ఇండియన్ ఫ్లైట్‌లో వద్దన్న మాల్దీవుల అధ్యక్షుడు - చివరకు బాలుడు

బాలుడిని మెరుగైన వైద్యం కోసం ఇండియన్ డోర్నియర్ విమానంలో తరలించేందుకు మాల్దీవుల అధ్యక్షుడు ఎందుకు నిరాకరించారు. పిల్లాడిని వైద్యుల కాపాడగలిగారా?

Update: 2024-01-21 09:05 GMT

మాల్దీవులకు చెందిన 14 ఏళ్ల బాలుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ శనివారం (జనవరి 20) మరణించాడు. అయితే మాల్లీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు వైఖరి వల్లే తమ కొడుకు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మాల్దీవులలోని గాఫ్ అలీఫ్ విల్లింగిలిలో నివాసం ఉంటున్న బాలుడు బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నాడు. ‘‘ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మా కొడుకును మాలేకి తీసుకెళ్లాలనుకున్నాం. బుధవారం (జనవరి 17) ఐలాండ్ ఏవియేషన్‌ అధికారులకు కాల్ చేశాం. కానీ వారు స్పందించలేదు. గురువారం ఉదయం 8:30 గంటలకు వారు ఫోన్‌ను తీశారు. మేం ఫోన్ చేసిన 16 గంటల తర్వాత మా అబ్బాయిని మాలేకు తరలించారు. కాని మా కొడుకు మాకు దక్కలేదు. ’’ అని బాలుడు తండ్రి చెప్పాడు.

మాల్‌కు చేరుకున్న బాలుడిని వెంటనే వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసియు)లో తరలించారు. కాని అప్పటికే బాలుడి ఆరోగ్యం క్షీణించింది. వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. శనివారం బాలుడు మృతి చెందాడు.

భారతదేశం తయారు చేసిన డోర్నియర్ విమానాలను మాల్దీవులలో అత్యవసర ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఇందులో బాలుడిని మాలికి తరలించే ఉంటే ప్రాణాపాయం ఉండేది కాదు.

సంతాపం తెలిపిన ఆసంధ కంపెనీ..

తమకు సమాచారం అందిన వెంటనే బాలుడిని మాలికి తరలించాలని సిద్ధం అయ్యామని, అయితే సాంకేతిక సమస్య కారణంగా తరలింపు ఆలస్యమైందని అత్యవసర పరిస్థితుల్లో వైద్య సాయం అందించే ఆసంధ కంపెనీ లిమిటెడ్ పేర్కొంది. ‘‘బాలుడి మృతికి చింతిస్తున్నాం. బాలుడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం’’ అని ఒక ప్రకటన విడుదల చేసింది.

బాలుడి మృతితో ఆసుపత్రి వెలుపల నిరసనలు వెల్లువెత్తాయి. భారతదేశం పట్ల తనకున్న అయిష్టతను వ్యక్తం చేసేందుకు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారని మాల్దీవుల ఎంపీ మీకైల్ నసీమ్ ఆరోపించారు.

మాల్దీవులతో మనకేంటి వివాదం..

ప్రధాని మోదీ మాల్దీవుల పర్యటన నేపథ్యంలో అక్కడి మంత్రులు ఆయన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలకు నిరసగా భారతీయులు మాల్దీవుల పర్యటన రద్దు చేసుకున్నారు. ఆ దేశంలో ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో ముగ్గురు మంత్రులను(మాల్షా షరీఫ్‌, ‌మరియం, అబ్దుల్లా మజిద్‌) ‌మంత్రివర్గం నుంచి తొలగించారు మాల్దీవుల దేశాధ్యక్షుడు మహ్మద్‌ ‌రెయిజు. ఈ వార్తను ధృవీకరిస్తూ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి.

ఇండియన్‌ ‌సెలబ్రీటిస్‌ ‌కూడా ..

మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై ఇండియన్‌ ‌సెలబ్రీటీస్‌ ‌కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియాను అవమానించిన మాల్దీవులకు వెళ్లడం మాని, ఇండియన్‌ ‌టూరిజాన్ని ప్రోత్సహిద్దామని సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెట్టారు. ప్రముఖ బాలీవుడ్‌ ‌నటుడు సల్మాన్‌ ‌ఖాన్‌, అక్షయ్‌కుమార్‌, ‌మాస్టర్‌ ‌బ్లాస్టర్‌ ‌సచిన్‌ ‌టెండూల్కర్‌ ‌ప్రముఖులు మన దేశంలో ఉన్న ఎన్నో పర్యాటక ప్రాంతాలను చూడాలని కోరారు. 

Tags:    

Similar News