‘కంప్యూటర్ చిప్‌లపై 100 శాతం సుంకం’

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం..;

Update: 2025-08-07 08:22 GMT
Click the Play button to listen to article

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంప్యూటర్ చిప్‌లపై 100 శాతం టారిఫ్ విధించనున్నట్టు ప్రకటించారు. ట్రంక్ నిర్ణయంతో ఎలక్ట్రానిక్స్, కార్లు, గృహోపకరణాలు లాంటి ఎన్నో ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ఓవల్ ఆఫీసులో సమావేశం సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికాలో చిప్స్ తయారు చేస్తే ఎలాంటి టారిఫ్ ఉండదని ట్రంప్ స్పష్టం చేశారు.

ట్రంప్ తొలిసారి అధ్యక్ష పదవి చేపట్టినపుడు ఎలక్ట్రానిక్స్‌కు టారిఫ్‌ల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. అయితే ఇప్పుడు దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో నూతన విధానాన్ని తీసుకొచ్చారు. కొవిడ్ సమయంలో చిప్స్ కొరత కారణంగా కార్ల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాలో చిప్‌లు తయారు చేసే కంపెనీలకు ఈ దిగుమతి పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ట్రంప్ నిర్ణయం టెక్ కంపెనీలకు సానుకూలంగా మారిందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు.
కాగా ట్రంప్ నిర్ణయంపై చిప్ తయారీదారులు Nvidia, Intel ఇంకా స్పందించలేదు. కాగా ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ చిప్‌లకు డిమాండ్ పెరుగుతోంది. అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. 19.6 శాతం పెరిగాయని వరల్డ్ సెమీకండక్టర్ ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఆర్గనైజేషన్ తెలిపింది.
Tags:    

Similar News