
తెలంగాణ బడ్జెట్ రూ.3.24 లక్షల కోట్లు..
విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యంతో బడ్జెట్ రూపకల్పన. కీలక ప్రాజెక్టులకు భారీ కేటాయింపులపై దృష్టి.
తెలంగాణలో కీలక ఆర్థిక నిర్ణయాల దిశగా మరో అడుగు పడుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. బడ్జెట్‌కు ముందు ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించనుంది.
గత ఏడాది రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా, ఈసారి దాదాపు 8 నుంచి 10 శాతం పెంపుతో రూ.3.29 లక్షల కోట్ల నుంచి రూ.3.30 లక్షల కోట్ల వరకు పెరగనున్నట్లు అంచనా. కొన్ని వర్గాల ప్రకారం మొత్తం అంచనా రూ.3.36 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం కూడా ఉందని సమాచారం. ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సంక్షేమ రంగానికి రూ.1 లక్ష కోట్లకు పైగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది.
గతంలో రూ.72,396 కోట్లు కేటాయించగా, ఈసారి దాదాపు రూ.77 వేల కోట్ల వరకు పెంపు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నీటి పారుదల ప్రాజెక్టులకు సుమారు రూ.26 వేల కోట్ల కేటాయింపులు ఉండొచ్చని అంచనా. మూలధన వ్యయాన్ని కూడా గణనీయంగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. గతంలో రూ.36,504 కోట్లు కేటాయించగా, ఈసారి దానిని రూ.45 వేల కోట్ల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది.
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి భారీ నిధులు అవసరమవుతున్న నేపథ్యంలో సుమారు రూ.17 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని అంచనా. యంగ్ ఇండియా స్కూల్స్, సాగునీటి ప్రాజెక్టులు కూడా బడ్జెట్‌లో కీలక స్థానంలో ఉండనున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, తమ్ముడిహట్టి బ్యారేజ్, మూసీ రివర్ ఫ్రంట్, రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్ర ఆదాయం పెరుగుదలతో బడ్జెట్ పరిమాణం విస్తరించిందని తెలుస్తోంది. జీఎస్టీ మార్పులు ఉన్నప్పటికీ రాష్ట్ర ఆదాయంపై పెద్దగా ప్రభావం లేకపోయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల మధ్య ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడుతున్న నేపథ్యంలో ఐదు నుంచి ఆరు కొత్త పథకాలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చర్చ సాగుతోంది. మొత్తంగా, తెలంగాణ ఆర్థిక దిశను నిర్దేశించే ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సమతుల్యత కల్పించేలా ఉండనుందని భావిస్తున్నారు.
Live Updates
- 20 March 2026 1:24 PM IST
విద్యార్థులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్
- ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు
- ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొత్తగా ప్రవేశపాటు
- దివ్యాంగ విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
- వెల్ఫేర్ స్కూల్స్‌లో వసతుల మెరుగుదలకు రూ.100 కోట్లు కేటాయింపు
- 57 పాలిటెక్నిక్ కాలేజీలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా అప్‌గ్రేడ్ చేయడం
- 2026-27లో పాలిటెక్నిక్ కాలేజీల్లో 15 కొత్త కోర్సుల ప్రారంభం
- స్కిల్ యూనివర్సిటీని విద్యాశాఖ పరిధిలోకి తీసుకురావడం
- ITIలలో ATC ట్రైనీలకు ప్రతి నెల రూ.2,000 స్కాలర్‌షిప్
- విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్‌మెంట్ కార్యక్రమం ప్రారంభం
- 20 March 2026 1:09 PM IST
బడ్జెట్‌లోని కీలక అంశాలు
తెలంగాణ బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుకు రూ.50,713 కోట్లు కేటాయింపు
సంక్షేమం, అభివృద్ధి కోసం మొత్తం రూ.1,45,592 కోట్లు ప్రతిపాదన
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల కవరేజ్
విద్యార్థుల కోసం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొత్తగా అమలు
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్థాపన
ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభం
దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ
జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీకరణ – మూడు కార్పొరేషన్లుగా విభజన
హైదరాబాద్‌లో “భారత్ ఫ్యూచర్ సిటీ” నిర్మాణ ప్రణాళిక
CURE–PURE–RARE మోడల్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి
రైతులకు 100% సబ్సిడీతో సోలార్ పంపుసెట్లు అందజేత
భూ భారతి చట్టం–2025 అమలు
AI ఆధారిత ‘భూ మిత్ర’ చాట్‌బాట్ ప్రవేశపెట్టడం
ప్రజల ఫిర్యాదుల కోసం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింపు
