శ్రీనివాస గౌడ్ ఏడవ తరగతిలో చదువు ఆపేసి కల్లు గీత కులవృత్తిలోకి వచ్చాడు. వృత్తి చేస్తూనే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ లో డిగ్రీ పిజి చేశారు. నాలుగు కథా సంపుటాలు, అయిదు నవలలు, ఒక ప్రాజెక్టు రిపోర్ట్ రాశారు. ‘బతుకుతాడు’ నవల కాకతీయ విశ్వవిద్యాలయం పిజి సిలబస్ లో ఉంది. ‘దుల్దుమ్మ’ నవలకు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య పురస్కారం లభించింది


