‘లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్’ వెబ్ సిరీస్ రెవ్యూ
తెలుగువారికి నచ్చే కంటెంట్ ఉందా,మరి ట్రైలర్ లో కనిపించిన ఆ ఫీల్ గుడ్ డ్రామా సీరిస్ లో ఉందా? చూద్దాం.;
కొత్త తరహా సినిమాలకు, సీరిస్ లకు అడ్డాగా మారుతోంది మళయాళి పరిశ్రమ. అక్కడ సినిమాల్లో క్రైమ్ థ్రిల్లర్ ఎక్కువ ఉన్నా సీరిస్ లలో మాత్రం సీరియస్ ని తగ్గించి రొమాంటిక్ కామెడీలు, నిజ జీవిత సంఘటనలకు,సహజత్వానికి ప్రయారిటి ఇస్తున్నారు. అలా మన ముందుకు వచ్చి మరో మలయాళం వెబ్ సీరిస్ 'లవ్ అండర్ కన్స్ట్రక్షన్'. టైటిల్ లోనే కొత్తతనం చూపించిన ఈ సీరిస్ కథేంటి, కన్ స్ట్రక్షన్ అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది. తెలుగువారికి నచ్చే కంటెంట్ ఉందా,మరి ట్రైలర్ లో కనిపించిన ఆ ఫీల్ గుడ్ డ్రామా సీరిస్ లో ఉందా? వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
దుబాయి జాబ్ చేసే వినోద్ (నీరజ్ మాధవ్) కి ఒకటే కోరిక..తన సొంతూరు కేరళలలో ఓ ఇల్లు కట్టుకోవాలని. అందుకోసం డబ్బు పంపిస్తూంటాడు. మరో ప్రక్క అతని కజిన్ పద్మరాజన్ ( అజు వర్గీస్) ఇంటి పనులు చేస్తుంటాడు. ఇక వినోద్ కు పెళ్లి కాదు. ఓ సారి తమ పనులు చూసే పద్మరాజన్ కు ఫోన్ పంపాలనుకుంటాడు. అందుకోసం దుబాయ్ లో ఉంటున్న గౌరిని కలుస్తాడు. గౌరి ఇండియా వస్తుంది కాబట్టి ఆమె ద్వారా ఇండియాకు ఫోన్ పంపాలని ఆలోచన. ఆమెను దుబాయ్ లో కలిసిన తర్వాత వారిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది.
మరో ప్రక్క పద్మరాజన్ కు పెళ్లి కాదు. అందుకు కారణం అతని తల్లికు ఉన్న జాతకాల పిచ్చి. ఎన్ని పెళ్లి చూపులు చూసిన ఎక్కడో చోట సమస్య. ఇదిలా ఉండగా వినోద్ జాబ్ పోతుంది. దాంతో అదో సమస్యగా మారుతుంది. ఈలోగా వినోద్- గౌరి పూర్తిగా ప్రేమలో పడి పెళ్లి చేసుకుని కెనడా వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటారు. అందుకు పెద్దల సమ్మతి కావాలి. వాళ్లు ఆ పనిలో ఉంటారు. ఇద్దరూ తమ సొంత ఊరుకు వస్తారు. అయితే వినోద్ తో పెళ్లి కి గౌరీ తండ్రి ఒప్పుకోడు. ఇలా ఓ పక్కన పెళ్లి, మరో పక్క ఇల్లు నిర్మాణం రెండూ ఆగిపోతాయి. మరో ప్రక్క పద్మరాజన్ పెళ్లి పెండింగ్ లో ఉంటాయి. ఇవన్నీ ఎలా ఒక కొలిక్కి ఎలా వస్తాయి. చివరకు ఏమైందనేది మిగతా కథ.
