ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఫలితాలే వస్తాయి. దక్షిణాదిలో బీజేపీ పుంజుకుంటుందా? తూర్పులో ఆ పార్టీ పరిస్థితి ఈ సారి ఎలా ఉండబోతుంది?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఫలితాలే వస్తాయి. దక్షిణాదిలో బీజేపీ పుంజుకుంటుందా? తూర్పులో ఆ పార్టీ పరిస్థితి ఈ సారి ఎలా ఉండబోతుంది?
బీజేపీ తూర్పున ఆరు స్థానాలు గెలుచుకుంటుందని, దక్షిణాది రాష్ట్రాలలో మెరుగైన బిజెపి పనితీరును కనపరుస్తుందని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. “తెలంగాణలో వాళ్లు (బీజేపీ) ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్‌లో ఉంటారు. ఒడిశాలో కచ్చితంగా నెం.1. పశ్చిమ బెంగాల్‌లో కూడా బిజెపి నెం. 1 స్థానంలో ఉంటుంది ”అని కిషోర్ చెప్పారు. తమిళనాడులో బీజేపీ రెండంకెల ఓట్లను సాధించే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. తమిళనాడులో 2019 లోక్‌సభ ఎన్నికలలో BJP ఓట్ల శాతం 3.6%, 2021 అసెంబ్లీ ఎన్నికలలో 2.6% మాత్రమే.
2019లో తెలంగాణ, ఒడిశా, బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో మొత్తం 164 స్థానాలకు గాను 30 సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకున్న నేపథ్యంలో కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 2019లో కర్ణాటకలో 28కి 25 చోట్ల బీజేపీ విజయం సాధించింది.
గత ఏడాది రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, అంతకు ముందు సంవత్సరం జరిగిన మూడు రాష్ట్రాలలో - ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ - అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడంతో పెద్ద దెబ్బ తగిలింది.
కిషోర్ ఇలా అన్నారు.. “మీ పోరాటం ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లో ఉంది. కానీ మీరు మణిపూర్, మేఘాలయలో పర్యటిస్తున్నారు. అలాంటప్పుడు నువ్వు ఎలా విజయం సాధిస్తావు.” ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించిన రాహుల్ గాంధీ, అతని 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'పై అతని వ్యాఖ్యలు అపహాస్యం అనిపించాయి.
కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ విముఖత వ్యక్తం చేయడంపై కిషోర్ “యుపి, బీహార్, మధ్యప్రదేశ్‌లలో గెలవకపోతే వాయనాడ్ నుంచి గెలిస్తే ప్రయోజనం ఉండదు” అని కిషోర్ హెచ్చరించారు.