నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. ఎన్నికల ఫలితాల్లో మూడు పార్టీలూ తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదంటే తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. లోక్ సభలో 13 స్థానాలు కైవసం చేసుకుంటామంటుంటే, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధిస్తామంటోంది. ఇక హ్యాట్రిక్ కొడతామని బోర్లాపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలని ఆశగా ఉంది. పార్టీలే కాదు, అత్యంత హైప్ తో సాగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నేటి (మంగళవారం) తో ఆ ఉత్కంఠకు తెర పడనుంది. మరి కొన్ని గంటల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఫలితాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ది ఫెడరల్ వెబ్సైట్ లైవ్ ఫాలో అవండి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.
ఇక ఈరోజే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి గణేష్ నారాయణన్, బీజేపీ నుంచి వంశి తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత బరిలో ఉన్నారు.
Live Updates
- 4 Jun 2024 10:44 AM IST
మల్కాజిగిరి పార్లమెంటు ఓట్ల లెక్కింపు లో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఒక లక్ష 447 ఓట్ల లీడింగ్ లో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఈయనకి రెండు లక్షల 447 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఒక లక్ష 64 వేల 470 ఓట్ల తో రెండో స్థానంలో ఉన్నారు
- 4 Jun 2024 10:42 AM IST
ఒక్కచోట బీఆర్ఎస్ లీడ్
మెదక్ పార్లమెంటు రెండవ రౌండ్ ఓవరాల్
కాంగ్రెస్- 41099
బీజేపీ-42021
బీఆర్ఎస్ -42741
2 వ రౌండ్ ముగిసే సరికి 720 ఓట్ల తో బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉంది
- 4 Jun 2024 10:40 AM IST
బండి సంజయ్ లీడ్
కరీంనగర్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో 3వ రౌండ్ పూర్తి.
బండి సంజయ్ బీజేపి:- 86447
వెలిచాలా రాజేందర్ కాంగ్రెస్:- 47134
వినోద్ కుమార్ బీఆర్ఎస్:- 39228
లీడ్:- 39313 ఓట్లతో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం.
- 4 Jun 2024 10:36 AM IST
మూడవ రౌండ్ లో AIMIM లీడ్
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మూడు రౌండ్లు పూర్తి..
AIMIM- 63551
BJP- 45770
- 4 Jun 2024 10:34 AM IST
ఖమ్మం జిల్లా:
నాల్గవ రౌండ్ వరకు పార్లమెంట్ పరిధి మొత్తం మీద కాంగ్రెస్ మెజార్టీ 54,654
- 4 Jun 2024 10:33 AM IST
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు రౌండ్ ముగిసే సరికి 20 వేల పై చిలుక ఆధిక్యం.
- 4 Jun 2024 10:27 AM IST
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం 4 వ రౌండ్
కిషన్ రెడ్డి, బిజెపి - 17629
దానం నాగేంద్ర, కాంగ్రెస్ - 10076
పద్మారావు, బీఆర్ఎస్ - 4685
7,553 ఓట్లతో కిషన్ రెడ్డి ముందంజ
- 4 Jun 2024 10:14 AM IST
రెండవ రౌండ్ లో ఈటల ఆధిక్యం
మల్కాజ్గిరి పార్లమెంట్ రెండవ రౌండ్ ఓట్ల లెక్కింపులో 39785 ఓట్ల ముందుంజలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్
బీజేపీ - 101982
కాంగ్రెస్ - 62197
బీఆర్ఎస్ - 33097
- 4 Jun 2024 9:56 AM IST
సికింద్రాబాద్ పార్లమెంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం.
సికింద్రాబాద్ పార్లమెంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం.
రెండవ రెండ్
బిజెపి. 2771
కాంగ్రెస్ 6627
బిఆర్ఎస్ 734
అసెంబ్లీ సెగ్మెంట్లో మూడవ రౌండ్ సుమారు 3800 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ పై బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి వెనుకంజ