ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా
x

ముగిసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కొనసాగిన హస్తం హవా

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం. 123 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. 12 వేల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు.


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ షురూ అయింది. భారీ బందోబస్తు, భద్రత మధ్య అధికారులు కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఈ కౌంటింగ్‌కు 12 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రతి కేంద్రాన్ని సీసీటీవీ నిఘాలో ఉంచారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా డీజీపీ కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఎన్నికల్లో మొత్తం పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కలిపి 12,944 మంది బరిలో ఉన్నారు. వారంతా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిని అదృష్టం, అధికారం ఎంత వరకు వరిస్తాయన్నది ఈ కౌంటింగ్‌తో తేలుతుంది. ఏడు కార్పొరేషన్స్‌లో నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లలో 2,225 మంది అభ్యర్థులు పోటపడుతున్నారు. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది ఎన్నికల పోరులో తలపడుతున్నారు. ఇక 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలిచారు. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 314 మంది అభ్యర్థులు ఉన్నారు.

లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నారు. పాస్‌లు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతి ఇస్తున్నారు. అల్లర్లు తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్‌తో నిఘాను మరింత పెంచారు. ఈ ఏర్పాట్లన్నింటిని రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగానే సిద్ధం చేసింది.

ఫిబ్రవరి 11న జరిగిన పోలింగ్‌లో పడిన ఓట్లను ఈరోజు లెక్కిస్తున్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నది ఈ కౌంటింగ్ ముగిసే సరికి తేలనుంది. కౌంటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేందుకు అన్ని వర్గాలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరుతున్నారు.

Live Updates

  • 13 Feb 2026 7:48 PM IST

    మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం.. వార్డుల వారీగా పూర్తి గణాంకాలు

    • తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.

    • మొత్తం 116 మున్సిపాలిటీలలో 64 చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించింది.

    • బీఆర్‌ఎస్‌ 13 మున్సిపాలిటీలలో గెలుపొందింది.

    • 38 మున్సిపాలిటీల్లో హంగ్‌ పరిస్థితి ఏర్పడింది.

    • వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ దక్కించుకుంది.

    • మొత్తం 2,582 వార్డుల ఫలితాల్లో సగానికిపైగా కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి.

    • కాంగ్రెస్‌ – 1,347 వార్డులు

    • బీఆర్‌ఎస్‌ – 717 వార్డులు

    • బీజేపీ – 261 వార్డులు

    • ఇతరులు – 256 వార్డులు

    • నారాయణ్‌పేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మరణంతో ఆ స్థానంలో ఎన్నిక నిర్వహించలేదు.

  • 13 Feb 2026 7:11 PM IST

    మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం

    తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 116 స్థానాలకు గానూ 70 స్థానాల్లో హస్తం హవా కొనసాగింది.

    కాంగ్రెస్ 70

    బీఆర్ఎస్ 15

    బీజేపీ 1 

    ఇతరులు 30 

  • 13 Feb 2026 7:09 PM IST

    • మున్సిపల్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని కేటీఆర్‌ తెలిపారు.

    • పలు చోట్ల పార్టీ శ్రేణులు వీరోచితంగా పోరాడినట్లు పేర్కొన్నారు.

    • చౌటుప్పల్‌లో అధికార పార్టిని ఎదుర్కొని విజయం సాధించామని అన్నారు.

    • వర్ధన్నపేట, వికారాబాద్‌లో తమ కౌన్సిలర్లను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

    • దాదాపు 15 చోట్ల బీఆర్‌ఎస్‌ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించబోతుందని చెప్పారు.

    • కాంగ్రెస్‌, బీజేపీ కలిసి పనిచేశాయని విమర్శించారు.

    • లౌకిక పార్టీలను కలుపుకొని ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.

    • ఈ ఫలితాలు పార్టీకి మంచి భవిష్యత్‌ ఉందనడానికి నిదర్శనమని పేర్కొన్నారు.

    • రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ మాత్రమేనని తెలిపారు.

    • ఇదే ఊపుతో రాబోయే GHMC ఎన్నికల్లోనూ గెలుస్తామని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

  • 13 Feb 2026 7:02 PM IST

    మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం.. వార్డుల వారీగా ఫలితాలు ఇలా

    • తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.

    • మొత్తం 116 మున్సిపాలిటీల్లో 64 మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది.

    • బీఆర్‌ఎస్‌ 13 మున్సిపాలిటీల్లో గెలుపొందింది.

