, రైతు రుణమాఫీ వంటివి వాటిపై కూడా విపక్షాలు ప్రశ్నలు సందిస్తున్నాయి. వీటిని అధిగమించడమే అతిపెద్ద సవాలుగా భావించిన కాంగ్రెస్ పార్టీ, అసెంబ్లీ ఫలితాల కంటే ఎక్కువ స్థాయిలో విజయం సాదిస్తామని లెక్కలు వేసుకుంటోంది.

వలసలతో బిఆర్ఎస్ కు 11 సాధ్యమా :

రెడుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌, గత ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో, అన్ని స్థాయిల్లోని నాయకులు ఇతర పార్టీల వైపుకు వెల్తున్నారు. పార్టీ అభ్యర్ధులను ప్రకటించినా, టికెట్ వద్దనుకొని అభ్యర్థులే ఇతర పార్టీల్లోకి వెళ్శారు. దీంతో పార్టీ క్యాడర్‌ మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పవచ్చు. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఫోన్‌ ట్యాపింగ్‌ వంటి అంశాలు బిఆర్ఎస్ పై వ్యతిరేఖ ప్రభావం చూపుతున్నది.

కాగా పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలోనే కాంగ్రెస్, బిజేపిలు పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనలో జరిగిన లోపాలు ప్రచారాస్త్రాలుగా మారాయి. కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలవున్న వారి నుంచి ఎదురవుతున్న వరుస విమర్శలు, తీవ్రు ఆరోపణలకు, ఆ పార్టీ నాయకులు సమాధానాలు చెప్పాల్సి వస్తోంది. ఓఒక విధంగా చెప్పాలంటే బిఆర్ఎస్ అంతర్మధనంలో పడిపోయి, ఆత్మరక్షణ చేసుకుంటూ కాంగ్రెస్, బిజేపిలపై ఎదురుదాడి చేస్తొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, పార్టీ సంస్థాగత బలం ఆధారంగా ఎక్కువ సీట్లు సాధించేలా పావులు కదుపుతోంది. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావు స్టార్‌ క్యాంపెయినర్లుగా లోక్‌సభ ఎన్నికల్లో రెండు జాతీయపా ర్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే ఏకైక మార్గంగా పనిచేస్తున్నారు.

బిజేపికి మోదీ మంత్రంతో 10 సాధ్యమా :

2019లో నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాదించిన బిజేపి, ఈ ఎన్నికల్లో 10 స్థానాల్లో గెలుపొందాలని టార్గెట్ గా పెట్టుకున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లలో విజయం సాదించింది. కాగా గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, 25 అసెంబ్లీ నియోజక వర్గాలలో తీవ్ర ప్రభావాన్ని చూపించింది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీలతోపాటు, ఇతర కీలక నేతలను చేర్చుకొని అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేసింది. కేంద్రంలో మోదీపాలన, రామ మందిరం అంశాలు భారీగా ఓట్లు పడతాయని బిజేపి నాయకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల బలహీనతలు తమకు చాలా నియోజకవర్గాల్లో కలిసి వస్తుందని బిజజేపి భావిస్తోంది. కాగా తెలంగాణ వ్యాప్తంగా పటిష్టమైన సంస్థాగత బలం లేకపోవడం బీజేపీ ప్రధాన బలహీనతగా కనిపిస్తోంది. మే నెలలో జరిగే ప్రధాని మోదీ వరుస పర్యటనలు అనుకూల ఫలితాలను ఇస్తాయని ఆ పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల కంటే బిజేపి ఎక్కువ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని ప్రచారం జరుగుతున్నది.

కాగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లు, సాధించిన ఓట్లను ఏ పార్టీ కూడా లోక్‌సభ ఎన్నికల్లో ప్రామాణికంగా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పైచేయి సాధిస్తామనే ధీమా మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లో కనిపిస్తోంది.

Tags:    

Similar News