ఔరంగజేబును ప్రశంసిస్తూ ఎస్పీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

దేవాలయాలు కూలదోసి, వ్యక్తుల కళ్లు పీకి, సజీవంగా చర్మం ఒలిపించిన వ్యక్తిని ఎలా కీర్తిస్తారని శివసేన ఆగ్రహం;

Update: 2025-03-04 11:50 GMT

మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అబూ ఆజ్మీ మొగల్ పాలకుడు, మతోన్మాది ఔరంగజేబు ను కీర్తిస్తూ వ్యాఖ్యలు చేయడం దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై థానేలో పోలీస్ కేసు నమోదు అయింది.

మహారాష్ట్ర సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అజ్మీ మతోన్మాది ఔరంగజేబును ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారని, మతపరమైన మనోభావాలను కించపరిచారని ఆరోపిస్తూ శివసేన ఎంపీ నరేష్ మష్కే ఈ ఫిర్యాదు చేశారు.
ఆజ్మీపై భారతీయ న్యాయసంహిత(బీఎన్ఎస్) సెక్షన్లు 299, 302, 356(1), 356(2) కింద అభియోగాలు మోపారు. వీటిలో మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి , పరువు నష్టం కలిగించడానికి ఉద్దేశించిన సెక్షన్లు ఉన్నాయి.
దేశద్రోహ కేసు..
ఔరంగజేబుపై కేసు నమోదు చేసిన తరువాత మస్కే మాట్లాడుతూ..‘‘అబు ఆజ్మీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలి. అతనికి భారత్ లో ఉండే హక్కు లేదు. వేలాది హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన, మహిళలను హింసించిన, ఛత్రపతి శంభాజీ మహారాజ్ క్రూరంగా హింసించిన మతోన్మాది ఔరంజేబు దేశానికి వ్యతిరేకంగా ఉన్నాడు.
అతను దేశాన్ని దోచుకున్నాడు. ’’ అని అన్నారు. ఏక్ నాథ్ షిండే ఆదేశాల మేరకు తాము కేసు నమోదు చేయడానికి వచ్చామని అన్నారు.
మహారాష్ట్ర ఎమ్మెల్యే అబు అజ్మీ మాట్లాడుతూ.. ‘‘అప్పటి రాజులు కేవలం అధికారం, ఆస్తి కోసం పోరాడేవారు. కాకపోతే అది మతపరమైనది కాదు. ఔరంగజేబు 52 సంవత్సరాలు పాలించాడు. అతను హిందువును బలవంతంగా మతం మార్చి ఉంటే.. ఎంతమంది హిందువులు మతం మారారో ఊహించుకోండి. ఔరంగజేబు దేవాలయాలను ధ్వంసం చేసి ఉంటే, మసీదులను కూడా ధ్వంసం చేశాడు. అతను హిందువులకు వ్యతిరేకంగా ఉంటే, 34 శాతం మంది అతని ఉండేవారు కాదు.. అతని సలహదారులు హిందువులు కాదు’’ అని అన్నారు.
దీనికి హిందూ ముస్లిం కోణాలు ఇవ్వవలసిన అవసరంలేదు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. నేను హిందువులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు.
గతంలో అబు అజ్మీ ఏమన్నారంటే..
గతంలో ఎస్పీ అధ్యక్షుడు ఔరంగజేబు పాలనను ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేశారు. అతని పాలనంలో భారత్ సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్ వరకూ విస్తరించింది. అప్పట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన జీడీపీ 24 శాతం ఉండటంతో అప్పట్లో బంగారు పిచ్చుక అని పిలిచేవారని అన్నారు.
షిండే డిమాండ్..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే కూడా మొగల్ చక్రవర్తి మతోన్మాది ఔరంగజేబును కీర్తించినందుకు అజ్మీ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ నాయకుడి వ్యాఖ్యలను షిండే ఖండించారు.
ఆ వ్యాఖ్యలు జాతీయవాద ప్రముఖులను అవమానించడమే అన్నారు. మతోన్మాది శంభాజీ మహారాజ్ కళ్లు, వేళ్లు పీకీ నాలుక తొలగించి సజీవంగా చర్మం ఒలిపించిన వ్యక్తి ఎలా గొప్పవాడవుతాడని విమర్శలు గుప్పించారు.
అలాంటి వ్యక్తిని ప్రశంసించడం అనేది తీవ్రమైన నేరం అని, ఆజ్మీ వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు. మతోన్మాదిని కీర్తించడం ద్వారా అజ్మీ మన జాతీయ గర్వానికి చిహ్నాలైన ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ వంటి దేశభక్తులను అగౌరవ పరిచారు.
అతనిపై రాజద్రోహం అభియోగం మోపాలి’’ అని అన్నారు. శంభాజీ మహారాజ్ జీవితచరిత్ర ఆధారంగా హిందీలో విడుదలైన ‘ఛావా’విడుదలైన తరువాత ఈ వ్యాఖ్యలు రావడంతో వివాదం మరింతగా రాజుకుంది.
Tags:    

Similar News