వామ్మో.. ఏంటా ఫాలోయింగ్.. షేక్ అవుతున్న సోషల్ మీడియా

అనుచరులు అంటే ఓ వంద మంది ఉంటే తోపు.. వెయి అయితే వాడే కింగ్.. లక్ష దాటితే ఇక చెప్పాల్సిన పని లేదు. అదే వంద కోట్ల ఫాలోవర్లు ఉంటే ఏమనాలి..

Update: 2024-09-14 10:09 GMT

గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ గురించి ఓ రావు రమేష్ ఓ డైలాగ్ చెబుతాడు.‘‘ మార్కెట్లో అతని ఫాలోయింగ్ ను చూస్తూ పిచ్చెక్కి పోతుంది’’ అని... ఇప్పుడు ప్రపంచం కూడా ఓ క్రీడాకారుడి ఫాలోయింగ్ చూసి ఇలాగే అనుకుంటున్నారు.. వందలు .. వేలు కాదు.. ఏకంగా వన్ బిలియన్ అంటే వందకోట్ల ఫాలోవర్లతో చరిత్ర సృష్టించాడు ఆ ఆటగాడు. ఇంతవరకూ ఏ క్రీడాకారుడు, రాజకీయనాయకుడు గానీకి ఇంత సంఖ్యలో ఫాలోవర్లు లేరు. దీనితో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన మొదటి వ్యక్తిగా సాకర్ స్టార్, పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో వార్తల్లోకెక్కాడు.

రోనాల్డోకి ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్, యూ ట్యూబ్, చైనీస్ సామాజిక మాధ్యమాలు అయిన కుషియావ్, వైబో లు కలిసితే అతని ఫాలోవర్ల సంఖ్య ఇంత అని తేలింది. యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాలని రోనాల్డో నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా తన ఫాలోవర్ల సంఖ్య పెరగడం ప్రారంభించింది. 

ఛానెల్ మొదటి రోజు 10 మిలియన్ల మంది సభ్యులను, ప్రారంభించిన ఒక వారంలో 50 మిలియన్ల మంది సభ్యులను సంపాదించుకుంది. ఇప్పుడు దాదాపు 60 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. అయితే ఇందులో కొన్ని నకిలీ ఫాలోవర్లు కూడా ఉన్నారని తెలిసింది. కొంతమంది అభిమానులు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అతన్ని అనుసరిస్తున్నారు. అయితే, క్రిస్టియానో రొనాల్డో సాధించిన ఈ అద్భుతమైన విజయాన్ని తక్కువ చేసి చూడట్లేదు.
హృదయపూర్వకంగా..
“మేము చరిత్ర సృష్టించాము – 1 బిలియన్ అనుచరులు! ఇది కేవలం ఒక సంఖ్య కంటే ఎక్కువ - ఇది ఆట, అంతకు మించి మా భాగస్వామ్య అభిరుచి, డ్రైవ్, ప్రేమకు నిదర్శనం" అని రొనాల్డో ఎక్స్ లో పోస్ట్ చేశాడు. "మదీరా వీధుల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు, నేను ఎల్లప్పుడూ నా కుటుంబం, మీ కోసం ఆడాను. ఇప్పుడు మనలో 1 బిలియన్ల మంది కలిసి నిలబెట్టారు" అని అతను రాశాడు.
రికార్డులు పుష్కలంగా..
రికార్డులు సృష్టించడం క్రిస్టియానో రొనాల్డోకు అలవాటుగా మారింది. ఇప్పుడు తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఈ కొత్త రికార్డు తన పేరు మీద సృష్టించుకున్నాడు. రొనాల్డో UEFA ఛాంపియన్స్ లీగ్ చరిత్రలో 183 మ్యాచ్‌లలో పాల్గొని 140 గోల్స్‌తో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. మూడు ఫైనల్స్‌లో గోల్ చేసిన ఏకైక ఆటగాడు రోనాల్డోనే. అతను తన రికార్డ్-బ్రేకింగ్ ఫీట్‌లకు ఆగస్టులో UEFA నుంచి ప్రత్యేక అవార్డును అందుకున్నాడు. అతను యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక గోల్స్ చేశాడు.
తన దేశం పోర్చుగల్ కోసం ఆడుతున్న ఇతర ఫుట్‌బాల్ క్రీడాకారుల కంటే ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. గత వారంలో 900 టాప్-లెవల్ కెరీర్ గోల్స్ చేసిన మొదటి ఫుట్‌బాల్ ఆటగాడిగా రికార్డుల కెక్కాడు. ఫోర్బ్స్ ప్రకారం, అథ్లెట్ సంపాదన - $260 మిలియన్లు.
నంబర్లు ఎలా..
ఇన్‌స్టాగ్రామ్‌లో 639 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 170.5 మిలియన్లు, ఎక్స్‌లో 113 మిలియన్లు, యూట్యూబ్‌లో 60.6 మిలియన్లు, మిగిలిన చైనీస్ ప్లాట్‌ఫారమ్‌లు కుయిషౌ, వీబోలో రొనాల్డో ఈ తాజా మైలురాయిని చేరుకున్నారు. రోనాల్డో తరువాతి స్థానంలో పాప్ సింగర్ సెలీనా గోమోజ్ ఉన్నారు. ఆమెకు 690 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
మూడో స్థానంలో మరో సాకర్ ఆటగాడు, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ ఉన్నాడు. అతడికి 623 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కెనడియన్ గాయకుడు టీనేజ్-సెన్సేషన్ అయిన జస్టిన్ బీబర్ 607 మిలియన్ల ఫాలోవర్లతో తర్వాతి స్థానంలో ఉన్నారు, 574 మిలియన్ల ఫాలోవర్లతో ప్రముఖ అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తర్వాతి స్థానంలో ఉన్నారు.
Tags:    

Similar News