ఎలా ఉంది
మళయాళం వాళ్ల వెబ్ సీరిస్ లలోనూ ముందు ఉంటున్నారు. సినిమాల్లో చెప్పలేని కంటెంట్ ని వాళ్ళు సీరిస్ లలో చెప్తున్నారు. సినిమా కథగా చూడకుండా చూస్తే వెబ్ సీరిస్ కథగా బాగుంటుంది. ఈ సీరిస్ ప్రమోషన్స్ లో మిథునం , వర వేలుపు కలిస్తే ఎలా ఉంటుంది, అది మోడ్రన్ వెర్షన్ లో చెప్తే అని ప్రమోట్ చేశారు. దాంతో ఈ సీరిస్ కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆ రెండు సినిమాలకు ఈ సీరిస్ కు సంభందం లేదు. ఎమోషనల్ ఇంటెన్సిటీ గా ఆ రెండింటిను పోలి ఉంటుంది. నిజ జీవితంలో వచ్చే సమస్యలని ఓ రొమాంటిక్ కామెడి గా రూపొందించారు. ముఖ్యంగా దుబాయ్ లో ఉద్యోగాలు, సొంత ఇంటి కల, పెళ్లిళ్లు లేటు అవడం వంటి మూడు అంశాలను తెలివిగా ఒకదానికొకటి ముడి పెట్టడంతో అందరూ కనెక్ట్ అవుతారు.
విష్ణు జి. రాఘవ దర్శకత్వం వహించిన ఈ సీరిస్ కు ఉన్న ప్లస్ ఏమిటంటే కేవలం అరే ఎపిసోడ్స్, అవీ ఒక్కోటి ముప్పై నిముషాలే ఉండటం ప్లస్ అయ్యింది. ప్రధాన పాత్రలు వినోద్ , గౌరి రెండు పాత్రలు ఆర్గానిక్ గా రాసుకోవటం కలిసొచ్చింది. అలాగే ఎక్కడైనా సీరిస్ డల్ అవుతుందనుకున్నప్పుడు ఆ ప్లేస్ ని ఫన్ తోనూ, కొన్ని ట్రబుల్స్ తోనూ నింపి ఎంగేజ్ చేశారు. అలాగే అజు వర్గీస్ క్యారక్టర్ ని, రొమాంటిక్ ట్రాక్ ని అవసరమైనప్పుడు తీసుకురావటం స్క్రీన్ ప్లే గిమ్మిక్కు. ప్రధాన పాత్రల మధ్య రిలేషన్ షిప్ ని మినిమల్ గా చూపటంతో సీరిస్ కు సహజత్వం వచ్చింది. అయితే కొంత ఓల్డ్ స్కూల్ క్యారికేచర్ , ట్రాన్సిక్షన్స్ కు కాస్త ఇబ్బంది పెడతాయి.
ఎవరెలా చేశారు
నీరజ్ మాధవ్ .. గౌరీ కిషన్ .. అజు వర్గీస్ .. ఆనంద్ మన్మథన్ .. ప్రధానమైన పాత్రలను పోషించిన వారంతా బాగా చేశారు. గోపీసుందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. అలాగే అజయ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. దుబాయ్ నేపథ్యంలో వచ్చిన సీన్స్ బాగా వచ్చాయి. అర్జూ బెన్ ఎడిటింగ్ చాలా స్పీడ్ గా వెళ్లిపోతుంది. చాలా పరిమిత బడ్జెట్ లో తీశారని అర్ధమౌతుంటుంది. అయినా సీరిస్ కాబట్టి ఆ సమస్య ఏమీ ఉండదు. దర్శకుడు చాలా పరిణితి వున్న ఓ కథని చూపించాలనే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం జనరంజకంగా నే ఉంది.
చూడచ్చా
చిన్న చిన్న ఎపిసోడ్స్ గా సాగే ఈ 6 ఎపిసోడ్ ఫన్ వెబ్ సీరిస్ ని సరదాగా చూసేయొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూడవచ్చు.
ఎక్కడ చూడచ్చు
ఈ సిరీస్, క్రితం నెల 28వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.