China | దడ పుట్టిస్తున్న HMPV కేసులు

‘‘ప్రారంభ దశలోనే గుర్తించడం, పర్యవేక్షణ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం’’- డాక్టర్ అర్జున్ డాంగ్;

Update: 2025-01-03 11:25 GMT

కోవిడ్ తరహా కేసులు చైనాలో మళ్లీ నమోదవుతున్నాయి. హ్యూమన్ మెటాప్‌ న్యూమో వైరస్ (HMPV) వ్యాప్తి కారణంగా అక్కడి ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితులను పరిశీలిస్తున్నామని, అవసరమైన సమాచారం అవసరమైన సమయానికి అప్డేట్ చేస్తామని పేర్కొంది.

HMPV వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్ డాంగ్స్ ల్యాబ్ CEO డాక్టర్ అర్జున్ డాంగ్ ఇలా అన్నారు. ‘‘ప్రారంభ దశలోనే గుర్తించడం, పర్యవేక్షణ,’’ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమని పేర్కొన్నారు.

HMPV లక్షణాలు

ఇతర శ్వాసకోశ ఇబ్బందులు కలిగించే వైరస్‌లు చూపే లక్షణాలే HMPV చూపుతుందన్నారు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందన్నారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నపుడు బ్రోంకియోలిటిస్ లేదా న్యుమోనియా రావచ్చని తెలిపారు.

చికిత్స..

HMPV నిర్ధారణకు పోలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్ష చేయించుకోవాలి. దీని నివారణకు ప్రత్యేక యాంటీవైరల్ చికిత్స అందుబాటులో లేదు. కాబట్టి వ్యాధి వ్యాప్తిని నిరోధించడం ఉత్తమ మార్గం. చేతులు క్రమం తప్పకుండా కడుక్కోవడం, దగ్గినప్పుడు నోటికి గుడ్డ అడ్డుపెట్టుకోవడం, అనారోగ్యంగా ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండటం వల్ల వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు. తీవ్రమైన కేసుల్లో బాగా నీరసం, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టాలని డాక్టర్ డాంగ్ సూచించారు.

Tags:    

Similar News