క్లాసులకు డుమ్మా కొడితే వీసా రద్దు..

భారతీయ విద్యార్థులకు అమెరికా వార్నింగ్..;

Update: 2025-05-27 11:08 GMT
Click the Play button to listen to article

అక్రమ వలసదారుల పట్ల అమెరికా(America) ఎంత కఠినంగా ఉందో మనం చూశాం. నిబంధనలకు విరుద్ధంగా అగ్రరాజ్యంలో ఉంటున్న భారతీయుల చేతులకు బేడీలు వేసి సైనిక విమానంలో భారత్‌కు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు విద్యార్థుల విషయంలో అంతే కఠినంగా వ్యవహరించబోతుంది. క్లాసులకు సరిగా హాజరుకాకపోయినా, సమాచారం ఇవ్వకుండా చదువు మానేసిన వీసా(Visa) రద్దు చేస్తామని ట్రంప్ ప్రభుత్వం  ప్రకటించింది. అమెరికాలోకి వెళ్లి చదువుకునే భారతీయ విద్యార్థుల(Indian student) సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీసా రూల్స్ తప్పకసరిగా పాటించాలని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది.

2025 మార్చి చివరి నుంచి మొత్తం 187 కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లోని కనీసం 1,222 విద్యార్థుల వీసాలు రద్దు చేశారు.

2023-24 విద్యా సంవత్సరంలో అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3,31,602. అదే 2022-23 విద్యా సంవత్సరంలో 2,68,923గా ఉంది.

అంటే 23 శాతం విద్యార్థులు పెరిగారు. 2022-23లో USలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తరువాత స్థానంలో ఇండియా నిలిచింది. 

Tags:    

Similar News