అల్లు అర్జున్ సినిమాలో విల్ స్మిత్ విలన్ అయితే కలిసొచ్చేదేమిటి?

గత దశాబ్దంలో తెలుగు సినిమా పాన్ ఇండియా స్దాయిలో సాధించిన విజయాల ఉత్సాహంతో ఇప్పుడు గ్లోబల్ దిశగా అడుగులు వేస్తోంది.;

Update: 2025-07-09 07:05 GMT

గత దశాబ్దంలో తెలుగు సినిమా పాన్ ఇండియా స్దాయిలో సాధించిన విజయాల ఉత్సాహంతో ఇప్పుడు గ్లోబల్ దిశగా అడుగులు వేస్తోంది. ‘బాహుబలి’, ‘ఆర్.ఆర్.ఆర్’, ‘పుష్ప’ వంటి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించాయి. అంతేకాదు ఆ సినిమాలు దేశీయ సరిహద్దులను దాటి, అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద సైతం కీలక వసూళ్లను నమోదు చేసాయి. ఈ క్రమంలో తెలుగు సినిమా గమ్యం మరింత స్పష్టమయ్యింది.

ఈ దిశలో కీలకమైన రెండు ప్రాజెక్టులు తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ మార్కెట్‌ లోకి ప్రవేశించే ప్రయత్నం పెట్టుకున్నాయి. అందులో మొదటిది మహేష్ బాబు, రాజమౌళి అడ్వెంచర్ ఎంటర్‌టైనర్, రెండవది అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న హై బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.

కానీ, కేవలం “విజన్” ఉంటేనే గ్లోబల్ మార్కెట్‌ను ఆకర్షించలేం. అక్కడి ప్రేక్షకులను, మార్కెట్ ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాకు సరిపోయే అంతర్జాతీయ ఎలిమెంట్స్‌ను చేర్చాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మన ఫిల్మ్ మేకర్లు స్పీడుగానే గ్రహించి, గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గ కంటెంట్‌తో పాటు, ప్రపంచ గుర్తింపు ఉన్న టాలెంట్‌ను కూడా ప్రాజెక్ట్‌లో చేర్చే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

హాలీవుడ్ నటులను భారతీయ సినిమాల్లోకి తీసుకురావడం ఒక యాదృచ్ఛిక నిర్ణయం కాదు. ఇది కేవలం స్టైల్ విషయంలో తీసుకున్న ఆలోచన కాకుండా, రాబడిని పెంచే వ్యాపార నిర్ణయం. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రేక్షకాభిరుచి, విస్తరిస్తున్న డిస్ట్రిబ్యూషన్ చానెళ్లను దృష్టిలో ఉంచుకుని తీసుకుంటున్న కొత్త బిజినెస్ మోడల్‌ ఇది. ఈ మార్పు ద్వారా తెలుగు సినిమా, ఇప్పుడు ఓ రీజినల్ వాయిస్ మాత్రమే కాదు — గ్లోబల్ స్క్రీన్‌పై ఓ ప్రొడక్టివ్ ఫోర్స్ అయ్యింది.

“అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి కీలక అంతర్జాతీయ మార్కెట్లు ఇప్పటికే తెలుగు సినిమాల కోసం తమ గేట్లు తెరిచేశాయి. కానీ ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ వంటి మార్కెట్లను టచ్ కావాలంటే... అక్కడి ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే గ్లోబల్ ఫేస్‌లు అవసరం,” అని వ్యాఖ్యానిస్తున్నారు అంతర్జాతీయ ఫిల్మ్ మార్కెటింగ్ కన్సల్టెంట్లు.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్,అట్లీ తో చేస్తున్న సినిమా, రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో, అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ టెక్నీషియన్‌లతో రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ మెగా స్టార్ విల్ స్మిత్‌ను ప్రధాన విలన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి(అఫీషియల్ ప్రకటన అయితే లేదు). ఇది నిజమైతే, తెలుగు సినిమా ప్రపంచ వేదికపైకి చకచకా ఎగబాకుతోందన్న సాక్ష్యం అవుతుంది.

ఓ రీజినల్ సినిమాకి విల్ స్మిత్ లాంటి నటుడు వస్తే... ఆ సినిమా ఇక రీజినల్‌గానే మిగలదు. అది ఒక అంతర్జాతీయ ప్రొడక్ట్‌గా మారుతుందనేది నిజం. అంతేనా ఇంకేమి జరుగుతాయి?

