రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్..
అక్టోబర్ 6న మొదలై 13 వరకు నోబెల్ పురస్కారాలను ప్రకటించనున్న రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్
రసాయన శాస్త్రం(Chemistry)లో విశేషంగా కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్(Nobel) పురస్కారం దక్కింది. మెటల్-ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ అభివృద్ధికి కృషి చేసిన సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలకు ఈ అత్యుత్తమ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. వీరు కొత్తరకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.
అక్టోబర్ 6న మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన అక్టోబర్ 13 వరకు కొనసాగనుంది.
సోమవారం(అక్టోబర్ 6న) మెడిసిన్‌లో విశేష కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు - మేరీ ఇ. బ్రంకో(అమెరికా-సీటెల్), ఫ్రెడ్ రామ్స్‌డెల్(శాన్ ఫ్రాన్సిస్కో), షిమోన్ సకాగుచి(జపాన్) నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. బ్రంకో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ బయాలజీ విభాగంలో పని చేస్తుండగా, రామ్స్‌డెల్ సోనోమా బయోథెరప్యూటిక్స్ విభాగంలో పని చేస్తున్నారు. సకాగుచి జపాన్‌లోని ఒసాకా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. రోగనిరోధక వ్యవస్థ ఎలా నియంత్రించబడుతుందో
భౌతికశాస్త్రంలో ముగ్గురికి..
ఫిజిక్స్‌లో విశేషంగా కృషి చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా అక్టోబర్ 7న నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జాన్ క్లార్క్, మైఖేల్ డెవోరెట్, జాన్ ఎం.మార్టినిస్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్‌లో పరిశోధనలు చేశారు.
అక్టోబర్ 9న సాహిత్యం, 10వ తేదీ శాంతి, అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో విశేష కృషిచేసిన వారికి అవార్డులను ప్రకటిస్తారు. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున (డిసెంబర్ 10న) విజేతలకు ఈ అవార్డులను అందజేస్తారు. అవార్డు గ్రహీతలు 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్ (సుమారు ₹1.03 కోట్లు) నగదు అందుకోనున్నారు.