ట్రంప్‌ను గెలిపిద్దామంటూ ఎలాన్‌ మస్క్‌ డాన్స్

‘అమెరికాలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే.. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించుకోవాలంటూ వేదికపై ఎలాన్‌ మస్క్‌ డ్యాన్స్ చేశారు.

Update: 2024-10-06 07:41 GMT

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ సిటీలో తిరిగి ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. అమెరికా అధ్యక్ష పదవీ కోసం పోటీపడుతున్న ఈయన గత జులైలో ఇక్కడే ఎన్నికల సభ నిర్వహించారు. ప్రసంగిస్తుండగా థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తయిన అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ట్రంప్‌ను కాపాడారు.

ట్రంప్‌తో జతకట్టిన ఎలాన్‌ మస్క్‌

రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌కు ప్రపంచ కుబేరుడు, టెస్లా యజమాని ఎలాన్‌ మస్క్‌ మద్దతు ప్రకటించారు. ట్రంప్‌తో పాటు వేదికను పంచుకుని ఓటర్లనుద్దేశించి ప్రసంగించారు. పూర్తిగా నలుపు రంగు దుస్తులు ధరించి కస్టమ్ MAGA ('మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్' - ట్రంప్ ఎన్నికల లైన్) టోపీని పెట్టుకుని, ట్రంప్‌కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ‘అమెరికాలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే.. నవంబర్ 5న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను గెలిపించుకోవాలంటూ వేదికపై డ్యాన్స్ చేశారు.

హారిస్‌పై విరుచుకుపడ్డ ట్రంప్..

అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమొక్రట్స్ అభ్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్ మాటల తూటాలు పేల్చారు. సరిహద్దు భద్రత, ఆర్థిక వ్యవస్థను చక్కపెట్టడంతో పాటు పలు రంగాల్లో ఆమె విఫలమయ్యారని ఆరోపించారు. "కమలా హారిస్ రాడికల్-లెఫ్ట్ మార్క్సిస్ట్. ఆమె కాంగ్రెస్‌లో గౌరవం లేదు. ఆమెను చూసి కాంగ్రెస్‌ నవ్వుతోంది. ఆమె గెలుస్తుందని ఎవరూ భావించడం లేదు. సరిహద్దు భద్రత, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో హారిస్ విఫలమయ్యారు.’’ అని ఆరోపించారు.

Tags:    

Similar News