తొంభై ఏళ్ల వయస్సులో మరో మైలురాయికి చేరువగా..ఆశాభోంస్లే

ఆశా భోంస్లే.. పేరు చెప్పగానే తన స్వరంతో సమ్మోహనం చేసే రూపం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు తన వయస్సు 90 ఏళ్లు. తనుప్పు డు ఎప్పుడు నలభైల్లో లాగే భావిస్తూ ఉంటుంది.

Update: 2024-03-08 06:05 GMT
మనవరాలితో ఆశా భోంస్లే

1940 దశకం చివరిలో ఆమె తెరపైకి కనిపించినప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే ఉత్సాహంతో ఉంది. ఆ వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని మరోసారి రుజువు చేస్తూ, శనివారం (మార్చి 9) ముంబైలో 'ఆషా@90: వో ఫిర్ నహీ ఆతే' అనే సంగీత కచేరీ చేయడానికి సిద్దమైంది. తనకు పాటతో ఎనిమిది దశాబ్ధాల అనుబంధాన్ని మరో గుర్తు చేసుకోవడానికి ఇదే తగిన సమయంగా భావిస్తూ దీనికి నడుం బిగించారు.

“నబ్బే సాల్ మే కోయి బర్తే డే మనాతా హై క్యా? మైనే కహా షో కర్నే కి క్యా జరూరత్ హై, ఘర్ మే మనావో న పార్టీ, (90 ఏళ్ల వయసులో ఎవరు పుట్టినరోజు జరుపుకుంటారు? షో చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇంట్లో పార్టీ చేసుకుందాం)” అని ఆశా భోంస్లే చెప్పింది. అయితే నా కొడుకు ఆనంద్ మాత్రం తన తల్లి కమిట్ మెంట్ ను ప్రపంచానికి చూపాలని అనుకున్నాడు. 90 ఏళ్ల వయస్సులో పాట కోసం మూడు గంటలు ఎలా నిలుచుని ఉంటుందో ప్రపంచానికి చూపాలని అనుకున్నాడని ఆమె మరాఠీలో చెప్పారు. నా కొడుకు కోరికను తీర్చాలని అనిపించింది, అందుకే అంగీకరించానన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కొంత భాగాన్ని మేము కొన్ని ఛారిటీలకు పంపుతామని వారు వివరించారు.
ముంబై అంటే ఎందుకంత ప్రేమ
భోంస్లేకి, ముంబైలో ప్రదర్శన ఇవ్వడం ప్రత్యేకమైనది. తన కుటుంబం మొత్తాన్ని ముంబై సాకింది. పేదరికంలో ఉన్నప్పుడు అండగా నిలబడింది. అనేక సార్లు పాటలు పాడటానికి స్టూడియోల దగ్గరకు నడుచుకుంటూ వెళ్లేది. ఇంకొన్ని సార్లు బస్సుల్లో.. అలా తనకు ముంబైతో ఎన్నో జ్ఞాపకాలు అనుబంధాలు.. అందుకే ముంబై అంటే అంత అభిమానం. “జీవితంలో ఎదురయ్యే అన్ని సవాళ్ల మధ్య ముంబై నన్ను కాపాడింది. నేను చివరిసారిగా దుబాయ్‌లో ఒక పెద్ద కచేరీలో ప్రదర్శన ఇచ్చినప్పుడు (ఆమె గత ఏడాది సెప్టెంబర్ 8న 90 ఏళ్లు పూర్తి చేసుకుంది మరియు సెప్టెంబర్ 18న కచేరీ జరిగింది), నేను కొంచెం భయపడ్డాను.. కానీ ముంబై రాగానే సొంత ఇంటికి వచ్చినట్లు అనుభూతి చెందాను” అని ఆశా అంటున్నారు.
ఆశా కుటుంబం నేపథ్యం
