ఎన్ని సౌకర్యాలో..

కేసీఆర్‌ గతంలో ఉన్న ఇంటిని భవంతి అనడమే కరెక్టు.. ఎందుకంటే అక్కడ ఉన్న సౌకర్యాలు అలాంటివి. అవేంటో మనమూ తెలుసుకుందా..

Update: 2023-12-14 09:53 GMT


అంత పెద్ద భవనమే..

మినీ సచివాలయం, మిని థియేటర్‌, భారీ మీటింగ్‌ హాల్‌, బుల్లెట్‌ ప్రూఫ్‌ విండోలు..ఈ వర్ణన చూస్తుంటే మొదట మనకు గుర్తొచ్చేది రాజకీయ ప్రముఖుల నివాసాలే. ఆధునిక వసలుతున్న ఈ భవనం మాజీ సీఎం కేసీఆర్‌ది.

ప్రస్తుతం ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండబోతున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

నిర్మించిందెవరూ.. ఖర్చెంత..

షాపూర్జీ పల్లోంజి అనే నిర్మాణ సంస్థ ప్రగతి భవన్‌ను నిర్మించింది. తొమ్మిది ఎకరాల్లోని లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించారు. సీఎం అధికారిక నివాసం కావడంతో లోపలే మినీ సెక్రటేరియట్‌, భారీ థియేటర్‌, విశాలమైన కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మించారు.ఈ భవనానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ విండోలను అమర్చారు.

2016 మార్చిలో భవన నిర్మాణాన్ని మొదలుపెట్టి నవంబర్‌లో పూర్తి చేశారు. తొమ్మిది నెలల్లోనే నిర్మించిన ఈ భవన నిర్మాణ వ్యయం అప్పట్లో రూ.35 కోట్లు. ఇప్పుడు రూ.50 కోట్లు చేస్తుందని సమాచారం. 2016 నవంబరు నుంచి మొన్న ఎన్నికల ఫలితాలు వెలువడిన డిసెంబరు 3 వరకు దాదాపు ఏడేళ్ల పాటు కేసీఆర్‌ ఇదే భవనంలోనే ఉన్నారు.

ప్రజాభవన్‌గా మారిని ప్రగతి భవన్‌

మాజీ సీఎం కేసీఆర్‌(KCR) నివసించిన ‘ప్రగతి భవన్‌’ ఇటీవల మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌(Praja Bhavan)గా మార్చారు సీఎం రేవంత్‌. అనవాయితీ ప్రకారం కొత్త సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth)కి ఈ భవనాన్ని కేటాయించాలి. అయితే ఇందులో నివసించడానికి ఆయన తిరస్కరించడంతో భట్టికి కేటాయించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కేసీఆర్‌ ఆలోచనలకు తగ్గట్టుగానే..

బేగంపేటలోని ప్రగతి భవన్‌ కేసీఆర్‌ తన ఆలోచనలకు తగ్గట్టుగా నిర్మించుకున్నారట. గతంలో సీఎంలుగా పనిచేసినవారు ఇక్కడి రెండు పాత భవనాల్లో ఒక దాన్ని నివాసానికి రెండో దాన్ని క్యాంప్‌ ఆఫీసుగా మార్చి పాలన సాగించేవారు.

ఐఏఎస్‌ అధికారు ల సంఘం భవనాన్ని తీసుకుని భారీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మించారు. దీనికి కేసీఆర్‌ ‘జనహిత’ అని నామకరణం చేశారు. దీన్నే ఇప్పుడు ప్రజాభవన్‌గా మార్చి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. దీని వెనక మరో భవనం ఉంది. దానికి కేసీఆర్‌ ప్రగతి భవన్‌ (Pragati Bhavan)పేరు పెట్టి అందులో ఉండేవారు. 

Tags:    

Similar News