తిరుమల కొండల్లో రామకృష్ణ తీర్థ యాత్ర మొదలయింది...
x
రామకృష్ణ తీర్థంలో పూజలు (ఫైల్ ఫోటో) . టిటిడి సౌజన్యం

తిరుమల కొండల్లో రామకృష్ణ తీర్థ యాత్ర మొదలయింది...

ఏడాదికి ఒక్క సారే ఇక్కడికి వెళ్లేందుకు అనుమతిస్తారు.



ఈ రోజు, జనవరి 25 , ఉద‌యం 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు త‌దిత‌ర‌ పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ్లారు. తీర్థం చేరుకున్నాక అక్క‌డున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు.


ఇది కూడా చదవండి

తిరుమల కొండల్లో ట్రెక్ చేయాలనుకుంటున్నారా; జనవరి 25 అరుదైన అవకాశం

గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ దాదాపు 35 బస్సులను ఏర్పాటు చేసింది. గురువారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతిస్తారు.

ఈ తీర్థానికి వెళ్లే యాత్రికుల‌కు టీటీడీ అన్న‌ప్ర‌సాద విభాగం ఆధ్వ‌ర్యంలో పాలు, కాఫీ, పొంగ‌ళి, ఉప్మా, సాంబార‌న్నం, పెరుగన్నం పంపిణీ చేసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

కాగా, అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, వృద్ధుల శ్రేయ‌స్సును దృష్టిలో ఉంచుకుని అట‌వీ మార్గంలో ఈ తీర్థానికి న‌డిచి వెళ్ల‌డానికి అనుమ‌తి నీయలేదు.

శ్రీరామకృష్ణ తీర్థం తిరుమ‌ల శ్రీ‌వారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్ర‌కారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివ‌సిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం.

అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ట్రెక్ చేసుకుంటూ ఈ తీర్థం చేరుకుంటారు.



Read More
Next Story