ఏం చేశారు మీరు.. ఏం చేస్తారు మీరు: బీజేపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్నలు

బడ్జెట్ లో 69 శాతం అధికారుల జీతాలు, అప్పుల పై వడ్డీపై పోతుందని మీరు విడుదల చేసిన శ్వేత పత్రంలో చెప్పారని, కొత్త అప్పులు తేకుండా అభివృద్ది ఎలా చేస్తారన్నారు.

Update: 2023-12-20 10:23 GMT
తెలంగాణ శాసనసభ

‘తెలంగాణలో అప్పులు తీసుకొచ్చి.. అప్పుడు కట్టారు, మూడు డీఏలు పెండింగ్ లో పెట్టారు, విద్యరంగానికి నిధుల కేటాయింపులో చివరిస్థానంలో ఉన్నాం, వైద్యం విషయంలో తెలంగాణ 29 వ స్థానంలో ఉంది’ మరీ మీరు ఏం అభివృద్ది చేశారని గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే శాసనసభ పక్షం నాయకుడు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి  ప్రశ్నించారు.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం శ్వేత పత్రం విడుదల చేసి, అప్పుల కుప్ప అయిందని చెబుతున్నారని, మరీ ఎన్నికల్లో హమీ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏం విధంగా అమలు చేస్తున్నారని, ఈ నివేదిక వల్ల పెట్టుబడులు రాకపోతే పరిస్థితి ఏంటనీ ప్రశ్నించారు. ఇచ్చిన హమీలు అమలు చేయకపోతే ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వరని, ఈ విషయాలన్నీ మీకు ముందు ముందు తెలుస్తాయని చురక వేశారు.

గెలిచిన సమయంలోనే రూ. 500 హమీ ఇచ్చారని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ప్రజలకు వంద రోజుల్లో ఇచ్చిన హమీలు అమలు చేయకపోతే తాము ప్రజల తరఫున ప్రశ్నిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను వివరించారు. తాము ఎన్ని చేసిన చేయలేదనే ప్రచారం చేస్తున్నారని, వాటిని ఖండించారు. 1 నుంచి 8 కి వచ్చాం. 8 నుంచి 80 కి వస్తాం. రేపే మేము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 9 తేదీనే రెండు లక్షల రుణమాఫీ ఇస్తామని ప్రకటించారని, వాటికి మీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశాన్ని అమ్మేస్తున్నారు: మంత్రి పొన్నం ప్రభాకర్

మీరు( బీజేపీ ఎమ్మెల్యేలు) మాకు సహకరించడి. రాష్ట్ర ప్రభుత్వం ఫెడరల్ సిస్టమ్ నుంచి నిధులు తేవడంలో సహకరించమని కోరుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. దేశాన్ని మోడీ ప్రభుత్వం అమ్మెస్తోందని, కాంగ్రెస్ పార్టీకీ ఉన్న పరపతి దేశంలో ఏ పార్టీకీ లేవని అన్నారు. పార్లమెంట్ పై దాడి చేస్తే ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, 143 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు.

Tags:    

Similar News