
కగార్ ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చి పడిన పథకo కాదు.
‘అణచివేతలకు ఆశించినంత ప్రతిఘటన రాలేదు’
ఇటీవల హైదరాాబాద్ లో జరిగిన పూర్వ విప్లవవిద్యార్థులసమ్మేళనం విశేషాలు:2
మొదటి భాగం ఇక్కడ చదవండి.
తెలంగాణ సి.ఎల్.సి అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ కగార్ మొదలుపెట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్నది, అది ఉన్నట్లుండి ఊడిపడిన పిడుగు కాదని అన్నారు.
"ఇలాంటి పథకాలు కగారుకు ముందు చాలానే ప్రకటించారు. కగార్ 2024 ప్రకటించినా దానికంటే ముందు 1990లోనే జనజాగారణ అభియాన్ యోజన పథకాన్ని పెట్టి 2005 వరకు కొనసాగించారు.కగారు కంటే ముందు ఈ పథకం ద్వారా చేసినది ఏమంటే ఎక్కడ కనబడితే అక్కడ చంపేస్తూ ఆదివాసుల్లో ఒక భయానకా వాతావరణాన్ని కల్పించారు," అని అన్నారు.
ఇప్పటి భౌతిక పరిస్థితులు చూసిన తర్వాత రాజ్యాంగo అమలు జరుగుతున్న పరిస్థితుల్లో ఉన్నామా అనిపిస్తుందని ఆయన అన్నారు.
"మావోయిస్టులకు ప్రజలకు ఉన్న సంబంధాలను కూడా తుంచి వేయడానికి ఎంతో నిర్బంధం ప్రయోగించారు. 15 సంవత్సరాలపాటు జన జాగరణ అభియాన్ ద్వారా ఆదివాసి సమూహంలో భయాందోళనలను సృష్టించగలిగారు. అడవుల్లో బ్రతికే ఆదివాసులు భయపడటం సహజం కదా. అయితే దాని పేరు మార్చి 2005నుంచి 2009 వరకు సాల్వాజుడుo తెచ్చి మరింత క్రూరంగా ప్రవర్తించారు.మరింత విస్తృతంగా దాడులు మొదలుపెట్టారు.మహిళలపైన అసంఖ్యాకంగా అత్యాచారాలు చేశారు.ఇవి గణాంకాలకు కూడా అందనివి.సాల్వాజుడుం ప్రత్యేకత ఏమిటంటే ఎస్పీఓ ((Special Police Officer)) లను చేర్చుకోవడం.పండ్లు,దుంపలు, ఆకుల కోసం అడవికి వెళ్ళిన మహిళలను పోలీసులు, బెటాలియన్లు,ఎస్ పి ఓ లు ఏం చేస్తారో మనకు తెలియంది కాదు. గణాంకాలకు అందని అత్యాచారాలు,వేల సంఖ్యలో గుడిసలను,గ్రామాలకు గ్రామాలను తగలపెట్టారు," అని ఆయన వివరించారు.
అయితే, 1990 మొదలుపెట్టి ఇప్పటి వరకు కగార్ వంటి అణిచివేతలకు ఎవ్వరూ కూడా స్పందించాల్సినంతగా స్పందించలేదని ఆయన వ్యాఖ్యానించారు.
"జడ్జీలు,మేధావులు స్పందించాల్సినంతగా స్పందించలేదు. ఇప్పుడు మనం చూస్తున్న మౌనాన్ని ఒక అవకాశంగా తీసుకున్న కేంద్ర,రాష్ట్రాలు మనముందు ఒక శూన్యాన్ని, బూడిదను మిగల్చుతున్నాయి. మనం చేస్తున్నది ఏమిటంటే అమరుల శవాలను తీసుకొచ్చి,కీర్తిస్తూ దహనసంస్కారాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాం.కానీ ఇంతకు మించిన స్పందన రావాలి," ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు.
"సల్వాజుడుం రాజ్యాంగ వ్యతిరేకమైనదని,నందిని సుందర్ కోర్టులో కేసు వేస్తే,మన ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి సల్వాజుడుo రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు చెప్పి చరిత్రలో నిలిచిపోయారు. ఈ తీర్పుతో ప్రభుత్వం ఊరుకుంటుoదా? ఆ ఎస్.పి.ఓ లను డిఆర్జీ(District Reserve Guard)లో చేర్చుకున్నారు.2009 తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ ను ఏర్పాటు చేయగా 2017 వరకు పర్యావరణానికి గ్రీనరీ లేకుండా,అనేక వేల గృహ దహనాలు,గణాంకాలకు అందనంతగా మహిళలపై అత్యాచారాలు చేశారు.ఈ ధమనకాండ అంతా మహేంద్రకర్మ తన నాయకత్వంలో కొనసాగించాడు," అని ఆయన అన్నారు.
భోజన విరామం తరువాత దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా సెషన్ కు బిజిగిరి శ్రీనివాస్,ఝాన్సీలు అధ్యక్ష వర్గంగా ఉండగా, 'తల్లులు బిడ్డలు' పుస్తక రచయిత మహమ్మద్ హుస్సేన్,ఎన్.రవి ప్రసంగించారు.
