మెగా బెంచ్ మార్క్ మన శంకర వరప్రసాద్ గారు
నాన్-థియేట్రికల్ డీల్ రికార్డ్స్!;
చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీకు సంభందించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా గురించిన కబుర్లే ఇప్పుడు అంతటా వినిపిస్తున్నాయి. స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్‌తో ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేయగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫుల్ సెక్యూరిటీ మధ్య మెగాస్టార్ ఎంట్రీ అదిరిపోయింది. చిరంజీవి స్టైలిష్ లుక్‌లో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
ఇదే ఊపులో ఈ సినిమాకు సంభందించి ఇండస్ట్రీ షేకింగ్ డీల్ క్లోజ్ అయింది. జీ స్టూడియోస్ ఈ సినిమాకి సంబంధించిన నాన్-థియేట్రికల్ రైట్స్ (డిజిటల్ + శాటిలైట్) ను ఒక ఫ్యాన్సీ ప్రైస్ కి సొంతం చేసుకోవటం అంతటా హాట్ టాపిక్ గా మారింది.
ట్రేడ్ ఈ సినిమా డీల్ ని... కేవలం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ గా చూడద్దు అంటోంది. సౌత్ కంటెంట్ గ్లోబల్ లెవల్‌లో ఏ స్థాయిలో డిమాండ్‌లో ఉందో చూపిస్తున్న ల్యాండ్‌మార్క్ గా వివరిస్తోంది.
డీల్ డైనమిక్స్ – ఇండస్ట్రీలో రికార్డు
Zee Studios: సౌత్ శాటిలైట్ & డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ మొత్తాన్ని బల్క్ డీల్‌గా కొనుగోలు చేసింది.
Amazon Prime: హిందీ డిజిటల్ రైట్స్‌ను జీ రీసేల్ చేసింది.
Netflix: బిడ్డింగ్‌లోకి దూకినా, జీ ఇచ్చిన మొత్తం మరీ ఎక్కువగా ఉండటంతో వెనక్కి తగ్గింది.
ఇది చరిత్రలో చిరంజీవి సినిమాలకే కాకుండా, అనిల్ రావిపూడి కెరీర్‌కే అత్యంత పెద్ద నాన్-థియేట్రికల్ డీల్. అంత మొత్తం పలకటానికి కారణం “Content is Currency” అనే ట్రేడ్ నమ్మే మాటనే.
ఇండియన్ ఫిల్మ్ మార్కెట్‌లో ఇప్పుడు రెండు కీలక ట్రెండ్స్ క్లియర్‌గా కనపడుతున్నాయి:
1. Hero + Director Brand Value
చిరంజీవి పాన్-ఇండియా ఇమేజ్, అనిల్ రావిపూడి ఇచ్చిన ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్స్ — ఈ కాంబినేషన్ స్ట్రీమింగ్ దిగ్గజాలకు గోల్డెన్ అసెట్ గా కనపడ్డాయి.
2. OTT Wars
ఒకప్పుడు OTTలు కేవలం బ్యాక్-అప్ ప్లాట్‌ఫామ్‌గా ఉండేవి. ఇప్పుడు, Netflix–Amazon–Zee లాంటి గ్లోబల్ ప్లేయర్స్ ప్రి-రిలీజ్ బిజినెస్ ని డిసైడ్ చేసే స్థాయికి చేరుకున్నాయి.
Hollywood Parallel : మార్వెల్ లేదా డిస్నీ కంటెంట్‌కి ఎలాంటి OTT రేసు జరుగుతుందో, ఇప్పుడు అదే సౌత్ స్టార్ సినిమాలకూ జరుగుతోంది.
3. Producers’ Safety Net
భారీ బడ్జెట్ పెట్టుబడులు ఉన్నా, థియేట్రికల్ రిజల్ట్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి డీల్ క్లోజ్ అయిన వెంటనే, ప్రొడ్యూసర్స్ “సేఫ్ జోన్”లోకి వెళ్ళిపోతారు.
గ్లోబల్ మార్కెట్ సిగ్నల్
ఈ డీల్ ఒక్క సినిమాకి సంబంధించినది మాత్రమే కాదు. ఇది Tollywood కంటెంట్ గ్లోబల్ OTT ల్యాండ్‌స్కేప్‌లో ఒక కొత్త బెంచ్‌మార్క్ అని అనలిస్టులు చెబుతున్నారు. సౌత్ స్టోరీలు ఇప్పుడు బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ కన్నా ఎక్కువ బిజినెస్ చేస్తున్నాయి.
* తెలుగు మార్కెట్ ఇప్పుడు Asian Content Hub గా ఫిల్టర్ అవుతోంది.
* కేవలం రిలీజ్ తర్వాత థియేటర్లలో హవా కాకుండా, post-theatrical economy కూడా భారీగా మారింది.
ఈ మూవీలో చిరంజీవి రోల్ ఏంటి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూవీలో ఆయన స్పై అధికారిగా కనిపించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి. కాదు ఓ డ్రిల్ మాస్టర్‌గా కనిపించనున్నారనే టాక్ కూడా వినిపించింది. తాజాగా టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే ఆయన ఓ పవర్ ఫుల్ ఆఫీసర్‌గా కనిపించనున్నారని అర్థమవుతోంది.
ఈ మూవీలో చిరంజీవి సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తుండగా... వీరితో పాటే కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా... వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.