నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి
x

నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. ఎన్నికల ఫలితాల్లో మూడు పార్టీలూ తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.


తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదంటే తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. లోక్ సభలో 13 స్థానాలు కైవసం చేసుకుంటామంటుంటే, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధిస్తామంటోంది. ఇక హ్యాట్రిక్ కొడతామని బోర్లాపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలని ఆశగా ఉంది. పార్టీలే కాదు, అత్యంత హైప్ తో సాగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నేటి (మంగళవారం) తో ఆ ఉత్కంఠకు తెర పడనుంది. మరి కొన్ని గంటల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఫలితాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ది ఫెడరల్ వెబ్సైట్ లైవ్ ఫాలో అవండి.

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్‌ జరిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.

ఇక ఈరోజే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి గణేష్ నారాయణన్, బీజేపీ నుంచి వంశి తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత బరిలో ఉన్నారు.

Live Updates

  • 4 Jun 2024 6:57 AM GMT

    ఎవరెవరు ఎంత ఆధిక్యం...

    సికింద్రాబాద్‌లో బీజేపీకి 32 వేల ఆధిక్యం, మల్కాజ్‌గిరిలో బీజేపీకి లక్షా 72 వేల ఓట్ల లీడ్, హైదరాబాద్‌లో 59 వేల ఆధిక్యంలో ఎంఐఎం, వరంగల్‌లో 92,726 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌, భువనగిరిలో లక్షా 6 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌, చేవెళ్లలో 70 వేల ఓట్ల లీడ్‌లో బీజేపీ, జహీరాబాద్‌లో 17 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, పెద్దపల్లిలో 50 వేల ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్‌, నిజామాబాద్‌లో 39 వేల ఆధిక్యంలో బీజేపీ, నాగర్‌కర్నూల్‌లో 28 వేల ఆధిక్యంలో కాంగ్రెస్‌, కరీంనగర్‌లో లక్షా 13 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, ఖమ్మంలో 2.66 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌. 

  • 4 Jun 2024 6:44 AM GMT

    చేవెళ్ల ఐదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 61783 లీడ్ 

  • 4 Jun 2024 5:55 AM GMT

    17 నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఆధిక్యం

    1.ఆదిలాబాద్

    బీజేపీ-39808,

    2.భువనగిరి

    కాంగ్రెస్-48622,

    3.చేవెళ్ల 

    బీజేపీ-27585,

    4.మహబూబాబాద్

    కాంగ్రెస్-80364

    5.పెద్దపల్లి

    కాంగ్రెస్-24511,

    6.హైదరాబాద్

    AIMIM-34125

    7.కరీంనగర్

    బీజేపీ-64408,

    8.ఖమ్మం

    కాంగ్రెస్-148091,

    9.మహబూబ్ నగర్

    బీజేపీ-4388,

    10.మల్కాజిగిరి

    బీజేపీ-105472,

    11.మెదక్

    బీజేపీ-750,

    12.నాగర్ కర్నూల్

    కాంగ్రెస్-16202,

    13.నల్గొండ

    కాంగ్రెస్-142695,

    14.నిజామాబాద్

    బీజేపీ-17832,

    15.సికింద్రాబాద్

    బీజేపీ-34076,

    16.వరంగల్

    కాంగ్రెస్-48790,

    17.జహీరాబాద్

    కాంగ్రెస్-12368

  • 4 Jun 2024 5:45 AM GMT

    మెదక్ పార్లమెంటు నాల్గవ రౌండ్ ఓవరాల్

    కాంగ్రెస్- 82398

    బీజేపీ-85054

    బీఆర్ఎస్  -85853

    4 వ రౌండ్ ముగిసే సరికి ఓవరాల్ గా 799 ఓట్ల తో *బి అర్ ఎస్ పార్టీ ముందంజలో ఉంది.

  • 4 Jun 2024 5:44 AM GMT

    నల్గొండలో 10 వ రౌండ్

    నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 10వ రౌండ్ పూర్తయ్యే సరికి 1 లక్ష 97 వేల ఆధిక్యం. అత్యంత అధిక్యతతో దూసుకెళ్తున్న నల్గొండ కాంగ్రెస్

  • 4 Jun 2024 5:40 AM GMT

    భువనగిరి ఐదవ రౌండ్ ఫలితాలు

    కాంగ్రెస్ : l61557

    బిజెపి :103342

    బిఆర్ఎస్:71273

    కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 58215... ఓట్ల ఆధిక్యం..

  • 4 Jun 2024 5:39 AM GMT

    మెదక్ మూడో రౌండ్

    ఆధిక్యంలోకి వచ్చిన బీజేపీ

    INC- 63273

    BRS- 63655

    BJP- 65386

    మూడో రౌండ్ ముగిసే సరికి 1731 ఓట్ల ముందంజలో BJP అభ్యర్థి రఘునందన్ రావు

  • 4 Jun 2024 5:38 AM GMT

    కరీంనగర్ లో 5 రౌండ్ పూర్తయ్యే సరికి

    కరీంనగర్ లో 5 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 63,985 ఓట్ల ఆధిక్యత

    బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 14,2675

    కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 78,690

    బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 66,351

  • 4 Jun 2024 5:38 AM GMT

    ఉదయం 11 గంటలకు అప్డేట్స్

    తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను ఉదయం 11 గంటలకు బిజేపి, కాంగ్రెస్ హోరా హోరీ పోరాటం చేస్తున్నాయి. 8 స్థానాల్లో కాంగ్రెస్, 8 స్థానాల్లో బిజేపి, ఒక స్థానంలో ఎంఐఎం లీడ్లో కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, భవనగిరి, జహీరాబాద్ లలో కాంగ్రెస్, చేవెళ్ళ, కరింనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, నిజామాబాద్, మెదక్ లలో బిజేపి, హైదరాబాద్ లో ఎంఐఎం లీడ్లో కొనసాగుతున్నాయి.

  • 4 Jun 2024 5:36 AM GMT

    కంటోన్మెంట్ ఉప ఎన్నిక 3 రౌండ్

    కంటోన్మెంట్ ఉప ఎన్నిక 3 రౌండ్

    బీఆర్ఎస్ - 15629

    బీజేపీ - 12231

    కాంగ్రెస్ - 23747కంటోన్మెంట్ ఉప ఎన్నిక 3 రౌండ్

    8018 లీడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్...

Read More
Next Story