రాణా విషయంలో కీలకంగా వ్యవహరించిన అంశం ఏంటంటే?
సుప్రీంకోర్టు పిటిషన్ ను మరోసారి డిస్మిస్ చేస్తే భారత్ తీసుకురానున్న ఎన్ఐఏ;
By : The Federal
Update: 2025-03-09 06:58 GMT
రాజేశ్ అహుజా
ముంబై పై ఉగ్రవాద దాడిలో కీలక సూత్రధారి అయిన తహవ్వూర్ రాణా అప్పగింతపై అమెరికా కోర్టులో జరుగుతున్న న్యాయ విచారణ చివరి దశకు చేరుకుంది.
ఈ లీగల్ డిబెట్ లో రెండు అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది. అందులో ‘ఎలిమేట్స్’, ‘కండక్ట్’ అనే పదాలు అమెరికా కోర్టులో కీలకపాత్ర పోషిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి.
భారత్ కు అప్పగించే ప్రక్రియ చివరి దశకు చేరుకున్న క్రమంలో రాణా మరోసారి సుప్రీంకోర్టు జడ్జి అయిన జస్టిస్ ఎలీనా కగన్ కు పిటిషన్ పెట్టుకున్నాడు. అయితే దీనిపై స్టే ఇవ్వడానికి న్యాయమూర్తి నిరాకరించారు.
తరువాత రాణా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా ఈ పిటిషన్ ను తిరస్కరిస్తే ఇక ఇండియాకు అప్పగించడానికి మార్గం సుగమం అవుతుంది.
ఒకే నేరానికి రెండు సార్లు శిక్ష విధించడం..
ఒక నేరానికి సంబంధించి ఒక వ్యక్తికి రెండుసార్లు శిక్ష విధించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దం. వీటికి యూఎస్ దిగువ న్యాయ స్థానాలు క్లిష్టంగా మార్చే అవకాశం ఉంది. దీనిని డబుల్ జియోపార్టీగా గా పిలుస్తారు. రాణాను తీసుకురావడం అనేది నేరస్తుల అప్పగింత విషయంలో అంతర్జాతీయ చట్టాలలో ఉన్న సంక్లిష్టత ను తెలియజేస్తుంది.
ఉగ్రవాద దాడి జరిగిన తరువాత 2009 లో రాణాను యూఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో డేవిడ్ కోల్మన్ హ్యడ్లీ అలియాస్ దావూద్ గిలానీ ఎఫ్బీఐ అదుపులోకి తీసుకుంది.
ఇందులో ఉగ్రవాదానికి సంబంధించిన మెటీరియల్ సరఫరా, డెన్మార్క్ లో న్యూస్ పేపర్ ఆఫీస్ పై దాడి చేయడం, లష్కర్ ఏ తోయిబా కు సాయపడటం వంటి అభియోగాలు వీరిపై మోపారు.
ఎఫ్బీఐ ఆరోపించిన మూడు అంశాలలో ముంబై దాడుల అంశాన్ని నిరూపించడంలో విఫలం కావడంతో రాణాను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. కానీ డెన్మార్క్, లష్కర్ ఏ తోయిబాకు సాయపడటం విషయంలో మాత్రం దోషిగా తేల్చింది. అయితే తాను నిర్దోషిగా తేలాలని ముంబై దాడులకు సంబంధించి భారత్ కు అప్పగించవద్దని కోరారు.
చట్టపరమైన ప్రశ్న..
అమెరికాలో ఏ నేరం చేసిన డబుల్ జియోపార్టీ నిబంధనలు అమలు చేస్తారు. రెండు దేశాలలో నేరాలను వివరించడానికి నేరం అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని కోర్టులు పున: నిర్వహించడానికి అవకాశం ఉంది. రాజ్యాంగాలు, చట్టాలు కూడా వీటిని నిర్వహించే అవకాశం ఉంది.
ఇప్పుడు యూఎస్ చట్టాల ప్రకారం రాణాపై ఏయే ఏయో అభియోగాలు ఉన్నాయో.. అలాంటివే భారత్ లో కూడా ఉంటే యూఎస్ రాణాను అప్పగించడానికి కోర్టులు అప్పగించరు.
యూఎస్ పై కోర్టులు ఈ అంశంపై అస్థిరంగా తీర్పు ఇచ్చాయి. దీనిని సర్క్యూట్ స్ప్లిట్స్ అని పిలుస్తారు. ఎలిమెంట్స్ టెస్ట్ ను ఉపయోగించడం వల్ల చట్ట అమలు అధికారులు నేరారోపణలను తారుమారు రాణాను రక్షించడానికి న్యాయవాదులు ప్రయత్నించేవారు. చికాగోలో అదే ఇలాంటి వాదనే వారు చేశారు. ఇది డబుల్ జియోపార్టీ ఉల్లంఘించడమే అని వారు పేర్కొన్నారు.
కోర్టు ఎందుకు అంగీకరించింది..
అయితే రాణా అప్పగింత విషయంలో అమెరికా ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా కోర్టులో వాదనలు వినిపించింది. నేరస్తుల అప్పగింత ఒప్పందంలో ప్రవర్తన, చట్టాల విషయంలో స్పష్టంగా నిర్వచించాయని కోర్టుకు విన్నవించింది. రెండు దేశాలలో అభియోగాలు ఒకే చట్టపరమైన అంశాలను పంచుకుంటేనే అప్పగిస్తారని వాదించింది.
భారత్ లో కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ కూడా రాణాపై అదనంగా మోసం, ఫోర్జరీ సహ అదనపు నేరాలను మోపింది. ముంబై దాడుల కోసం హెడ్లీ నిఘా చేయడానికి సాయం చేసి, తన ఇమ్మిగ్రేషన్ వ్యాపారం చేయడానికి అబద్దం చెప్పాడని ఆరోపించింది. అతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి తప్పుడు పత్రాలు కూడా సమర్పించడాని కూడా కేసు నమోదు అయింది. ఇవి యూఎస్ కోర్టులో నమోదు కాలేవు.
యూఎస్ న్యాయమూర్తి కూడా వీటిని అంగీకరించారు. అప్పగింత ఒప్పందం విషయంలో నేరం, కండక్ట్ మధ్య తేడా ఉంటుందని ఆయన తీర్పు చెప్పారు. భారత్ లో ఉన్న నేరాలు ఇంతకుముందు యూఎస్ లో విచారణ జరగలేనందున అమెరికా అప్పగించడానికి అనుమతి ఇస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అతని రెండో అభ్యర్థనను తిరస్కరిస్తే అతన్ని ఇండియాకు అప్పగిస్తారు. ఇక్కడ 2008 లో జరిగిన ఉగ్రవాద దాడిపై విచారణ చేస్తారు.