తెలంగాణ పోలింగ్ లైవ్ అప్‌డేట్స్
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికతో పాటు 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ సన్నద్ధం అయింది. ఈరోజే నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నికతో పాటు 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు పోలింగ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.
Live Updates
- 13 May 2024 12:25 PM IST
కాలితో ఓటేసి స్ఫూర్తినిచ్చిన యువకుడు
చేతులు లేకపోతే ఏంటి కాలికి ఇంక్ పెట్టించుకుని మరీ ఓటు వేస్తున్న యువకుడు... ప్రతీ ఒక్కరు ఓటు వెయ్యాలని స్ఫూర్తిదాయకంగా సూచిస్తున్న ఈ దృశ్యం సిర్పూర్ కాగజ్ నగర్ లోనిది...
చేతులు లేకపోతే ఏంటి కాలికి ఇంక్ పెట్టించుకుని మరీ ఓటు వేస్తున్న యువకుడు... అందరికి స్ఫూర్తి దాయకంగా ప్రతీ ఒక్కరు ఓటు వెయ్యాలని సూచిస్తున్న ఈ దృశ్యం సిర్పూర్ కాగజ్ నగర్ లోనిది... #TelanganaElections2024 #TSElections2024 #LokSabaElections2024 pic.twitter.com/Z1v0gvJQf7
— vanaja morla (@MorlaVanaja) May 13, 2024 - 13 May 2024 12:14 PM IST
కొడంగల్ లో ఓటేసిన సీఎం రేవంత్ ఫ్యామిలీ
కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
- 13 May 2024 12:13 PM IST
ఫ్యామిలీతో కలిసి ఓటేసిన కేటీఆర్
నంది నగర్‌లోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్లో కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
- 13 May 2024 11:59 AM IST
చింతమడకలో ఓటేసిన కేసీఆర్ దంపతులు
సిద్ధిపేట చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్ దంపతులు.. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తమ స్వగ్రామం చింతమడకలో కేసీఆర్, శోభమ్మ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.
- 13 May 2024 11:44 AM IST
11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 గంటల వరకు నమోదు అయిన పోలింగ్ శాతం -24.31
అదిలాబాద్ -31.51
భువనగిరి -27.97
చేవెళ్ల -20.35
హైద్రాబాద్ -10.70
కరీంనగర్-26.14
ఖమ్మం-31.56
మహబూబాబాద్-30.70
మహబూబ్నగర్-26.99
మల్కాజిగిరి-15.05
మెదక్-28.32
నాగర్ కర్నూల్ -27.74
నల్గొండ-31.21
నిజామాబాద్-28.26
పెద్దపల్లి-26.17
సికింద్రబాద్-15.77
వరంగల్-24.18
జహీరాబాద్-31.83
సికింద్రబాద్ కంటోన్మెంట్-16.83
- 13 May 2024 11:38 AM IST
వేరే పార్టీ అభ్యర్ధికి ఓటేసిన అసదుద్దీన్ !!
సోమవారం ఉదయం ఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట సమీపంలోని శాస్త్రిపురం పోలింగ్ కేంద్రానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధి కిందకు అసద్ నివాస ప్రాంతం వస్తుంది. కానీ ఇక్కడ ఎంఐఎం అభ్యర్థిని పోటీలో ఉంచలేదు. దీంతో ఆయన ఇతర పార్టీ అభ్యర్ధికి కానీ, నోటాకు కానీ ఓటు వేసి ఉండొచ్చు. కాగా ఆయన హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థిగా పోటీలో ఉన్నా... ఈ నియోజకవర్గ పరిధిలో ఆయనకి ఓటు లేదు.
- 13 May 2024 11:19 AM IST
వీల్ చైర్ లో వచ్చి ఓటేసిన కేకే
వీల్ చైర్ లో వచ్చి ఓటు వేసిన రాజ్య సభ సభ్యుడు కె కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
- 13 May 2024 11:17 AM IST
లోక్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన కుటుంబ సభ్యులతో కలిసి వారి స్వగ్రామం మానకొండూర్ మండలం, పచ్చునూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- 13 May 2024 11:15 AM IST
మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి -హరీష్ రావు
సిద్దిపేట పట్టణంలోని భరత్ నగర్ అంబిటస్ స్కూల్ లో 114పోలింగ్ బూత్ లో కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న మాజి మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ...
- నేను కుటుంబ సభ్యులతో కలిసి భరత్ నగర్ లో ఓటు హక్కును వినియోగించుకున్నా.
- రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా ప్రజలు పోలింగ్ లో పాల్గొంటున్నారు.
- గతంలో కంటే ఎక్కువ పట్టణాలలో పోలింగ్ పెరుగుతుంది.
- ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారు
- మేధావులు, విద్యావంతులు పోలింగ్ లో పాల్గొనాలి.
- ప్రజాస్వామ్యం బలపడాలంటే అందురు ఓటింగ్ లో పాల్గొనాలి.
- ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారత్ దేశం.
- గత పార్లమెంటు ఎన్నికలలో కంటే పోలింగ్ శాతం పెరుగుతుంది.
- ప్రజలు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకువాలి అని ఓటర్లకు పిలుపునిచ్చారు.