నాణెల ఉత్పత్తి నిలివేయమంటున్న డొనాల్డ్ ట్రంప్
తక్కువ విలువ వాటికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతున్నాయని వాదన;
By : The Federal
Update: 2025-02-10 09:11 GMT
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ .. స్వదేశం, విదేశం అని తేడా లేకుండా, ఆ రంగం.. ఈ రంగం వివక్ష చూడకుండా అన్ని డిపార్ట్ మెంట్లను హడలు గొట్టేస్తున్నారు. తాజాగా ఆయన నాణేల ముద్ర వల్ల ఎక్కువ ఖర్చు అవుతుందని, వాటిని ఆపమని ట్రేజరీ శాఖను ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.
‘‘చాలాకాలంగా అమెరికా ఫెన్నీలను ముద్రిస్తోంది. దీని విలువ అక్షరాల 2 సెంట్ల కంటే ఎక్కువ. ఇది వృథా’’ అని ట్రంప్ ఆదివారం రాత్రి తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.
‘‘కొత్త ఫెన్నీలు ఉత్పత్తి చేయడం ఆపమని నేను నా ట్రెజరీ కార్యదర్శికి సూచించాను’’ అని రాసుకొచ్చారు. మన గొప్ప దేశంపు బడ్జెట్ వ్యర్థాలను చీల్చి వేద్దాం. అది ఒక్క పైసా అయినా సరే అని ట్రంప్ తన పోస్ట్ లో తెలిపారు.
ఎందుకు ఇంత త్వరగా..
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ విభాగ సామర్థ్యం(డోగ్) గత నెలలో ఎక్స్ లో పెన్నీ ఉత్పత్తి ఖర్చును హైలైట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. సెప్టెంబర్ లో ముగిసిన 2024 లో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో యూస్ మింట్ ఉత్పత్తి చేసిన దాదాపు 3.2 బిలియన్ పెన్నీలపై 85.3 మిలియన్ డాలర్లను కోల్పోయినట్లు వెల్లడించింది.
ప్రతి పైసాకు దాదాపు 0.037 ఖర్చవుతుంది. అంతకుముందు ఇది 0.031 డాలర్లుగా ఉండేది. ప్రతి 0.05 విలువ చేసే నాణాన్ని తయారు చేయడానికి దాదాపు 0.14 డాలర్లు ఖర్చు అవుతోంది. నికెల్ పై కూడా మింట్ డబ్బును కోల్పోతోంది.
తక్కువ విలువ కలిగిన ఒక సెంటు నాణాన్ని రద్దు చేసే అధికారం ఉందా లేదా అని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిసింది. ‘‘యూఎస్ లో పెన్నీని నిలిపివేయడం అనే ప్రక్రియ కొంచెం అస్పష్టంగా ఉంది. దీనికి కాంగ్రెస్ చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ట్రెజరీ కార్యదర్శి కొత్త పెన్నీల ముద్రణను ఆపగలదు’’ అని నార్త్ ఈస్టర్న్ విశ్వ విద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ రాబర్ట్ కే. ట్రీస్ట్ గత నెలలో అన్నారు.
పెన్నీని తొలగించాలి..
అనేక దేశాలు నాణేలు తొలగించాయని, వాటి వల్ల ఖర్చు ఆదా, రిజిస్టర్ల వద్ద వేగవంతమైన చెక్ అవుట్ సాధ్య అవుతుందని తేలింది. ఉదాహారణకు కెనడా 2012 లోనే ఫెన్నీలను ముద్రించడం ఆపి వేసింది.
కాంగ్రెస్ సభ్యులు పదే పదే రాగి పూతతో కూడిన జింక్ నాణెంను లక్ష్యంగా చేసుకుని చట్టాన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నేషనల్ రీ సెర్చ్ సర్వీస్ ప్రకారం.. పెన్నీ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయడానికి, దానికి చెలామణి నుంచి తొలగించడానికి లేదా ధరలను ఐదు సెంట్లకు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ట్రంప్ కొత్త పరిపాలన విభాగం.. ఖర్చులను తగ్గించడంపై తీవ్రంగా దృష్టి సారించింది. మస్క్ మొత్తం ఏజెన్సీలను, ఫెడరల్ వర్క్ ఫోర్స్ లో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం ద్వారా రెండు ట్రిలియన్ల పొదుపు లక్ష్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వ్యర్థాల నిర్వహాణ..
రీ సైక్లింగ్, వ్యర్థ పదార్థాల నిర్వహణ సంస్థ కోవాంటా హెల్డింగ్ కార్ప్ అంచనా ప్రకారం.. అమెరికన్లు నాణెలను చెత్తబుట్టలో వేయడం ద్వారా సంవత్సరానికి 62 మిలియన్ డాలర్లు నష్టపోతున్నారు. కారు సీట్లు, సోఫాలు, ఇతర ప్రాంతాలలో శుభ్రం చేసే సమయంలో వాక్యూమ్ క్లీనర్లు ద్వారా నాణెలు లోపలికి తీసుకోవడంతో అవన్నీ చెత్తబుట్టల్లోకి వెళ్తున్నాయని కొన్ని అంచనాలు ఉన్నాయి.
చెత్త నుంచి ఈ నాణెలు బయటకు తీయడానికి శక్తివంతమైన అయస్కాంతాలు, ఇతర పరికరాలను ఉపయోగించిన కంపెనీ వాటిని సేకరిస్తోంది. తరువాత నాణెలను అమ్మడం ద్వారా డబ్బు సంపాదిస్తోంది.
అయితే కొంతమంది వీటిల్లో నకిలీ నాణెలు అమ్ముతున్నారని అనుమానించిన యూఎస్ మింట్ వాటిని కొనుగోలు చేయడం ఆపింది. అలాగే అమెరికా లోని ట్రాన్స్ పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా పొగొట్టుకున్న పెన్నీల నుంచి ప్రయోజం పొందుతోంది. ఇది 2014 లో ప్రయాణికులు వదిలిపెట్టిన అర మిలియన్ కంటే ఎక్కువ విలువైన పెన్నీలను సేకరించిందని, ఆ డబ్బును ఎవరు క్లెయిమ్ చేయకపోవడంతో దాని భద్రతా కార్యకలాపాలకే వినియోగించినట్లు నివేదిక తెలిపింది.
ఒక రూపాయి నాణెం పరిస్థితి..
దేశంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. 2018 లో దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తు ప్రకారం.. ఒక రూపాయి నాణెం ముద్రించడానికి రూ. 1.11 ఖర్చవుతుంది. ఇది దాని ముఖ విలువ కంటే ఎక్కువ.
అయితే 2, 5, 10 వంటి నాణెలు ముద్రణ వాటి ముఖ విలువ కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అలాగే ప్రతి సంవత్సరం ముద్రించబడుతున్న నాణెల సంఖ్య తగ్గుతోంది. ఒక రూపాయి నాణెల ఉత్పత్తి 2017 లో 903 మిలియన్ ల నుంచి 2018 నాటికి 630 మిలియన్ నాణెలకు తగ్గింది.