నేడే తెలంగాణ ఫలితాలు... లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. ఎన్నికల ఫలితాల్లో మూడు పార్టీలూ తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య లోక్ సభ ఎన్నికల సమరం హోరాహోరీగా సాగింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమదంటే తమదే పైచేయి ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకున్న కాంగ్రెస్.. లోక్ సభలో 13 స్థానాలు కైవసం చేసుకుంటామంటుంటే, అబ్ కీ బార్ చార్ సౌ పార్ అంటున్న బీజేపీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధిస్తామంటోంది. ఇక హ్యాట్రిక్ కొడతామని బోర్లాపడ్డ బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుని పరువు నిలబెట్టుకోవాలని ఆశగా ఉంది. పార్టీలే కాదు, అత్యంత హైప్ తో సాగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. నేటి (మంగళవారం) తో ఆ ఉత్కంఠకు తెర పడనుంది. మరి కొన్ని గంటల్లో తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయి. పార్లమెంటు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఫలితాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ది ఫెడరల్ వెబ్సైట్ లైవ్ ఫాలో అవండి.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 34 చోట్ల ఓట్ల లెక్కింపు జరగనుంది. 4వ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు 1,855 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 24 రౌండ్లలో, అత్యల్పంగా మూడుచోట్ల 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుపుతున్నారు.
ఇక ఈరోజే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నిక ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి గణేష్ నారాయణన్, బీజేపీ నుంచి వంశి తిలక్, బీఆర్ఎస్ నుంచి నివేదిత బరిలో ఉన్నారు.
Live Updates
- 4 Jun 2024 9:55 AM IST
చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్
చేవెళ్ల పార్లమెంట్ ఓటింగ్ కౌంటింగ్ అప్డేట్స్(శేర్లింగంపల్లి అసెంబ్లీ) రెండవ రౌండ్ ముగిసే సమయానికి.. అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జ్ఞానేశ్వర్:- 3933
బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి:- 23394
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి:- 9225
ముందంజలో దూసుకుపోతున్న బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి 14169ఆధిక్యం
- 4 Jun 2024 9:54 AM IST
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు...
మొదటి రౌండు పూర్తయ్యేసరికి....
గోమాస్ శ్రీనివాస్ బీజేపి:- 18,401
గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్:- 23,495
కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్:- 9312
లీడ్:- 5094 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ లీడ్
- 4 Jun 2024 9:53 AM IST
మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం
బి ఆర్ ఎస్ 17,697
బిజెపి 51,438
కాంగ్రెస్ 32,892
బిజెపి 18546 లీడ్
- 4 Jun 2024 9:52 AM IST
నిజామాబాద్..
నిజామాబాద్: 4,5 రౌండ్లలో బిజెపి లీడ్ 28,250 లీడ్ లో బిజెపి లీడ్ ఐదవ రౌండ్ ముగిసే వరకు
- 4 Jun 2024 9:50 AM IST
నల్లగొండ జిల్లా...
కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి.. 26,188 ఆధిక్యం..
-Cong: 37,984
-BRS: 11,796.
-BJP: 10970
- 4 Jun 2024 9:50 AM IST
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ
ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ.. కౌంటింగ్ నుండి బయటికి వెళ్లిపోయిన టిఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు..
- 4 Jun 2024 9:12 AM IST
నిర్మల్ మొదటి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
నిర్మల్ జిల్లా : నిర్మల్ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ..
మొదటి రౌండ్ :
బిజెపి 3872
కాంగ్రెస్ 2643
బీఆర్ఎస్ 585
మొదటి రౌండ్లో బిజెపి 1168 ఓట్ల ఆధిక్యం
- 4 Jun 2024 9:10 AM IST
జహీరాబాద్ మొదటి రౌండ్ లీడ్
బీజేపీ-3571
కాంగ్రెస్- 3788
BRS- 1337
లీడ్ (కాంగ్రెస్- 238)
- 4 Jun 2024 9:09 AM IST
సికింద్రాబాద్ లో మొదటి రౌండ్ ఫలితం
బీజేపీ....2951
కాంగ్రెస్...3307
బిఆరెస్....456
నాంపల్లి నియోహాకావర్గం లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ 356ఓట్లతో ముందంజ
- 4 Jun 2024 9:03 AM IST
అంబర్ పేట పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్
అంబర్పేట్ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నారాయణగూడ లోని రాజ బహదూర్ వెంకటరామిరెడ్డి ఉమెన్స్ కాలేజీలో ప్రారంభమైంది..
కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్న రెడ్డి కాలేజ్ వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు..
పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు..
అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని మొత్తం 236 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఓట్లను 14 టేబుల్ లో ఏర్పాటు చేసి 17 రౌండ్లలో కౌంటింగ్ చేయనున్నారు..
ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది మరికొద్ది సేపట్లో పోస్టల్ బ్యాలెట్ వెల్లడించనున్నారు...