1. వరల్డ్‌వైడ్ విజిబిలిటీ

విల్ స్మిత్ ఓ గ్లోబల్ స్టార్. ఆయన ఉన్న సినిమాపై అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో ఆటోమేటిక్‌గా ఫోకస్ వస్తుంది. అల్లు అర్జున్‌కి ఇది ఒక విజువల్ ఇంటర్నేషనల్ ఎంట్రీ అవుతుంది.

2. హైప్, ప్రీ-రిలీజ్ బిజినెస్ రెవెన్యూ భారీగా పెరుగుతుంది

విలన్‌గా విల్ స్మిత్ అనే న్యూస్ ఒక్కటే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కి 100–200 కోట్లు అదనంగా తీసుకురాగలదు — థియేట్రికల్, OTT, మ్యూజిక్, సాటిలైట్ రైట్స్ అన్నింటిలోనూ. ప్రత్యేకంగా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ రేట్లు పెరుగుతాయి.

3. ఫిల్మ్ ఫెస్టివల్ & అవార్డ్ మార్కెట్

హాలీవుడ్ టాలెంట్ ఉన్న సినిమాలకు టోరంటో, బెర్లిన్, కాన్స్, SXSW లాంటి ఫెస్టివల్‌లు వీలైనంత త్వరగా స్పాట్‌లైట్ ఇస్తాయి. అవార్డ్ క్యాంపెయిన్ చేయడం సులభం అవుతుంది.

4. బ్రాండ్, కో-మార్కెటింగ్ అవకాశాలు

విల్ స్మిత్ గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్ కూడా. సినిమాకు Apple, Nike, Coca-Cola, Sony వంటి బిగ్ బ్రాండ్స్‌తో కో-బ్రాండింగ్ అవకాశాలు వస్తాయి — ఇవి అల్లు అర్జున్ పేరు గ్లోబల్ స్టేజ్‌కి తీసుకెళ్లగలవు.

5. స్క్రీన్‌పై గ్రాండ్ ఫేస్-ఆఫ్ – ఫ్యాన్స్‌కి మాస్ ఫెస్టివల్

అల్లు అర్జున్ మాస్ అటిట్యూడ్, విల్ స్మిత్ స్టైల్ & సన్నివేశం చూస్తే — ఇది ఒక "పుష్ప vs హాలీవుడ్" కాంబాట్‌గా నిలుస్తుంది. ఫ్యాన్స్‌కి ఇది విపరీతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.

6. సీక్వెల్స్, స్పిన్-ఆఫ్‌లు, OTT సిరీస్‌లకు మార్గం

ఒకసారి అలాంటి కాస్టింగ్ కాంబినేషన్‌కి రిస్పాన్స్ వచ్చాక...

సీక్వెల్స్

ప్రీక్వెల్స్

విలన్ స్పిన్-ఆఫ్ (Will Smith Origin Arc?)

గేమ్స్ & మెర్చండైజ్ లాంటి సబ్ బిజినెస్ విండోస్ తెరుచుకుంటాయి.

7. ఇండస్ట్రీకి రోడ్‌మ్యాప్: ఇతర తెలుగు సినిమాలు కూడా అదే మార్గం వెంట పడతాయి

ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే, ఇది తెలుగు సినిమా గ్లోబలైజేషన్‌కు ప్రూవ్ పాయింట్ అవుతుంది. ఇతర స్టార్లు, డైరెక్టర్లు కూడా అదే దిశగా ఇంటర్నేషనల్ ఫేస్‌లతో సహకారం పెంచేందుకు ఆసక్తి చూపుతారు.

* ఇది కాస్టింగ్ కదా? కాదు – ఇది మార్కెట్ ఓపెనింగ్ వ్యూహం.

హాలీవుడ్ టాలెంట్‌ని ఒక రీజనల్ సినిమాలోకి తీసుకోవడం అంటే కేవలం స్టార్ పవర్ మీద ఆధారపడటం కాదు. ఇది ఒక వ్యూహాత్మక వ్యాపార నిర్ణయం. ఆ నటుల ద్వారా వచ్చే అంతర్జాతీయ ఒప్పందాలు, డిస్ట్రిబ్యూషన్ ఛానెళ్లు, పబ్లిసిటీ వేదికలు — ఇవన్నీ కలిసి సినిమాకు విస్తృతమైన గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ తీసుకువస్తాయి. అందుకే, విల్ స్మిత్ జాయిన్ అయితే, అది కేవలం స్టార్ క్యాస్టింగ్ కాదు – అది మార్కెట్ ఓపెనింగ్ టూల్. ఇది గ్లామర్ విషయమే కాదు, వ్యాపార బలాన్ని పెంచే మోస్ట్ పవరఫుల్ మూవ్.

