స్వీడన్ పాఠశాలలో ఉన్మాది కాల్పులు

పది మంది వయోజన విద్యార్థుల మృతి, వలసదారుల పనేనా అని అనుమానం;

Update: 2025-02-05 07:10 GMT

యూరప్ లోనే అత్యంత భద్రమైన దేశంగా పేరు పొందిన దేశమైన స్వీడన్ మంగళవారం కాల్పులతో ఉలిక్కిపడింది. ఓ వయోజన విద్యా కేంద్రంలో గుర్తు తెలియని దుండగుడు శిక్షణ పొందుతున్న విద్యార్థులే లక్ష్యంగా కాల్పులు జరిపాడు.

ఇందులో దాదాపు 10 మంది మరణించారు. చనిపోయిన వారిలో నిందితుడు సైతం ఉన్నాడని పోలీసులు తెలిపారు. రాజధాని స్టాక్ హోమ్ కు 200 కిలోమీటర్ల దూరంలోని ఒరెబ్రో శివారులో ఈ దుర్ఘటన జరిగింది.

క్యాంపర్ రిస్ బర్గ్స్కా అని అనే పాఠశాలలో ఇస్లామిక్ దేశాల నుంచి వస్తున్న వలసదారులకు, వృత్తి శిక్షణ, మేథో హక్కుల వైకల్యం ఉన్న వారికి కొన్ని తరగతులను గత 20 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు.
ఈ ఘటనపై ప్రధానమంత్రి స్పందించారు. అమాయక ప్రజలపై క్రూరమైన హింసకు పాల్పడ్డారని విచారం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటి వారైన విడిచిపెట్టేది లేదని, పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నాయని వెల్లడించారు. ఇది స్వీడీష్ చరిత్రలోనే అత్యంత దారుణమైన మాయని మచ్చని  అన్నారు. నిందితుడి గురించి పూర్తి వివరాలు ఇంకా అందలేదని విలేకరుల సమావేశంలో చెప్పారు.
స్వీడన్ లో హింస జరగడం చాలా అరుదు. కానీ ఈ మధ్య ఆ దేశం తరుచుగా దాడులకు గురవుతోంది. వలస వచ్చిన ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలు అక్కడ బాంబుదాడులు, దొంగతనాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇంతకుముందు కేవలం కత్తులు, గొడ్డళ్లతో జరిగే దాడులు కాస్త ఇప్పుడు తుఫాకీ కాల్పుల వరకూ చేరింది.
న్యాయశాఖ మంత్రి గున్నార్ స్ట్రోమర్ మాట్లాడుతూ.. ఇది మొత్తం స్వీడీష్ సమాజాన్నే కుదిపేసే ఘటనగా అభివర్ణించారు. ఇన్నాళ్లు స్వీడన్ ప్రజలు వేరే దేశాలలో ఇలాంటి జరిగేవని పుస్తకాలు, పేపర్లలో చదివేవారు. ఇప్పుడు ప్రత్యక్షంగా వాటిని చూస్తున్నారు. అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఇంతకుముందు ఏ పాఠశాలలో ఇలాంటి ఘోరం జరగలేదని అన్నారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన యూరప్
స్వీడన్ లో కాల్పులు చోటు చేసుకోవడంతో యూరప్ కూడా స్పందించింది. బ్రస్సెల్స్ లోని అధికారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఈ రోజు ఒరెబ్రోలో జరిగింది నిజంగా భయంకరమైనది’’ అని యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాలను పోస్టు చేశారు. హింస, ఉగ్రవాదానికి మన దేశాలలో, సమాజాలలో చోటు లేదన్నారు. స్వీడన్ ప్రజలకు అండగా నిలబడతామని అన్నారు.
పోలీసులు ఏం చెబుతున్నారు
పాఠశాలలో మారణహోమం సృష్టించిన తరువాత నిందితుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్పుల తరువాత పోలీసులు నిందితుడి ఇంటిని చుట్టుముట్టి సోదాలు చేస్తున్నారు.
అయితే ఆ తరువాత ఎలాంటి సమాచారాన్ని పోలీసులు వెల్లడించలేదు. కాల్పులు జరుగుతున్న సమయంలో పాఠశాలలో తక్కువ మంది ఉండటంతో మృతుల సంఖ్య భారీగా తగ్గిందని పోలీసులు, ఉపాధ్యాయులు చెబుతున్న మాట. మధ్యాహ్నం 12. 30 నిమిషాల ప్రాంతంలో కాల్పులు ప్రారంభం అయ్యాయని పాఠశాల చుట్టు పక్కలా ప్రాంతంలో ఉన్న నివాసితులు చెప్పారు.
తాము పది రౌండ్ల కాల్పలు శబ్ధాలు విన్నామని కూడా వారు చెప్పారు. 28 ఏళ్ల ఆండ్రియా మాట్లాడుతూ.. తాము ఆ సమయంలో పాఠశాలలోనే ఉన్నామని, కాల్పుల శబ్ధం విని బారికేడ్ లు వేసుకున్నామని స్థానిక వార్తాపత్రికతో చెప్పారు.
Tags:    

Similar News