ఎన్.రవి మాట్లాడుతూ భారతదేశ విప్లవం రష్యా మార్గాన్నో,చైనా మార్గాన్నో అనుసరించటం లేదని,భారత విప్లవానికి తనదైన ప్రత్యేక మార్గాన్ని(పంథాను)దశలవారీగా అనుసరిస్తున్నారని స్పష్టం చేశారు. భారతదేశ విప్లవ పంథా రష్యా మార్గమా? చైనా మార్గమా? అని ప్రశ్నించుకున్నప్పుడు 1948 నుండి చైనా మార్గంలో రైతాంగ పోరాటం మొదలయింది.తెలంగాణ పోరాటంలో అనేక మంది గెరిల్లాలను కోల్పోయి, పోరాటాన్ని విరమించిoది.తిరిగి 1967... 69లో చారుమజుందార్ నాయకత్వంలో నక్సల్బరి,దాని తర్వాత శ్రీకాకుళ పోరాటాలు జరిగాయి.చైనా కూడా 1927లో రష్యా మార్గంలో ప్రయత్నించి వేలాదిమంది కమ్యూనిస్టులను ఊచకోతల్లో పోగొట్టుకున్నాకే దీర్ఘకాలిక పంథా చేపట్టిందని అని అన్నారు.
దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా సెషన్ కు అధ్యక్షత వహించిన బిజిగిరి శ్రీనివాస్ దీర్ఘకాలిక సాయిధ పోరాట పంథాలో మావోయిస్టులు ఏం చేశారు? అంటే ' బాంచన్ దొర కాలు మొక్కుతా' అనే పదాన్ని మాయం చేసింది. కులాన్ని, వెట్టిచాకిరిని, అణిచివేతను, మనిషిని మనిషిగా చూడలేని పరిస్థితులను పారదోలింది అని అన్నారు.
"ఇప్పుడు జరుగుతున్న మారణ హోమాన్ని కొనసాగిస్తూ అంతర్గత యుద్ధం చేస్తున్నది ప్రభుత్వాలే. మనoదరం దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథా కొనసాగుతుందా అనే గందరగోళాన్ని చూస్తున్నాం. ఈ సందర్భంగా కొత్తగా కగారేశ్వర పీఠం ఏర్పడింది.ఆ పీఠంలో ఇద్దరు ప్రవక్తలు ప్రవచనాలు ఇస్తున్న సందర్భాలను చూస్తున్నాం," అని శ్రీనివాస్ అన్నారు.
తల్లులు--బిడ్డలు రచయిత మహమ్మద్ హుస్సేన్ గారు ప్రసంగిస్తూ "ప్రజల మద్దతు లేకుండా ఏ ఉద్యమము నిలవదు.ఒకవైపు ప్రజాసంఘాలను,ప్రజాఉద్యమాలను ఎంతో కష్టపడి నిర్మిస్తున్నారు.పకృతిని కాపాడారు.పార్టీ అక్కడికి వెళ్లిన తర్వాతనే స్కూల్స్ హాస్పిటల్ లు పెట్టేరు. వైద్య సౌకర్యాన్ని అందించారు.చెరువులు బావులు తవ్వించారు. బ్రిడ్జిలను నిర్మించారు.వ్యవసాయం నేర్పించారు.ఇంటి ముందు శుభ్రం చేసుకోవడం నేర్పించారు. రుద్దిరుద్ది పిల్లలకు స్నానాలు చేయించారు.చేయటం నేర్పించారు.జనతన సర్కార్ ప్రత్యామ్నాయ పాలన జరిగింది. 70 ఏళ్లుగా ఈ ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోతున్నాయి అని ప్రశ్నించారు. ఇక్కడ కులాలుగా, మతాలుగా అనేక రకాలుగా ఉన్నారు.కనుక ఇక్కడ దీర్ఘకాలికంగానే సాయుధ విప్లవం జరుగుతుందని ముగించారు. మీరు గుర్తు పెట్టుకోవాలి,"అని అన్నారు.
‘విద్రోహాలు, త్యాగాలు ఫాసిస్టు సందర్భంలో విప్లవోద్యమం’ సెషన్కు అధ్యక్షులుగా ఉండిన లక్ష్మారెడ్డి మాట్లాడుతూ "ఆయుధాలను వదిలేయండి అని పూర్వ విప్లవ విద్యార్థులుగా మనము పిలుపునిద్దాం.తప్పులేదు కానీ ఎవరు ముందుగా ఆయుధాలు చేపట్టారు వారు కదా ముందుగా వదలి వేయాల్సింది," అన్నారు.
నవజ్యోతి మాట్లాడుతూ చుట్టుముట్టి దాడులు చేస్తూ మూకుమ్మడి హత్యలతోనే కాకుండా బిజెపి సoఘ్ పరివార శక్తులు ప్రమేయంతో సాంస్కృతిక భావజాల రంగాలలో చాందసవాద ధోరణలతో పెద్ద ఎత్తున భారత సమాజాన్ని కమ్మి వేస్తుందన్నారు.
పాణి మాట్లాడుతూ ఇపుడు జరుగుతున్న లొంగుబాట్లు వ్యక్తుల స్థాయిలో చూడకుండా మొత్తం విప్లవ పంథాకు ఆపాదిస్తూ తప్పుడు వాదనలు చేస్తూ అభిమానుల నైతిక బలాన్ని దెబ్బతీయడం ద్వారా సూరజ్ కుండ్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయ ప్రయత్నిస్తున్నారని అన్నారు. మాజీల విద్రోహ చర్చలను,తప్పుడు వాదనలను శాస్త్రీయంగా ఎదుర్కొంటూ, ఉద్యమాలకు అండగా నిలవాలని పిలుపునిస్తూ ముగించారు. (అయిపోయింది)