    • 38 మున్సిపాలిటీల్లో హంగ్‌ పరిస్థితి ఏర్పడింది.

    • వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ దక్కించుకుంది.

    • వార్డుల వారీగా చూస్తే, మొత్తం 2,582 వార్డుల్లో సగానికిపైగా కాంగ్రెస్‌ ఖాతాలో చేరాయి.

    • కాంగ్రెస్‌ – 1,347 వార్డులు

    • బీఆర్‌ఎస్‌ – 717 వార్డులు

    • బీజేపీ – 261 వార్డులు

    • ఇతరులు – 256 వార్డులు

    • నారాయణ్‌పేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మరణించడంతో ఆ వార్డులో ఎన్నిక జరగలేదు.

  • 13 Feb 2026 5:35 PM IST

    బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌ మాత్రమే: కేటీఆర్‌

    • కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ను దీటుగా ఎదుర్కొనేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు.

    • భవిష్యత్‌లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

    • హంగ్‌ మున్సిపాలిటీలు చివరకు ఎవరికి దక్కుతాయో వేచి చూడాల్సి ఉందన్నారు.

    • పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.

  • 13 Feb 2026 5:35 PM IST

    సీపీఐకి కేటీఆర్ ఓపెన్ ఆఫర్

    కొత్తగూడెం మేయర్ పదవి విషయంలో సీపీఐ పార్టీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు..

    సీపీఐకి తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు..

    కొత్తగూడెంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు సమాన సంఖ్యలో డివిజన్లు దక్కిన సంగతి తెలిసిందే..

    ఇక్కడ ఎనిమిది మంది బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు.

  • 13 Feb 2026 5:33 PM IST

    బీజేపీని ఓడించేందుకు మూడు పార్టీలు కలిశాయి: రామచంద్రరావు

    • బీజేపీను ఓడించేందుకు ఎంఐఎం, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి పనిచేశాయని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు.

    • మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని తెలిపారు.

    • రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 350 వార్డుల్లో పార్టీ విజయం సాధిస్తోందని పేర్కొన్నారు.

    • మజ్లిస్‌ ఓట్లు లేకపోతే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు ఇంతటి సీట్లు రావని విమర్శించారు.

    • పార్టీ విజయంలో సహకరించిన కార్యకర్తలకు రామచంద్రరావు ధన్యవాదాలు తెలిపారు.

  • 13 Feb 2026 5:31 PM IST

    తటస్థులను కలుపుకొని ముందుకు పోతాం: కేటీఆర్‌

    • హంగ్‌ పరిస్థితులు ఏర్పడిన చోట్ల కాంగ్రెస్‌ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని కేటీఆర్‌ ఆరోపించారు.

    • మున్సిపల్‌ పీఠాల కైవసానికి కాంగ్రెస్‌ ఇప్పటికే బేరసారాలు, కొనుగోళ్లు ప్రారంభించిందన్నారు.

    • కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు.

    • కేసీఆర్‌ నాయకత్వమే రాష్ట్రానికి రక్షణ అని గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు.

    • హైదరాబాద్‌ సహా ఇతర కార్పొరేషన్‌లలో ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని కేటీఆర్‌ వెల్లడించారు.

     మున్సిపల్‌ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాం

    • మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మెరుగైన ఫలితాలు సాధించిందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

    • నేరుగా 15-16 మున్సిపాలిటీల్లో గెలిచామని తెలిపారు.

    • మరో 15-16 చోట్ల అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచామని చెప్పారు.

    • రాష్ట్రవ్యాప్తంగా 750 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించిందన్నారు.

    • దాదాపు 30 శాతం మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటున్నామని పేర్కొన్నారు.

    • కాంగ్రెస్‌ భారీగా అక్రమాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.

    • బీఆర్‌ఎస్‌ శ్రేణులు వీరోచితంగా పోరాడాయని కేటీఆర్‌ అన్నారు.

  • 13 Feb 2026 4:41 PM IST

    జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి అనుచరుల హవా

    14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన జీవన్ రెడ్డి అనుచరులు

    మొత్తం 50 వార్డులకు గానూ

    కాంగ్రెస్ 12,

    బీజేపీ 4,

    బీఆర్ఎస్ 4

    ఎంఐఎం 2 గెలవగా

    14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం

  • 13 Feb 2026 4:41 PM IST

    మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి.. ప్రజా పాలనకు ప్రజలు పట్టం కట్టారు.. ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం ఆదరణగా మారింది.. కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా శ్రమించారు-భట్టి

Read More
Next Story