మన పొరుగు దేశం బంగ్లాదేశ్ లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విద్యార్థి నాయకుడు హత్య తరువాత బంగ్లాదేశ్ తో సంబంధాలు తీవ్రంగా క్షీణించాయి. ఇండియా ప్రస్తుతం తీవ్రమైన దౌత్యపరమైన సవాల్ ను ఎదుర్కొంటుంది.
కొన్నిరోజులకు ముందు ఢాకాలో భారత వ్యతిరేక ప్రదర్శనలు చెలరేగడంతో ఖుల్నా, రాజ్ షామీలోని రెండు వీసా కేంద్రాలను న్యూఢిల్లీ మూసివేసింది. బంగ్లాదేశ్ విద్యార్థి తిరుగుబాటు నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ పై కాల్పులు జరిపిన అజ్ఞాత బందూక్ దార్ లు హత్య చేశారు.
గతవారం కాల్పులకు గురైన హాదీని మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కు తరలించారు. అక్కడే అతను ప్రాణాలు కోల్పోయాయి. అతనిపై కాల్పులు జరగడం నిరసనలకు దారితీసింది.
మొదట ఢాకాలోని భారత వీసా కేంద్రాన్ని మూసివేయగా.. తరువాత కొద్ది రోజులకు తెరిచారు. ఆ తరువాత ఖుల్నా, రాజ్ షాహీలలో ఉన్న కేంద్రాలను మూసివేశారు.
చెలరేగిన హింస..
హాది మరణం తరువాత బంగ్లాదేశ్ అంతటా నిరసనలకు దారితీసింది. వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వచ్చారు. రాజధానిలోని కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగిందని వార్తలు వస్తున్నాయి.
బంగ్లాదేశ్ లోని రెండు ప్రముఖ వార్తా పత్రికలు ఉన్న భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హత్య తరువాత ప్రజల ఆగ్రహం తీవ్రత అక్కడ ఉన్న అశాంతిని తెలియజేస్తోంది.
ఈ నిరసనలన్నీ కూడా భారత వ్యతిరేక స్వరంగా మారయి. ఇది న్యూఢిల్లీ దౌత్య స్థానాన్ని క్లిష్టతరం చేసింది. గత ఆగష్టులో షేక్ హసీనాను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి భారత్- బంగ్లాదేశ్ సంబంధాలు క్రమంగా క్షీణించడానికి సంకేతాలుగా వీసా కేంద్రాల మూసివేతను పేర్కొనవచ్చు.
నాటకీయంగా హసీనా 2024 ఆగష్టులో భారత్ కు శరణార్థిగా వచ్చారు. ఇది ఆమెకు భారత్ కు ఉన్న సన్నిహిత సంబంధాలను తెలియజేస్తోంది.
బెదిరింపులు..
ఢాకాలో మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక విద్యార్థి మద్దతుగల ప్రభుత్వం ఇప్పుడు హసీనాను అప్పగించాలని భారత్ పై ఒత్తిడి చేస్తోంది. ఈ డిమాండ్ ను భారత్ పట్టించుకోవడం లేదు.
కొన్ని వార్తా నివేదికల ప్రకారం.. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్స్ పార్టీతో సంబంధం ఉన్న ఒక విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ.. ఈశాన్య భారతంలోని వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పిస్తామని హెచ్చరించాడు. ఇది న్యూఢిల్లీ-ఢాకా మధ్య ఉన్న దిగజారిన సంబంధాలను తెలియజేస్తోంది.
ప్రాంతీయ ప్రభావాలు..
బంగ్లాదేశ్ లోని అల్లకల్లోలం పాకిస్తాన్ కు కొత్త అవకాశాన్ని సృష్టించింది. బంగ్లా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. 1971 లో ఏర్పడిన బంగ్లాదేశ్ తో ఇప్పుడు భారత్ సంబంధాలు క్షీణిస్తున్నాయి.
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ను ఉటంకిస్తూ ఒక నివేదిక ఈ పరిస్థితిని ఈ ప్రాంతంలో భారత్ ఎదుర్కొంటున్న అతిపెద్ద వ్యూహాత్మక సవాల్ గా అభివర్ణించింది. అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత చైనా- పాకిస్తాన్ మధ్య సంబంధాలు పెరగడంతో పాటు, ఇస్లామిక్ రాడికల్స్ ప్రభావం పెరుగుతుండటం వల్లే ఈ అశాంతి తలెత్తిందని థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ గుర్తించింది.
పొత్తులు మార్చడం..
షేక్ హసీనా బంగ్లా పాలకురాలిగా దిగిపోయిన తరువాత ఇస్లామాబాద్, యూనస్ మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడ్డాయి. ఈ పరిణామం బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీల మధ్య లోతైన సహకారం, సైనిక ఏర్పాట్ల అవకాశాలను పెంచింది. బంగ్లాదేశ్ లో ప్రధాన ఆర్థిక భాగస్వామి అయిన చైనా ఇప్పటి వరకూ బహిరంగ జోక్యానికి దూరంగా ఉంది. కానీ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తూనే ఉంది.
ఎలాంటి పరిస్థితులు..
న్యూఢిల్లీ దగ్గర ఇప్పుడు కొన్ని ఛాయిస్ లు మాత్రమే దౌత్యపరంగానే ఉంది. షేక్ హసీనాను అప్పగించడానికి నిరాకరించడంతో రాజీపడకుండా సంబంధాలలో పతనాన్ని అరికట్టడానికి అధికారులు కృషి చేస్తున్నారు. బంగ్లాదేశ్ కోర్టు మాజీ ప్రధాని యుద్ధ నేరాలకు పాల్పడినట్లు దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ తీర్పు భారత్ పై ఒత్తిడి చేయడానికి ఉపయోగిస్తోంది.
ఒక ఇంటర్వ్యూలో హసీనా మాట్లాడుతూ.. కంగారు కోర్టు తీసుకున్న నిర్ణయంగా తోసిపుచ్చారు. ఇది ఎన్నిక కాని తాత్కాలిక ప్రభుత్వం తరఫున చేస్తున్నట్లు ఆరోపించారు.
అయితే భారత్ కు ముగుస్తున్న సంక్షోభం దాని వ్యూహాత్మక ప్రయోజనాలను నేరుగా దెబ్బతీసే విధంగా ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలను పునర్నిర్మించే ప్రమాదం ఉంది.