అబ్బే.. అమెరికాకు సంబంధం లేదు: హసీనా కుమారుడు
బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగడానికి, తను పారిపోవడానికి అమెరికా కుట్రలు కారణం అని షేక్ హసీనా అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఆమె కుమారుడు వాజెద్ ఖండించారు
By : The Federal
Update: 2024-08-12 10:45 GMT
అమెరికా కుట్రల వల్లే బంగ్లాదేశ్ లో తన అధికారం పోయిందని షేక్ హసీనా వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమం, అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తను అధికారంలోకి రాగానే బంగాళఖాతంలోని సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని తమ వైమానిక దళ స్థావరంగా మార్చడానికి అమెరికా తనను సంప్రదించిందని.. ఈ ప్రతిపాదనను తాను వ్యతిరేకించినందునే దేశంలో అల్లర్లు చెలరేగించారని హసీనా వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని ఆమె కుమారుడు ఖండించారు.
ప్రస్తుతం హసీనా భారత్ దేశంలో ఆశ్రయం పొందుతుందని, అక్కడ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. సజీబ్ వాజెద్ ఢాకాలో మాట్లాడుతూ.. దేశంలో అల్లర్లు పాల్పడటానికి, దేశం నుంచి హసీనా పారిపోవడానికి ముందు.. తరువాత.. కానీ ఎటువంటి మీడియా ప్రకటన జారీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘ సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని వాషింగ్టన్‌కు ఇచ్చి ఉంటేనే తాను అధికారంలో ఉండేదానిని అని హసీనా పేర్కొన్నట్లు’’ ఆదివారం భారత మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
బంగ్లాదేశ్ ద్వీపం
బంగాళాఖాతంలో ఉన్న ఈ ద్వీపం బంగ్లాదేశ్‌కు దక్షిణంగా ఉంది. సైనిక ప్రయోజనాల కోసం అమెరికా ఈ మారుమూల ద్వీపంపై కన్నేసింది. ఒక భారతీయ వార్తాపత్రిక హసీనా ఢాకా నుంచి బయలుదేరడానికి ముందు ఆమె ప్రసంగంలో యుఎస్‌పై ఆరోపణలు చేసిందని, ఆర్మీ తమకు కేవలం 45 నిమిషాల సమయం ఇవ్వడంతో ప్రసంగం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఆ ప్రసంగం కాపీ తమకు దొరికిందని మీడియా తెలిపింది.
"ఒక వార్తాపత్రికలో ప్రచురించబడిన నా తల్లికి ఆపాదించబడిన ఇటీవలి రాజీనామా ప్రకటన పూర్తిగా అబద్ధం, కల్పితం" అని Wazed X లో రాశాడు. "ఢాకా నుంచి బయలుదేరే ముందు లేదా తర్వాత ఆమె ఎటువంటి ప్రకటన చేయలేదని నేను ఆమెతో ధృవీకరించాను."
రక్తపాతాన్నినివారించడానికేనా?
హసీనా, 76, ఆమె ప్రభుత్వం ప్రతిపాదించిన వివాదాస్పద కోటా వ్యవస్థపై దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో రాజీనామా చేసి ఢాకా నుంచి పారిపోయి భారతదేశానికి వచ్చారు. ప్రస్తుతం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. బంగ్లాదేశ్‌లో మరిన్ని హత్యలు జరగకుండా ఉండేందుకు తన పదవికి రాజీనామా చేసినట్లు హసీనా ప్రచురించిన ప్రకటనలో పేర్కొంది.
The recent resignation statement attributed to my mother published in a newspaper is completely false and fabricated. I have just confirmed with her that she did not make any statement either before or since leaving Dhaka
— Sajeeb Wazed (@sajeebwazed) August 11, 2024