మంచు అక్కకు వీసా కష్టాలు: సాయం చేయమంటూ వేడుకోలు !
ఎప్పుడూ ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ధీమాగా కనిపించే మంచు లక్ష్మికి కష్టం వచ్చింది. సాయం చేయమంటూ దీనంగా నెటిజన్లను అభ్యర్థించింది.
Update: 2024-07-08 09:33 GMT
అసలు విషయం ఏమిటంటే, లక్ష్మి కుమార్తె అమెరికాలో చదువుతోంది. ఇప్పుడు వేసవి సెలవులు అవటంతో ఇండియాలో ఉంది. తనకు సెలవులు అయిపోవస్తున్నాయి. తనను అమెరికాలో దించటానికి అమెరికా వెళ్ళాలని చూస్తున్న లక్ష్మికి వీసా ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. దానిపై ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.
రెండు నెలల క్రితమే వీసా మంజూరు అయినప్పటికీ అది తనకు ఇంకా చేరలేదని పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీకి ఫ్లైట్ బుక్ చేసేసుకుని ఉండటంతో ఏమి చేయాలో తోచటంలేదని తెలిపారు. నిస్పృహతో ఉన్నానని, ఎవరైనా సాయం చేయగలరు అని అభ్యర్థిస్తూ నీడ్ హెల్ప్ అర్జంట్లీ అని పోస్ట్ పెట్టారు.