ప్రజాపాలన–ప్రగతి 99 రోజుల కార్యక్రమం అమలు
సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ కార్డుల అమలు
ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్
ప్రభుత్వ ఉద్యోగులకు సమగ్ర ప్రమాద బీమా పథకం
మహిళా స్వయం సహాయక సంఘాలకు బస్సులు, పెట్రోల్ బంకుల ఏర్పాటు
274 మొబైల్ అంగన్‌వాడీలు ఏర్పాటు
500 అంగన్‌వాడీ-కమ్-క్రెచ్ సెంటర్లు ఏర్పాటు
గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు కేటాయింపు
మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్ట్ అమలు
మెట్రో రైలు ఫేజ్–II, III విస్తరణ
ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
డ్రగ్స్ నియంత్రణకు EAGLE ప్రత్యేక టీమ్ ఏర్పాటు
- 20 March 2026 12:58 PM IST
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్-2026-27
రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్
మూలధన వ్యయం - రూ. 47,267 కోట్లు
రెవెన్యూ వ్యయం - రూ. 2,34,406 కోట్లు
వ్యవసాయ శాఖ - రూ. 23,179 కోట్లు
విద్యుత్ శాఖ - రూ. 21,285 కోట్లు
పౌరసరఫరాల శాఖ - రూ. 7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖ - రూ. 1,529 కోట్లు
విద్యా శాఖకి 26, 674 కోట్లు
వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు
కార్మిక శాఖకు 998 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు
షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు
షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు
వెనక బడిన తరగతులకు 12511 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు
రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు
గృహ నిర్మాణానికి 7430 కోట్లు
ఐటీ శాఖకు 875 కోట్లు
పరిశ్రమల శాఖకి 3490 కోట్లు
చేనేత శాఖకు 258 కోట్లు
పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు
ఇరిగేషన్ కు 22,615 కోట్లు
రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు
న్యాయ శాఖకు 2367 కోట్లు
పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు
హోం శాఖకు 11,907 కోట్లు
గోదావరి పుష్కరాలకు 500 కోట్లు
పర్యాటక శాఖకు 1224 కోట్లు
6 గ్యారంటీలకు 50,713 కోట్లు
రైతు భరోసాకు 18,000 కోట్లు
చేయుతకు 14,861 కోట్లు
ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు
మహాలక్ష్మికి 4,305 కోట్లు
సన్న వడ్ల బోనస్ కు 3,500 కోట్లు
గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) 2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ 1,143 కోట్లు
మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ 723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 600 కోట్లు
పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు
బియ్యం సబ్సిడీ 3,000 కోట్లు
కల్యాణలక్ష్మి / షాది ముబారక్ 3,683 కోట్లు
విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు
స్కాలర్‌షిప్‌లకు 4,343 కోట్లు
తప్పనిసరి కార్యాలయ ఖర్చులు 2,323 కోట్లు
పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు 6416 కోట్లు
హ్యాంమ్ రోడ్లకు 3053 కోట్లు
రీజనల్ రింగ్ రోడ్డుకు 1525 కోట్లు
రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000 కోట్లు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు
పంట బీమా పథకానికి 1886 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ కు 1500 కోట్లు
CURE ఏరియా అభివృద్ధికి 2654 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056 కోట్లు
ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు
6 గ్యారంటీలకు 50,713కోట్లు
రైతు భరోసాకు 18,000 కోట్లు
చేయుతకు 14,861 కోట్లు
ఇందిరమ్మ ఇండ్లకు 5,500 కోట్లు
మహాలక్ష్మికి 4,305 కోట్లు
సన్న వడ్ల బోనస్ కు 3,500 కోట్లు
గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) 2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ 1,143 కోట్లు
మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ 723 కోట్లు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కు 600 కోట్లు
పవర్ సబ్సిడీకి 14,000 కోట్లు
బియ్యం సబ్సిడీ 3,000 కోట్లు
కల్యాణలక్ష్మి / షాది ముబారక్
3,683
విద్యార్థుల డైట్ ఛార్జీలు 2,170 కోట్లు
స్కాలర్‌షిప్‌లకు 4,343 కోట్లు
తప్పనిసరి కార్యాలయ ఖర్చులు
2,323 కోట్లు
పంచాయతీరాజ్ రోడ్లకు 2, 062 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు 6416కోట్లు
