రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేస్తున్న భారత్

అమెరికా నుంచి సైతం ఇదే తరహ వ్యాపారం, పశ్చిమాసియాతో స్థిరంగా వాణిజ్యం నెెరపుతున్న న్యూఢిల్లీ;

Update: 2025-07-13 12:04 GMT

రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ 11 నెలల గరిష్టానికి చేరిందని విశ్లేషకులు తెలిపారు. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్దం జరగడంతో భారత్ తన చమురు అవసరాల కోసం క్రిమ్లిన్ పై ఎక్కువగా ఆధారపడుతోంది.

గ్లోబల్ కమోడిటీ మార్కెట్ అనలిటిక్స్ సంస్థ క్ప్లర్ నుంచి వచ్చిన వెసెల్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. జూన్ లో భారత్ రోజుకు 2.08 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడిచమురును దిగుమతి చేసుకుంది. ఇది 2024 జూలై తరువాత అత్యధికం.
‘‘జూన్ లో భారత్ దిగుమతి చేసుకుని ముడి చమురు దిగుమతులు ఆరు శాతం తగ్గగా, రష్యన్ నుంచి నెలవారీగా 8 శాతం పెరిగి జూలై 2024 తరువాత అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.’’ అతని యూరోపియన్ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ తెలిపింది.
రష్యా నుంచి వచ్చే దిగుమతుల్లో సగానికి పైగా భారత్ లోని మూడు శుద్ది కర్మాగారాల ద్వారా జరిగాయి. ఇవి శుద్ది చేసిన ఉత్పత్తులను జీ7+ దేశాలకు కూడా ఎగుమతి చేస్తాయి’’ అని వెల్లడించింది.
భారత్ తన ముడి చమురు అవసరాలలో 85 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. దీనిని శుద్ది కర్మాగారాల్లో పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలుగా మారుస్తారు. సాంప్రదాయకంగా పశ్చిమాసియా ప్రధాన వనరుగా ఉండేది. కానీ రష్యా దాదాపు మూడు సంవత్సరాలుగా ప్రధాన సరఫరదారుగా ఉంది.
ఫిబ్రవరి 2022 లో రష్యా, ఉక్రెయిన్ పై దాడి చేసిన తరువాత పశ్చిమ దేశాలు చాలా వరకూ రష్యన్ ముడి చమురును తిరస్కరించిన తరువాత ప్రత్యామ్నాయం కొనుగోలుదారులను ఆకర్షించడానికి రష్యా భారీ డిస్కాంట్లను అందించడం ప్రారంభించింది.
భారతీయ చమురు శుద్ది కర్మాగారాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒకప్పుడూ స్వల్ఫదారుడిగా ఉన్న రష్యాను భారత్ దేశపు అతిపెద్ద ముడి చమురు వనరుగా మార్చాయి. పశ్చిమాసియా నుంచి సాంప్రదాయా సరఫరాదారులను అధిగమించాయి. ఇప్పుడు భారత్ చమురు దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం వాటాను ఆక్రమించింది.
భారత్ రెండో అతిపెద్ద సరఫరాదారు అయిన ఇరాక్ నుంచి సుమారు 8,93,000 బ్యారెల్ల ముడిచమురును దిగుమతి చేసుకునేది. ఇది ప్రతినెలలో 17.2 తగ్గుదలను సూచిస్తోంది. సౌదీ అరేబియా నుంచి 5,81,000 గా ఉంది. యూఏఈ నుంచి దిగుమతులు 6.5 శాతం పెరిగి 4,90,000 కి చేరుకున్నాయి.
చమురు దిగుమతుల్లో ఇరాక్ వాటా 18.5 శాతం, సౌదీ అరేబియా 12.1 శాతం, యూఏఈ 10.2 శాతం వాటాగా ఉంది. కెప్లర్ ప్రకారం.. అమెరికా, భారత్ కు ఐదో అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా కొనసాగుతోంది.
జూన్ లో రష్యా నుంచి ముడి చమురు ఎగుమతుల్లో చైనా 47 శాతం కొనుగోలు చేసిందని, తరువాత భారత్ వాటా 38 శాతం, ఈయూ 6 శాతం, తుర్కియే 6 శాతం కొనుగోలు చేశాయని సీఆర్ఈఏ తెలిపింది.
ఎస్ అండ్ పీ గ్లోబల్ కమోడీటిస్ ఎట్ సీ డేటా ప్రకారం.. భారత్ ఈ సంవత్సరం మొదటి అర్థభాగంలో యూఎస్ నుంచి 2,71,000 బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. 2024 కాలంలో 1,80,000 బ్యారెళ్లుగా ఉండేది. శాతాలలో చెప్పాలంటే ఇది 51 శాతం ఎక్కువ. 
Tags:    

Similar News