సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మేనేజర్ మరణం పై నాపై అసత్య ప్రచారం: ఠాక్రే

మా వాదనలను కోర్టులో వినిపిస్తామన్నా మాజీ మంత్రి;

Update: 2025-03-20 11:51 GMT

బాలీవుడ్ ను కుదిపేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, ఆయన మేనేజర్ దిశా సాలియన్ మరణం పై తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ఆరోపణలపై కోర్టులో తన వాదనలు సమర్థవంతంగా వినిపిస్తానని శివసేన(యూబీటీ) నాయకుడు మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే అన్నారు.

దిశ సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ బుధవారం మాట్లాడుతూ.. జూన్ 2020 లో ఆమె మరణించిన అనుమానాస్పద పరిస్థితులపై తిరిగి దర్యాప్తు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
ఆదిత్య ఠాక్రే పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్ లో ఆయన డిమాండ్ చేశారు.
తన కుమార్తెపై అత్యాచారం చేసి, హత్య చేశారని, ఈ కుట్రలో ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులను రక్షించడానికి రాజకీయంగా కుట్ర పన్నారని కూడా పిటిషన్ లో పేర్కొన్నానని సతీష్ సాలియన్ విలేకరులకు తెలిపారు.
నా ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం..
‘‘నా ప్రతిష్టను దిగజార్చేందుకు గత ఐదు సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేము కోర్టులో మా వాదనలను ముందుకు తెస్తాము. ’’ అని మహారాష్ట్ర మాజీ మంత్రి థాకరే ఇక్కడ విలేకరులతో అన్నారు.
దిశా సాలియన్ జూన్ 8, 2020 న సబ్బరన్ మలాడ్ లోని ఒక నివాస భవనంలోని 14వ అంతస్థు నుంచి పడి మరణించారు. ముంబై పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ కేసును నమోదు చేశారు. ఆరు రోజుల తరువాత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన అపార్ట్ మెంట్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
బీజేపీ వ్యాఖ్యలు..
బీజేపీ మంత్రి నితీష్ రాణే మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు గత నిర్ణయాల ప్రకారం.. ఒక వ్యక్తి అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటుంటే అతన్ని అరెస్ట్ చేయాలని అన్నారు. ఠాక్రే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ‘‘మేము సభలో దీనిని లేవనెత్తుతాం’’ అని రాణా విలేకరులకు తెలిపారు.
ఠాక్రేను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాల వెనక బీజేపీ ఉందని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు శివసేన(యూబీటీ) నాయకుడు అంబదాస్ దన్వే ఆరోపించారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఈ కేసును దర్యాప్తు చేయడానికి స్వేచ్ఛ ఉందని ఆయన విలేకరులకు తెలిపారు. దిశా సాలియన్ తండ్రి ఐదు సంవత్సరాలుగా ఎందుకు మౌనంగా ఉన్నారని ఎన్సీపీ( ఎస్పీ) నాయకుడు జితేంద్ర అవ్హాద్ ప్రశ్నించారు.
Tags:    

Similar News