తొమ్మిదో యుద్దాన్ని సైతం ఆపేస్తా: ట్రంప్

పశ్చిమాసియా పర్యటన తరువాత పాక్-ఆప్ఘన్ యుద్ధం నివారణ చర్యలు

Update: 2025-10-13 13:10 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇప్పటి వరకూ ఎనిమిది యుద్ధాలు ఆపినట్లు గొప్పలు చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు తాజాగా పాక్- ఆప్ఘన్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలను నివారించడం పై దృష్టి పెట్టినట్లు ప్రకటించారు.

అలాగే ఈ శాంతి ప్రయత్నాలకు తాను నోబెల్ బహుమతి కోరుకోవడం లేదని చెప్పారు. గాజాలో కాల్పుల విరమణ కుదిరిన తరువాత ఇజ్రాయెల్ చేరుకున్న ఆయన, హమాస్ చెర నుంచి విడుదల అవుతున్న బందీల పురోగతిని పర్యవేక్షించబోతున్నారు.

గాజా కాల్పుల విరమణను ఎనిమిదో యుద్దం పరిష్కరించినట్లు ట్రంప్ ప్రచారం చేసుకున్నారు. పశ్చిమాసియాకు ఎయిర్ ఫోర్స్ విమానంలో వెళ్తూ ఆయన విలేకరులతో మాట్లాడారు. 
సుంకాల బెదిరింపులు భారత్- పాకిస్తాన్ మధ్య యుద్దాన్ని నివారించడానికి సహాయపడ్డాయనే తన దీర్ఘకాల వాదనను ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. తన దౌత్యం ఎటువంటి అవార్డులను గెలుచుకోవడం కోసం కాదని కేవలం ప్రాణాలను కాపాడుకోవటమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన నొక్కి చెప్పారు.
గాజా యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణను తన అధ్యక్ష పదవిలో పరిష్కరించబడిన ఎనిమిదో యుద్ధంగా చెప్పుకున్నారు.
కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించిన తరువాత తొలిసారిగా ఇజ్రాయెల్, ఈజిప్టులకు తన పర్యటనలు జరుగుతాయని, కాల్పుల విరమణకు బలోపేతం చేయడం, గాజాలో పున: నిర్మాణానికి మద్దతు ఇవ్వడం ప్రాంతీయ శాంతి బలోపేతం చేయడం తన లక్ష్యమని చెప్పారు.
పాకిస్తాన్- ఆఫ్ఘన్ ఘర్షణ నివారణ
వివాదాలను పరిష్కరించడంలో తన రికార్డ్ గురించి గొప్పగా చెప్పుకుంటూ, తన పాలనలో ఎన్నో యుద్దాలను నివారించానని ట్రంప్ మరోసారి టముకు వేసుకున్నారు.
‘‘ఇది నేను పరిష్కరించిన ఎనిమిదో యుద్ధం అవుతుంది’’ అతని ట్రంప్ చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్- ఆఫ్ఘన్ మధ్య యుద్దం జరుగుతుందని నేను విన్నాను. నేను తిరిగి వచ్చే వరకూ వేచి ఉండాలి. నేను మరొకటి చేస్తున్నాను. ఎందుకంటే నేను యుద్ధాలను పరిష్కరించడంలో మంచివాడిని’’ అని చెప్పుకున్నారు.
పాక్- ఆప్ఘన్ మధ్య ప్రస్తుతం యుద్ధం తీవ్రరూపం దాల్చింది. రాత్రిపూట రెండు వర్గాలు అక్కడ భారీ పోరాటాలు జరుపుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాబూల్ లోని పాకిస్తాన్ వైమానిక దాడుల తరువాత తాలిబన్ దళాలు ప్రతీకారం తీర్చుకున్నట్లు సమాచారం, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ మీడియా ప్రకారం.. ఎదురుదాడులలో 58 మంది పాక్ సైనికులు మరణించారని ఆప్ఘన్ అధికారుల మాటలను ఉటంకిస్తూ వార్తలు ప్రసారం చేశాయి.
పాకిస్తాన్ సైన్యం మాత్రం 23 మంది మరణించినట్లు పేర్కొంది. అయితే సరిహద్దు వెంబడి ఉన్న 19 ఆప్ఘన్ పోస్టులను తాము స్వాధీనం చేసుకున్నట్లు పాక్ అధికారులు ప్రకటించారు. పశ్చిమాసియా పర్యటన తరువాత ట్రంప్ ఈ వివాదంపై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారత్ - పాక్ వివాదంపై మరోసారి..
భారత్- పాక్ మధ్య జరిగిన వివాదం తన వల్లే ముగిసిందని ట్రంప్ తనకు క్రెడిట్ ఇచ్చుకున్నారు. ఇందుకోసం వాణిజ్య సుంకాలను ఉపయోగించుకున్నట్లు ప్రకటించారు.
ఏళ్ల తరబడి జరుగుతున్న వివాదాలను పరిష్కరించడానికి తాను ఒక్కరోజులోనే పరిష్కరించినట్లు చెప్పారు. తన శాంతి కార్యక్రమాల వల్ల లక్షలాది మంది ప్రజల ప్రాణాలు రక్షించబడ్డాయని పేర్కొన్నారు. తాను చేసిన అనేక ప్రయత్నాలు నోబెల్ కోసం చేయలేదని పేర్కొన్నారు.
‘‘భారత్, పాకిస్తాన్ మధ్య మీరు యుద్ధం చేయాలనుకుంటే, మీ వద్ద అణ్వాయుధాలు ఉంటే నేను మీ ఇద్దరిపైనా వంద శాతం, 150 శాతం, 200 శాతం సుంకాలు వేస్తానని చెప్పాను. నేను సుంకాలు విధిస్తున్నానని చెప్పాను. నేను ఆ విషయాన్ని 24 గంటలలో పరిష్కరించాను. నేను సుంకాలు విధించలేకపోతే మీరు యుద్ధాన్ని ఎప్పటికీ పరిష్కరించలేరు’’ అని ట్రంప్ చెప్పుకున్నారు.
Tags:    

Similar News