నిషేధం నేపాల్ యువతను ఎలా రెచ్చగొట్టింది?

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలపై నిషేధం విధించిన కేపీ ఓలీ సర్కార్, దేశవ్యాప్తంగా నిరసనలు, 19 మంది మృతి;

Update: 2025-09-09 05:49 GMT
నేపాల్ లో ఆందోళన చేస్తున్న యువత

అభిజిత్ సింగ్ భాంబ్రా

సోషల్ మీడియా బ్యాన్ నేపాల్ ను రణరంగంలా మార్చింది. యువతరం మొత్తం నేపాల్ పార్లమెంట్ ను ధిగ్భందించింది. దీనితో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 19 మంది మరణించారు. జనరల్ జెడ్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలు డిజిటల్ బ్లాక్ అవుట్ పై కోపంగా కారణంగా ప్రారంభమయ్యాయి.

ఇవి త్వరగానే నేపాల్ లోని అవినీతి, నిరంకుశత్వం, జవాబుదారీతనం లేకపోవడాన్ని వ్యతిరేకిస్తూ విస్తృత ఉద్యమంగా మారాయి. పార్లమెంట్ సమీపంలో పోలీసులతో ప్రదర్శనకారులు ఘర్షణకు దిగారు. Full View

ఉద్రిక్తతలు పెరగడంతో ప్రభుత్వం సైన్యాన్ని మోహరించింది. రాత్రి 10 గంటలకు వరకూ నగర వ్యాప్త కర్ఫ్యూ విధించింది. ఇది ఇటీవల సంవత్సరాలలో నేపాల్ లో యువత నేతృత్వంలో జరిగిన అతిపెద్ద నిరసనగా నిలిచింది.

నిషేధం ఎందుకు?
ప్రభుత్వం ప్రకారం.. ప్లాట్ ఫాం కమ్యూనికేషన్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోవడంలో ఆలసత్వం చేయడంతో నిషేధం విధించింది. అధికారులు ఈ చర్యను నియంత్రణ విషయంగా చెబుతున్నారు.
అయితే నిరసనకారులు దీనిని సెన్సార్ షిప్, విమర్శనాత్మక స్వరాలను వినిపించకుండా చేయడానికి, భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నంగా భావించారు. ఆ అవగాహాన ఆన్ లైన్ ప్లాట్ ఫాం స్వేచ్ఛా వ్యక్తీకరణకు అవసరమైన ఫ్లాట్ ఫాంగా భావిస్తున్న యువతలో కోపాన్ని రేకెత్తించింది.
నేపాల్ ప్రధాని కేపీ ఓలి తన ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ‘‘దేశాన్ని అణగదొక్కే ఏ ప్రయత్నాన్ని కూడా ఎప్పటికే సహించము. దేశ స్వాతంత్య్రం కొంతమంది వ్యక్తుల ఉద్యోగాల నష్టం కంటే గొప్పది. చట్టాన్ని ధిక్కరించడం, రాజ్యాంగాన్ని విస్మరించడం, జాతీయ గౌరవం, స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని అగౌరవపరచడం ఎలా ఆమోదయోగ్యం?’’ అని అన్నారు. ఇది కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది.
గ్లోబల్ టెక్ సంస్థలు...
గత ఏడాది నేపాల్ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఆగష్టు 28 నుంచి ఏడు రోజుల పాటు సోషల్ మీడియా కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. కానీ గడువు ముగిసినప్పటికీ మెటా(ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్) అల్భాబెట్(యూ ట్యూబ్, గూగూల్), ఎక్స్, రెడ్డిట్, లింక్డ్ ఇన్ వంటివి ఏవి కూడా దరఖాస్తు చేసుకోలేదు.
నేపాల్ డిజిటల్ ప్లాట్ ఫాంలను వ్యతిరేకించడం ఇదే తొలిసారి కాదు. జూలైలో ఆన్ లైన్ మోసాలు, మనీలాండరింగ్ చేస్తున్నారంటూ టెలిగ్రామ్ ను బ్లాక్ చేసింది. అంతకుముందు ఆగష్టు 2024 లో నేపాలీ నిబంధనలు పాటించడానికి టిక్ టాక్ అంగీకరించడంతో దానిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
పెద్ద పోరాటం..
ఖాట్మండ్ లో రాత్రి సమయంలో, నిరసనలు, యాప్ లను యాక్సెస్ చేయడం కంటె పెద్ద అర్థంలోకి మారిపోయాయి. ఆన్ లైన్ లో పెరిగిన తరానికి, ఈ ఉద్యమం ఇప్పుడు స్వేచ్చా, జవాబుదారీతనం, నేపాల్ ప్రజాస్వామ్య భవిష్యత్ గురించి ఆందోళనలు వెల్లువెత్తాయి.
రాజధాని వీధులు సమాధానం లేని ప్రశ్నను ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రభుత్వం తన యువత డిమాండ్లను పట్టించుకునే పరిస్థితి ఉందా లేకపోతే ఈ నిరసన స్వరాలు ఇంకా బలంగా పెరుగుతాయా? లేదా వేచి చూడాలి.


Tags:    

Similar News