AI టెక్నాలజీపై ఏఆర్‌ రెహమాన్‌ కామెంట్స్

పాయిజన్ ని, ఆక్సిజన్ ని మిక్స్ చేయద్దు;

Update: 2025-04-19 11:14 GMT

“Technology is best when it brings people together – not when it replaces their soul.”

— AR Rahman (in a recent interview on AI Music)

ఏఐ ఇప్పుడు ఏ రంగాన్ని వదలడం లేదు. ఆర్ట్, లిటరేచర్, సినిమా, సంగీతం... ప్రతిదానిలోనూ తన ఛాయలను విస్తరించుకుంటోంది. అందులో సంగీత రంగం ముందు వరుసలో ఉంది. తాజాగా ఏఐ మ్యూజిక్ టూల్స్‌ సహాయంతో పాటలు కేవలం సంగీత పరికరాల పరిమితిలో కాకుండా — భావం, రాగం, లిరిక్స్‌ సహా పూర్తిగా సృష్టించగల స్థాయికి చేరాయి. ఇది సంగీత ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించే మార్పే.

ఒకప్పుడు మనిషి సంగీతాన్ని నేర్పించి, మెషీన్‌ సహాయంతో ట్యూన్స్‌ రూపొందించేవాడు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. మిషన్‌ తయారుచేసిన మ్యూజిక్‌ పేటర్న్స్‌ని మ్యూజిషియన్స్‌ అధ్యయనం చేస్తూ, తన హస్తకళలు మెరుగులు దిద్దు కుంటున్నారు. అంటే... సంగీత సృష్టిలో మిషన్‌ మనిషికి మార్గదర్శకంగా మారుతోంది.

వాయిస్‌ల పునఃసృష్టి

AI ద్వారా ఇప్పుడు దివంగత గాయకుల వాయిస్‌ను పునఃసృష్టించడం కూడా సాధ్యమవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ ఇటీవల ‘లాల్‌ సలామ్’ సినిమాలో బంబా బక్యా, షాహుల్‌ హమీద్‌ల గొంతులను AI ద్వారా రీక్రియేట్‌ చేశారు. అయితే ఇది గాయకుల కుటుంబాల అనుమతితోనే జరగడం గమనించదగ్గ విషయం.

అయితే రెహమాన్‌ ఇదే సమయంలో ఓ ముఖ్యమైన హెచ్చరికను కూడా ఇచ్చారు – "ఏఐ టెక్నాలజీ విషం, ఆక్సిజన్ రెండింటిని కలిపినట్లు. వినియోగంలో ఓ లక్ష్మణ రేఖ ఉండాలి. లేకపోతే అది సంగీతాన్ని ,మానవత్వాన్ని హైజాక్‌ చేసే ప్రమాదం ఉంది."

AI వాయిస్‌తో చెత్త పాటలను కూడా గొప్ప గాయకులు పాడినట్లు చూపడం ఆందోళనకరమైన ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే దీనిని నియంత్రించకపోతే భవిష్యత్తులో గందరగోళ పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఏఐ టెక్నాలజీ ఎంతో శక్తిమంతమైనదని కానీ, అవసరానికి మించి దీన్ని వినియోగించకూడదని ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రెహమాన్ మాట్లాడుతూ... ‘‘ఏఐ వల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి. మంచి కోసం మాత్రమే దీన్ని వినియోగించాలి. కొన్ని రోజులుగా దీని వినియోగం చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. కొన్ని చెత్త పాటలను కూడా గొప్ప గాయకులు పాడినట్లు క్రియేట్‌ చేస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియడం లేదు. ప్రతి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని అందరూ తెలుసుకోవాలి’’ అని అన్నారు.

“Technology without ethics is like music without silence – noise.”

— AR Rahman

డిజిటల్ వరల్డ్ కు, సాఫ్ట్ వేర్ ప్రపంచానికి కూడా కొన్ని పరిమితులు, రూల్స్ ఉండాలని, ఏవి చేయకూడదు, ఏవి చేయచ్చు అనే కట్టుబాట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు.

AI పాటలకు అంతర్జాతీయ గుర్తింపు

బీటిల్స్‌ లాంటి ప్రపంచ ప్రఖ్యాత రాక్‌బ్యాండ్‌ కూడా AI సాయంతో రూపొందించిన ‘Now and Then’ పాటను విడుదల చేయడం, అదే పాటకు గ్రామీ నామినేషన్ రావడం ఈ రంగంలో AI ప్రాధాన్యతను హైలైట్‌ చేస్తుంది.

ఆర్థికంగా ఏఐ సంగీతం ప్రయోజన దాయకమే – కానీ కళకు ముప్పు కూడా!

ఏదైమైనా ఒకవైపు సాహిత్యం, రాగం, సంగీత వేదికపై కొత్త ప్రయోగాలకు దారితీసే టూల్‌గా AI పనిచేస్తోంది. మరోవైపు క్రియేటివ్ ఒరిజినాలిటీకి ప్రమాదంగా మారే ఛాన్స్‌ కూడా ఉంది. అదే సమయంలో సులువుగా, తక్కువ ఖర్చుతో రూపొందించే AI పాటల వల్ల చిన్న స్థాయి మ్యూజికియన్లు, లిరిసిస్ట్‌లు, వాయిస్ ఆర్టిస్ట్‌లు మానవ సంగీత ప్రయాణంలో స్థానం కోల్పోతున్నారనే ఆందోళన ఉంది.

టెక్నాలజీ శక్తివంతమైన సాధనం అయినా, దానిని ఎలా వినియోగించాలో తెలిసినప్పుడే అది ఓ శక్తివంతమైన సహచారి గా మారుతుంది. లేదంటే, అది కళను నలిపివేయే ఓ శక్తిగా పరిణమించే ప్రమాదం ఉంది.

“AI can hit the right note. But can it strike the right nerve?”

— Unknown Musician on Reddit

మనిషి పాడే పాటలో, చిన్నపాటి రఫ్‌నెస్, ఓ ఫీలింగ్, ఓ హ్యుమన్ ఎర్రర్‌ కూడా – శ్రోతను తాకుతుంది. కానీ AI పాటలు తూచ్ గా ఉంటాయి. అవి క్రమబద్ధంగా నిర్మితమవుతాయి. కానీ ఆ క్రమంలోనే జీవం పోతుందేమో?

AI-generated పాటలు ఎక్కువగా మ్యూజికల్ మ్యూజియం లాంటివి – వాటిలో కదలిక ఉంది కానీ జీవం లేదు. కానీ మానవులు కంపోజ్ చేసిన సంగీతంలో భావాల వరద ఉంటుంది. అందరి కళ్ళూ కన్నీటితో నిండిపోయే ఒక heartbreak song అల్గోరిథం ద్వారా వస్తుందా?

సంగీతాన్ని కంపోజ్ చేయడంలో AI ఒక మంచి co-writer అయి ఉండవచ్చు. కానీ ghostwriter అయిపోతే కళ తక్కువైపోతుంది.

మానవ అనుభవం, వ్యక్తిగత బాధ, ఆనందం – ఇవే సంగీతానికి జీవం. వాటిని కాపాడుకునే బాధ్యత మనదే.

Tags:    

Similar News