మరాఠీ శాస్త్రీయ గాయకుడు, నటుడు అయిన దీనానాథ్ మంగేష్కర్ -శేవంతి(గుజరాతీ) దంపతులకు ఆశా మంగేష్కర్‌గా జన్మించారు. ఆమెకు తొమ్మిదేళ్ల వయసులో తండ్రి మరణించారు. తదనంతరం, ఆమె కుటుంబం మొదట పూణె నుంచి కొల్హాపూర్‌కు, ఆపై బొంబాయికి తరలివెళ్లింది. ఆమె కుటుంబాన్ని పోషించడం కోసం ఆమె, అక్క లతా మంగేష్కర్ కలిసి సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించారు. మజా బల్ (1943) అనే మరాఠీ చిత్రం కోసం ఆశా తన మొదటి సినిమా పాట పాడినప్పుడు తన వయస్సు కేవలం పది సంవత్సరాలు. తన సుదీర్ఘ కెరీర్ లో దేశంలోని అందరి సంగీత దర్శకులతో పనిచేసింది. ఇంతే కాకుండా గజల్స్, ఖవ్వాలీలు, భజనలు, జానపదాలు ఇలా 20 భాషల్లో 12 వేల పాటు పాడి 2011 లో గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో తన పేరు నమోదు చేసే వరకు వెళ్లారు.
1948లో హన్స్‌రాజ్ బెహ్ల్ చిత్రం చునారియా కోసం సావన్ ఆయా పాటతో ఆశా హిందీ చిత్రాలలో తన ప్లేబ్యాక్ రంగప్రవేశం చేసింది. ఆమె వయసు కేవలం 15. ఆమె రూ. 100 అందుకుంది. కొన్ని వేల పాటలు ఆమె గొంతు నుంచి ఉద్భవించాయి. పాత తరం సంగీత దర్శకులు, తరువాత ఆర్ డీ బర్మన్, ఏ ఆర్ రెహ్మన్, ఇళయరాజా, హిమేష్ రేష్మియా.. ఇలా ఎందరో ఆశా తో పాడించి... పాటకు ప్రాణం పోశారు.
ఆశా, ఆపలేనిది
వయస్సు వల్ల తన ఉత్సాహాం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఆశా ఉత్సాహంగా ఉంది. తన విస్తారమైన కచేరీల నుంచి ఆమె అభిమానులను వారి ఇష్టమైన మెలోడీలతో రీగేల్ చేయడమే కాకుండా, కచేరీలో భాగంగా శాస్త్రీయ నృత్య ప్రదర్శనను ప్రదర్శించే తన మనవరాలు ‘జానైకి’ ఒక వేదికను అందించడానికి కూడా ఆమె ఇష్టపడింది. “తను మూడేళ్ల నుంచి కథక్ నేర్చుకుంది. నాతో పాటలు పాడుతోంది. నటన అంటే ఇష్టం.నా మనవరాలు అని కాదు కాని కచ్చితంగా ఉన్నత స్థానానికి వెళ్తుంది. నేను ఆమెను ఎప్పుడూ ఆపలేదు. దయచేసి ఆమె నృత్యం చూడండి మరియు మీరు మరో స్టార్ పుట్టిందని అంగీకరిస్తారు” అని చెప్పుకొచ్చింది.
ఇదే చివరిది.. కాదు అవన్నీ వట్టి పుకార్లు..
ఇదే తన చివరి కచేరీ అని వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన ఆమె, మహారాష్ట్రలోని పూణె, కొల్హాపూర్, నాగ్‌పూర్ వంటి ఇతర ప్రాంతాల్లో పర్యటించాలని, అక్కడ తన అభిమానుల కోసం పాడాలని కోరుకుంటున్నట్లు ఆశా భోంస్లే తన మదిలోని మాటను బయట పెట్టారు. ఇటీవల మరణించిన గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ తో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని, నాకు అభిమానులు ఎలా ఉన్నారో.. నేను ఆయన సంగీతానికి పాటకు అభిమానినని చెప్పుకొచ్చారు.
'నామ్ గమ్ జాయేగా, చెహ్రా యే బదల్ జాయేగా/మేరీ ఆవాజ్ హీ పహచాన్ హై, గర్ యాద్ రహే (పేరు పోతుంది, ముఖం మారిపోతుంది / నా గొంతు ఒక్కటే గుర్తింపు, అది గుర్తే," అని గుల్జార్ యొక్క కినారా (1977)లో వచ్చిన ఈ పాట ఎంతమందికి గుర్తుంది. అక్క లతా.. చెల్లి భోంస్లేకు ఇది అక్షరాల వర్తిస్తుంది.
లెక్కలేనన్ని లిల్టింగ్ ట్రాక్‌లకు ప్రసిద్ధి చెందిన ఈ లెజెండరీ సింగర్ శనివారం జియో వరల్డ్ గార్డెన్ BKCలో జరగనున్న ‘ఆషా@90: వో ఫిర్ నహీ ఆతే’ అనే కచేరీలో మూడు గంటల పాటు పాడనున్నారు.


Tags:    

Similar News