హ్యాంమ్ రోడ్లకు 3053కోట్లు
రీజనల్ రింగ్ రోడ్డుకు 1525కోట్లు
రాజీవ్ యువ వికాసానికి 5800 కోట్లు
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు 5000కోట్లు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు 4000 కోట్లు
పంట బీమా పథకానికి 1886 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్ కు 1500కోట్లు
CURE ఏరియా అభివృద్ధికి 2654కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు 1056కోట్లు
ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు 1500 కోట్లు
- 20 March 2026 12:44 PM IST
ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు రూ.1,500 కోట్లు
CURE ఏరియా అభివృద్ధికి రూ.2,654 కోట్లు
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంకు రూ.1,056 కోట్లు
పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు
రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి రూ.4,000 కోట్లు
పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు
మూసి రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు
హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు
- 20 March 2026 12:43 PM IST
హామీలకు కేటాయింపులు ఇలా
ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు
పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు
కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు
విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు
స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు
తప్పనిసరి కార్యాలయ ఖర్చులు రూ.2,323 కోట్లు
రైతు భరోసాకు రూ.18,000 కోట్లు
చేయూతకు రూ.14,861 కోట్లు
ఇందిరమ్మ ఇండ్లకు రూ.5,500 కోట్లు
మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు
సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు
గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు
రాజీవ్ ఆరోగ్య శ్రీ రూ.1,143 కోట్లు
మహాలక్ష్మి పథకం కింద LPG సబ్సిడీ రూ.723 కోట్లు
- 20 March 2026 12:34 PM IST
తెలంగాణను దేశానికి భవిష్యత్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ లక్ష్యంతోనే తెలంగాణ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్యూర్, ప్యూర్, రేర్ కాన్సెప్ట్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. పలు కంపెనీలతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.
- 20 March 2026 12:26 PM IST
సాగునీటి ప్రాజెక్టులు - రూ.22,615 కోట్లు
గృహ నిర్మాణం - రూ.7,430 కోట్లు
ఐటీ రంగం - రూ.875 కోట్లు
రవాణా శాఖ - రూ.12,759 కోట్లు
న్యాయ శాఖ - రూ.2,367 కోట్లు
పరిశ్రమలు - రూ.3,490 కోట్లు
చేనేత - రూ.258 కోట్లు
పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ - రూ.17,907కోట్లు
రాజీవ్ యువ వికాసం - రూ.6వేల కోట్లు
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.33,688 కోట్లు
శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు
గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు
పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు
- 20 March 2026 12:26 PM IST
బడ్జెట్ కేటాయింపుల వివరాలివే..
మహిళా శిశు సంక్షేమం - రూ.3,143 కోట్లు
ఎస్సీ సంక్షేమం - రూ.11,784 కోట్లు
రైతు సంక్షేమం- రూ.23,179కోట్లు
విద్యుత్ - రూ.21,285 కోట్లు
ఎస్టీ సంక్షేమం - రూ.7,937కోట్లు
బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు
విద్యా శాఖ - రూ.26,674 కోట్లు
సివిల్ సప్లయ్-రూ.7,366 కోట్లు
పశుసంవర్ధక శాఖ - రూ.1,529 కోట్లు
వైద్యం - రూ.13,679కోట్లు
కార్మికుల సంక్షేమం - రూ.999 కోట్లు
మైనారిటీ సంక్షేమం - రూ.3,769 కోట్లు
- 20 March 2026 12:24 PM IST
గ్రోత్ ఇంజిన్‌గా తెలంగాణ
దేశ ఆర్థికాభివృద్ధికి తెలంగాణ కీలక గ్రోత్ ఇంజిన్‌గా నిలుస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జాతీయ వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ వృద్ధి రేటు 2.7 శాతం అధికంగా ఉందని తెలిపారు. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా 1.9 రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు.
- 20 March 2026 12:21 PM IST
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ వార్షిక బడ్జెట్
విద్యాశాఖ: రూ.26,674 కోట్లు
మహిళ, శిక్ష సంక్షేమం: రూ.3143 కోట్లు
పశుసంవర్థకశాఖ: రూ.1,529 కోట్లు
సివిల్ సప్లై: రూ.7,366 కోట్లు