ఇప్పుడు కాస్టింగ్ decisions కేవలం కథకి తగ్గ రోల్ ఎంపికలతో కాకుండా, మార్కెట్ ఓపెనింగ్ వ్యూహాల‌తో ముందుకెళ్తున్నాయి. ఒక స్టార్ విలన్‌గా విల్ స్మిత్ లాంటి హాలీవుడ్ ఐకాన్ పేరు వినిపిస్తే — దాని అర్థం ఒక్కటే: ఆ సినిమా యూరప్, యుఎస్‌ఎ, బ్రెజిల్ వంటి కీ మార్కెట్లలో నేరుగా అడుగు పెడుతుంది. ఇంటర్నేషనల్ స్టార్స్‌కి స్క్రీన్ టైం ఇచ్చేంత మాత్రాన అది పెద్ద వార్త కాదు… వాళ్ల వల్ల ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ డోర్లు తెరుచుకుంటాయన్నదే అసలైన విషయమవుతుంది.

* మల్టీ లాంగ్వేజ్ ఎక్స్‌పాన్షన్: ఒకే సినిమా, పదికి పైగా మార్కెట్లు

ఈ సినిమా లాంగ్వేజ్ స్ట్రాటజీ అంతర్జాతీయ లక్ష్యాలపై స్పష్టంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. తెలుగు, తమిళం, హిందీ – డొమెస్టిక్ బేస్‌కి, ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ – నార్త్ అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, జపనీస్, కొరియన్ – ఈస్ట్ ఏషియన్ మార్కెట్, ఇవన్నీ డబ్బింగ్‌కి మాత్రమే కాదు, నేరుగా లాంగ్వేజ్ బేస్డ్ మార్కెటింగ్ & డిస్ట్రిబ్యూషన్ ప్లానింగ్ కోణంలో జరుగుతున్నాయన్నదే విశేషం.

* గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్‌నర్‌లు

ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న బిజినెస్ వ్యూహం ఎంత ప్లాన్డ్ గా ఉంటుందంటే , విల్ స్మిత్ సీన్ లోకి వస్తే పలు అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చర్చలు మొదలవుతాయి.

అమెరికా: A24, Lionsgate

యూరప్: StudioCanal, Pathé

ఆసియా: CJ Entertainment (దక్షిణ కొరియా), Toho (జపాన్)

మిడిల్ ఈస్ట్: VOX Cinemas

ఈ భాగస్వామ్యాలు కేవలం థియేట్రికల్ రిలీజ్ కోసం కాదు; ఇవి సినిమాకు బ్రాండ్ ప్రెజెన్స్, మల్టీ ఫేజ్ మార్కెటింగ్, థియేటర్-OTT బ్రిడ్జింగ్ వంటి అంశాల్లో కీలకంగా మారతాయి.

* ఫిల్మ్ బిజినెస్‌కు కొత్త టెంప్లేట్: ఒక తెలుగు సినిమా కథ, ప్రపంచ కథనంగా

అల్లు అర్జున్ – అట్లీ – విల్ స్మిత్ కాంబినేషన్, అలాగే మహేష్ బాబు – రాజమౌళి – ప్రియాంక చోప్రా ప్రాజెక్ట్ లాంటి ఎంటర్‌ప్రైజ్‌లను చూస్తే స్పష్టమవుతుంది: ఇది ఇక ఇండియన్ సినిమా కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఎకోసిస్టమ్‌ను గ్లోబల్ లెవెల్‌లో స్కేల్ చేయడం.

తెలుగు సినిమా ఇప్పటికే ‘ఆర్.ఆర్.ఆర్’తో ఆస్కార్ స్టేజ్ వరకు దూసుకెళ్లింది. ఇప్పుడు ఈ కొత్త ఫేజ్‌లో — తెలుగు టెక్నికల్ నిపుణత, అంతర్జాతీయ కాస్టింగ్, విస్తృత వ్యాపార మోడల్స్ అన్నీ కలిసి సినిమాను ఒక గ్లోబల్ టెక్ ఎంటర్‌టైన్‌మెంట్ యూనిట్‌గా తీర్చిదిద్దే దిశగా తీసుకెళ్తున్నాయి.

* ఫైనల్ గా :

ఈ మార్పు ఫిల్మ్ రిలీజ్ గురించి కాదు... ఇది ఓ ఇండస్ట్రీ ఎలివేషన్. రీజినల్ సినిమా మెనూ నుంచి, గ్లోబల్ మెయిన్ కోర్స్‌కి మారిన దశ గురించి చెప్పటమే.

Tags:    

Similar News