ఈయనే కొత్త బాస్‌..

డీజీపీ ఎలక్షన్‌ కోడ్‌ను ఉల్లఘించారు. వెంటనే ఈసీఐ చర్యలు తీసుకుంది. సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. ఆయన స్థానంలో మరొకరిని అపాయింట్‌ చేశారు.

Update: 2023-12-03 15:00 GMT
IPS RAVI GUPTA (file)

తెలంగాణ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ) అంజనీ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఎన్నికల పూర్తి ఫలితాలు వెలువడక ముందే ఆయన తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఎ. రేవంత్‌ రెడ్డిని తన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం సమర్పించారు. ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారిని ఆదేశించింది. డీజీపీతో పాటు అదనపు డీజీలు మహేష్‌ భాగవత్‌, సంజయ్‌ జైన్లకు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది ఈసీ.

కొత్త డీజీపీగా రవి గుప్తా...

అంజనీ కుమార్‌ స్థానంలో కొత్త డీజీపీగా రవిగుప్తాను నియమించారు. 1990 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన గుప్తా డిసెంబర్‌ 2022లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు.   

Tags:    

Similar News