బీజేపీ అభ్యర్థి మాధవీలతపై పోలీసు కేసు..మహిళల బురఖా ఎత్తినందుకు...

పోలింగ్ కేంద్రానికి వచ్చిన ముస్లిం ఓటర్ల పరదాలను తొలగించిన ఘటనపై ఈసీ అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు.

Update: 2024-05-13 08:15 GMT
ముస్లిం ఓటర్ల బురఖాలను తొలగించి చూస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవీలత

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలతపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయాలని సాక్షాత్తూ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు.

- పోలింగ్ కేందాల వద్ద ఉన్న ముస్లిం మహిళల బురఖాలను మాధవీలత తొలగించి, వారి ముఖాలు చూస్తూ, వారి ఓటరు ఐడీ కార్డులను పరిశీలిస్తున్న విషయాన్ని ఎన్నికల అధికారి తీవ్రంగా తీవ్రంగా తీసుకున్నారు.

- మహిళా ఓటర్లను పోలింగ్ బూత్‌ల వద్ద బురఖా తొలగించాలని కోరిన బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఐపీసీ 171సీ, 186, 505(1)(సి) సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద హైదరాబాద్ పోలీసులు  కేసు నమోదు చేశారు.

- మాధవీలత ముస్లిం మహిళల బురఖాలు తొలగించడంపై మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. - బీజేపీ అభ్యర్థి కె మాధవి లత పోలింగ్ బూత్‌లో బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేసి, వారిని బురఖా తొలగించమని కోరుతున్న వీడియో వెలువడడంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్ కార్యకర్తలు భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
- ఓట్లు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన ముస్లిం మహిళ ల యొక్క బురఖా తొలింగించి ముఖ పరిశీలన విషయం పై ఎఫ్ ఐ అర్ నమోదుకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ హైదరాబాద్ పోలీసులను ఆదేశించారు.

ఆజంపురా పోలింగ్ బూత్ లో ఏం జరిగిందంటే...
అజంపూర్‌లోని పోలింగ్ బూత్‌ కు వచ్చిన మాధవీలత అక్కడ ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళల ఐడీలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఐడీని చూసి బురఖా ధరించిన స్త్రీని తన ముసుగును ఎత్తమని మాధవీలత అడగిన వీడియో వెలుగుచూసింది. ఐడీ కార్డులను సరిగ్గా సరిచూసుకున్న తర్వాతే ఓటింగ్‌కు అనుమతించాలని మాధవీలత పోలింగ్‌ అధికారులను కోరారు. ఓటరు జాబితాలో తేడాలున్నాయని, పలువురు ఓటర్ల పేర్లు జాబితాలో లేవని ఆమె ఆరోపించారు.


Tags:    

Similar News