చిరంజీవికి గోల్డెన్ వీసా.. దీని వల్ల లాభాలేంటి..

మెగాస్టార్ చిరంజీవిని యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాతో సత్కరించింది. అయితే అసలు ఈ గోల్డెన్ వీసా ఏంటి? ఎవరికిస్తారు? లాభాలేంటి?

Update: 2024-05-28 11:58 GMT

మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. చిరంజీవి తెలియని సినీ ప్రేమికుడు ఉండడనే చెప్పాలి. ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీలో బిగ్ బీ అమితాబ్ అయితే.. బిగ్ బాస్ మాత్రం చిరునే. దీనిని బాలీవుడ్ కూడా అంగీకరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. దీంతో ఆయనకన్నా ఆయన అభిమానులు ఎక్కువ ఆనందపడిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరూకి శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాకే ఊపిరాడకుండా చేస్తున్నారు.

గోల్డెన్ వీసా ఎవరికిస్తారు

గోల్డెన్ వీసాను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. ప్రత్యేక రంగంలో విశేష సేవ అందించిన వారికి ఈ గోల్డెన్ వీసాను అందిస్తున్నారు. ఈ సందప్రదాయం ప్రధానంగా యూరోపియన్, అరబ్, కరేబియన్ దేశాలలో కనిపిస్తుంటుంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా అర్హులైన వారు ఈ గోల్డెన్ వీసా, పాస్‌పోర్ట్‌లను పొందవచ్చు. వీరిలో ఇన్వెస్టర్లు, నటులు, శాస్త్రవేత్తలు, అసాధారణ ప్రతిభ ఉన్న గ్రాడ్యుయేట్లకు 10 పదేళ్లుగా యూఏఈ ఈ వీసాలను అందిస్తోంది. ఈ వీసాను ఇప్పటివరకు షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్, సానియా మీర్జా, జాహ్నవి కపూర్, సోనూ సూద్, రణవీర్ సింగ్, సంజయ్ దత్ తదితరులు అందుకున్నారు.

సామాన్యులు కూడా అప్లై చేసుకోవచ్చు

ఈ గోల్డెన్ వీసా కోసం సామాన్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం వారి వయసు 18ఏళ్లకు పైబడి ఉండాలి. అంతేకాకుండా ఏ దేశం గోల్డెన్ వీసా కావాలో ఆ దేశంలో ఆ దేశ నియమనిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టిన నగదుకు సంబంధించిన రుజువు కూడా చూపించాలి. దాంతో పాటుగా సదరు వ్యక్తికి నేర చరిత్ర ఉండకూడదు. అప్పుడు సదరు దేశం దరఖాస్తుదారుకు గోల్డెన్ వీసాను అందిస్తుంది.

ప్రయోజనాలేంటంటే..

ఈ గోల్డెన్ వీసా, పాస్‌పోర్ట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. విదేశాలలో ఆస్తిని కొనుగోలు చేయడం సులభమవుతుంది. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా సులభమే. ఈ వీసా వేలిడిటీ 1-2 సంవత్సరాలు ఉంటుంది. వేలిడిటీ పూర్తయిన తర్వాత దీనిని పునరద్దరించుకోవచ్చు కూడా. సదరు దేశంలో 5-10 ఏళ్లు ఉంటే అక్కడి శాశ్వత పౌరసత్వం పొందడానికి అర్హులు అవుతారు.

Tags:    

Similar News