శ్రీకృష్ణ దేవరాయలు - 11 అబ్బుర పరిచే విశేషాలు...
ఆమూక్తమాల్యద అనే పేరును రాయలు ఎక్కడి నుంచి స్వీకరించారు.;
By : The Federal
Update: 2025-07-23 13:31 GMT
1. కోదై / గోదా / పూబాల
శ్రీకృష్ణదేవరాయల భార్య చిన్నాదేవి మొదట్లో పూలపిల్ల.
2. పుష్పలావికలను వర్ణించిన మొదటికవి రాయలు.
పూలపిల్ల ప్రియుడు కనుక.
3. ఆముక్తమాల్యద అనే పేరు అనంతాచార్యవిరచిత
ప్రపన్నామృతం నుండి గ్రహించాడు.
4. ఆముక్తమాల్యద రాయలవారి చరిత్రనే మార్మిక
ప్రతీకాత్మకంగ.
5. ఆముక్తమాల్యదలోని అనేక వర్ణనలకు నాలాయిర దివ్య
ప్రబంధంలోని పాశురాలు మూలం.
6. ఆముక్తమాల్యదలోని కొన్నిపద్యాలకువిష్ణుపురాణంలోని
శ్లోకాలు మూలం.
7. రాయలవారు తిరుమలను ఏడు పర్యాయాలు దర్శిం చారు,ఆముక్తను ఏడు ఆశ్వాసాలుగ విభజించారు.
8. ఆముక్తమాల్యద కవిత్రచరిత్రకూడా. విష్ణుచిత్తులు,
గోదాదేవి,యామునాచార్యులు అనే కవుల చరిత్ర
ఈ ప్రబంధంలలో ఉంది.
9. వేంకటభర్తకు అంకితమీయబడినతొలితెలుగు ప్రబంధం
ఆముక్తమాల్యద
10. రాయలు ఏడు పర్యాయాలు తిరుమల వచ్చినాకూడా
తిరుచానూరు వెళ్లలేదు,ఆధారాలులేవు.
11. రాయలవారి ప్రస్తుత మూర్తికి/చిత్రానికి మాతృక
తిరుమలలోని రాయలవారి లోహ విగ్రహం,మరియూ
పూనాలో లభించిన విదేశీయచిత్రకారుడు చిత్రించిన
బొమ్మ.
-వైద్యంవేంకటేశ్వరాచార్యులు