ప్రమాణస్వీకారానికి చైనా అధ్యక్షుడిని ఆహ్వానించిన ట్రంప్

మిత్రులు, శత్రువులు, పోటీదారులతో చర్చలకు సిద్ధమని సంకేతాలు

Update: 2024-12-13 06:05 GMT

అమెరికా కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను జనవరి 20న నిర్వహించబోయే ప్రమాణ స్వీకారానికి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ఆహ్వనించాలని నిర్ణయించినట్లు ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేకంగా సందేశం పంపినట్లు వివరించారు.

"అధ్యక్షుడు ట్రంప్ మా మిత్రదేశాలే కాకుండా మా శత్రువులు,  పోటీదారులతో కూడా బహిరంగంగా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు" అని ఇన్కమింగ్ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ గురువారం ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ట్రంప్ ఇలాంటివి చేయడం ఇదే మొదటి సారి కాదని, తాను మొదటిసారిగా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ శత్రువుల తోనూ చర్చలు జరిపేందుకు ప్రయత్నించాడు. కానీ అవన్నీ కూడా విమర్శలకు దారితీసినట్లు ఆమె చెప్పారు. ట్రంప్ ఎప్పూడు ప్రపంచ శాంతికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడని అన్నారు. ‘‘ అతను ఎవరితోనైనా మాట్లాడటానికి సిద్ధంగా ఉంటాడు. అతను ఎప్పుడూ అమెరికా ఆసక్తికి మొదటి స్థానం ఇస్తాడు," ఆమె పేర్కొన్నారు.
డెమోక్రాటిక్ పార్టీ..
"ఆ ప్రారంభోత్సవంలో తనతో పాటు ఎవరు కూర్చోవాలి, ఎవరు అక్కడ ఉండబోతున్నారు అనేది అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ నిర్ణయించుకోవాలి" అని వైట్ హౌస్ అధికారి జాన్ కిర్బీ విలేకరులతో అన్నారు. " ద్వైపాక్షిక సంబంధాలను పెంచడం కోసం చాలా కష్టపడి పనిచేశాము. అధ్యక్షుడు బైడెన్, జిన్‌పింగ్‌ను ఇటీవలే అనేకసార్లు కలిశారు. మీరు అనేక విషయాలను మార్చడానికి సిద్ధంగా ఉన్నారని, చైనాతో మీకంటే ఎక్కువగా మా ప్రభుత్వంలోనే సత్సంబంధాలు ఉన్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.  అయితే మాకు కూడా చైనా తో కొన్ని విబేధాలు ఉన్నట్లు కూడా కిర్భీ అంగీకరించారు.
"మేము చేస్తాం, వారు కూడా చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, కానీ మేము ఈ సంబంధంపై తీవ్రంగా కృషి చేస్తున్నాము. చేయాల్సిన పనిని చివరి వరకు చేస్తాము" అని కిర్బీ చెప్పారు.
చైనా నుంచి..
అమెరికా అధ్యక్ష ప్రమాణ స్వీకారం అందినట్లు గానీ, చైనా వస్తున్నట్లు గా ఎలాంటి ప్రకటన కమ్యూనిస్టు దేశం నుంచి రాలేదు. అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నిక కాగానే ట్రంప్ కెనడా, మెక్సికో తో పాటు చైనాపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోకి అక్రమంగా డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నది చైనా నే అని ట్రంప్ అన్నారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరిగితే ఇరు దేశాలు నష్టపోతాయని బీజింగ్ వ్యాఖ్యానించింది. రీసెంట్ గా తైవాన్ విషయంలో కూడా చైనా దూకుడుగా వ్యవహరించింది. ఇంతవరకూ కనివినీ ఎరగని రీతిలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. దీనిపై ట్రంప్ వైఖరిపై ఎలా ఉండబోతుందో అని కూడా చైనా వేచి చూస్తోంది.


Tags:    

Similar News