‘బంగ్లా‘ మొత్తం కర్ప్యూ విధించిన షేక్ హసీనా సర్కార్, ఎందుకు?

బంగ్లాదేశ్ లో ప్రారంభమైన రిజర్వేషన్ ఉద్యమం రోజురోజుకీ తీవ్రమవుతోంది. నిరసనకారులతో మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధం అని ప్రకటించింది కానీ..

Update: 2024-07-20 07:04 GMT

బంగ్లాదేశ్ లో ప్రారంభమైన రిజర్వేషన్ ఉద్యమం తీవ్ర హింసారూపం తీసుకుంది. రిజర్వేషన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన వివాదంలో ఘర్షణలు చెలరేగడంతో దాదాపు వందమందకి పైగా విద్యార్థులు మరణించారు. దీంతో షేక్ హసీనా సర్కార్ దేశ వ్యాప్తంగా కర్ఫ్యూను అమలు చేసింది. దేశ వ్యాప్తంగా సైనిక బలగాలను మోహరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

అధికార అవామీ లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్ ఈ ప్రకటన చేశారు. పోలీసులు, భద్రతా అధికారులు శుక్రవారం నిరసనకారులపై కాల్పులు జరిపారు. రాజధానిలో అన్ని సమావేశాలను నిషేధించిన తర్వాత కూడా కొంతమంది ఆందోళనలకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు మీడియా కథనాలు తెలిపాయి. పరిపాలనలో అవాంతరం తగ్గించడానికి మిలిటరిని మోహరించినట్లు క్వాడర్ చెప్పారు. బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న విదేశీ పర్యాటకలు త్రిపుర రాజధాని అగర్తలో గల ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అఖౌరా ద్వారా భారత దేశానికి రావడం ప్రారంభించారు.
హింస తీవ్రమవుతోంది
ఉద్యోగాలలో మెరుగైన రిజర్వేషన్ విధానం ఉండాలని రాజధాని లోని విశ్వవిద్యాలయంలో ఈ హింస ప్రారంభం అయింది. విద్యార్థి నాయకులు కొంతమంది నార్సింగి జిల్లాలోని జైలు పై దాడి చేసి అక్కడ ఉన్న ఖైదీలను విడుదల చేసి అనంతరం జైలుకు నిప్పుపెట్టారు. దేశం మొత్తం పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో రాజధాని ఢాకా, సహ ఇతర ప్రాంతాలలో మెట్రోపాలిటన్ పోలీసులు (DMP) అన్ని ర్యాలీలు, ఊరేగింపులను నిషేధించారు.
హసీనా అవామీ లీగ్ యువజన విభాగం అయిన బంగ్లాదేశ్ ఛత్ర లీగ్ (BSL)ని మినహాయించి విద్యార్థి సంఘాల కూటమి అయిన స్టూడెంట్స్ ఎగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. గత నెలలో, బంగ్లాదేశ్ హైకోర్టు 1971 లిబరేషన్ వార్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించి రిజర్వేషన్లను పునరుద్దరించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభమైంది. ఆ దేశ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంతో ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 64 మంది చనిపోయారు.
స్వదేశానికి భారతీయులు..
బంగ్లాదేశ్ దేశ వ్యాప్తంగా నిరసనలు విస్తరించడంతో ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను మూసివేసింది. దీంతో అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు వెనువెంటనే భారత దేశానికి తిరిగి వస్తున్నారు.
మేఘాలయా రాష్ట్రానికి చెందిన 63 మంది విద్యార్థులు బంగ్లాదేశ్ నుంచి క్షేమంగా తిరిగి వచ్చారని, అక్కడి నుంచి మరింత మంది విద్యార్థులను సురక్షితంగా తరలించేందుకు బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా తెలిపారు.
విదేశాల్లో చదువుతున్న మేఘాలయ విద్యార్థులు తమను తాము నమోదు చేసుకునేందుకు వీలుగా పోర్టల్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని సంగ్మా పేర్కొన్నారు. "ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, మేము వారిని సంప్రదించగలము. మా వద్ద సమాచారం ఉన్నందున వారికి సాయం చేయగలము" అని అతను చెప్పాడు.
శాంతి చర్చలు
బంగ్లాదేశ్ న్యాయ మంత్రి అనిసుల్ హుక్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరసనకారులతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉందని, ప్రదర్శనకారులు తాము కూడా ఈ ప్రతిపాదనను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు వెల్లడించారు. నిరసనకారుల సమన్వయకర్త నహిద్ ఇస్లాం మాట్లాడుతూ.. చర్చలు, కాల్పులు ఏకకాలంలో జరగవని చెప్పారు. చర్చలు జరపడానికి సహచర విద్యార్థుల మృతదేహాలను దాటి రాలేమని వివరించారు.
నిరసనల నేపథ్యంలో దేశంలో మొబైల్ ఇంటర్నెట్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు హక్ తెలిపారు.
“ఈ విషయం బంగ్లాదేశ్‌లో తీవ్రమైంది. విద్యార్థులంతా నిరసనకు దిగారు. కోటా విధానాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. చాలా త్వరగా సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాను. మా డిమాండ్‌ను అంగీకరించాలి. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు, మేము వారితో ఉన్నాము. వారికి సరైన నష్టపరిహారం పొందాలి, ”అని బంగ్లాదేశ్‌కు చెందిన అనిక్ పాల్ అనే విద్యార్థి ANI కి చెప్పాడు
Tags:    

Similar News