పాక్- బంగ్లా సైనిక సంబంధాలు భారత్ కు తీవ్రమైన హెచ్చరికనా?

ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించిన పాక్ ప్రేరేపిత సంస్థలు

Update: 2025-11-24 07:20 GMT
బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహమ్మద్ యూనస్, సైనిక జనరల్ వకార్ ఉజ్ జమాన్

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ పాలకుడు మహహ్మద్ యూనస్ సన్నిహితుడు, రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లూర్ రెహమాన్ ఈ మధ్య చేసిన ప్రకటన న్యూఢిల్లీలో కలవరం పుట్టించింది. పాకిస్తాన్ తో భారత్ యుద్ధం చేస్తే, బంగ్లాదేశ్ ఈశాన్య భారతాన్ని స్వాధీనం చేసుకోవడానికి సైనిక దాడి చేయాలని సూచించారు.

2009 లో బంగ్లాదేశ్ రైఫిల్స్(బీడీఆర్) జరిగిన తిరుగుబాటు పై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్ కు నాయకత్వం వహించడానికి యూనస్, రెహమాన్ కు బాధ్యతలు అప్పగించాడు.

ఈ తిరుగుబాటు సరిహద్దు గార్డు దళానికి నాయకత్వం వహించే అనేకమంది సైనిక అధికారుల ఊచకోతకు దారి తీసింది. 2001 లో బీడీఆర్ చీఫ్ గా ఉన్న రెహమాన్, మేఘాలయ బంగ్లాదేశ్ సరిహద్దులోని పిర్డివా వద్ద బీఎస్ఎఫ్ తో ఘర్షణలకు దిగాడు. తరువాత ఇతను పాక్ అనుకూల, మత ఛాందసవాద గ్రూపులో భాగమని తేలింది.

పాక్ తో పెరుగుతున్న సంబంధాలు..
ఈ గ్రూపు సలహ ప్రకారమే మహమ్మద్ యూనస్ పాకిస్తాన్ తో సైనిక సంబంధాలను బలోపేతం చేయడానికి పావులు కదుపుతున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో బంగ్లాదేశ్ సైనిక ప్రతినిధులు పాకిస్తాన్ లో పర్యటించారు.
అక్టోబర్, నవంబర్ లలో నాలుగు ఉన్నత స్థాయి పాకిస్తాన్ బృందాలు బంగ్లాదేశ్ లో పర్యటించాయి. అక్టోబర్ ఆరు నుంచి తొమ్మిదో తేదీ వరకూ పాకిస్తాన్ జాయింట్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ లెప్టినెంట్ జనరల్ తబస్సుమ్ హబీబ్ ఢాకాకు వచ్చారు.
నిఘా, భద్రతా సహకారం గురించి బంగ్లాదేశ్ సీనియర్ సైనిక, నిఘా అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశం తరువాత అక్టోబర్ 24-28 తేదీలలో మరో ప్రతినిధి బృందం ఢాకా చేరుకుంది.
దీనికి జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాక్ కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా నాయకత్వం వహించారు. బంగ్లాకు స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆ దేశాన్ని సందర్శించిన అత్యంత సీనియర్ పాకిస్తాన్ సైనిక అధికారి మీర్జానే.
తన పర్యటన సందర్భంగా ఆయన యూనస్, ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నావికాదళ, వైమానిక దళ అధిపతులను కలిసి వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ సహకారం గురించి చర్చించారు.
ఆ తరువాత నవంబర్ 8-12 మధ్య పాకిస్తాన్ నేవీ చీఫ్ అడ్మిరల్ నవీద్ అష్రఫ్ బంగ్లాదేశ్ పర్యటించారు. ఈ పర్యటన అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలను నాంది పలకడమే కాకుండా, రెండు దేశాల మధ్య గణనీయమైన భద్రతా ఏర్పాట్లకు కూడా సాక్ష్యంగా నిలిచింది.
చిట్టగాంగ్ లోని బంగ్లాదేశ్ నేవీ కోసం సౌకర్యాల అభివృద్ది చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం పెకువా వద్ద తన జలాంతర్గాములకు బెర్తింగ్ చేసిన సౌకర్యాలను పాకిస్తాన్ నేవీ బంగ్లాదేశ్ ను అభ్యర్థించిందని వర్గాలు తెలిపాయి. 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధం తరువాత బంగాళఖాతంలో పాకిస్తాన్ నేవీకి ఇది మొదటి అవకాశం.
పాకిస్తాన్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ లెప్టినెంట్ జనరల్ షకీర్ ఉల్లా ఖట్టక్ నేతృత్వంలోని మరో అత్యున్నత సైనిక ప్రతినిధి బృందం బంగ్లాదేశ్ లో రక్షణ ఉత్పత్తి ఒప్పందాలను అన్వేషించడానికి బంగ్లాదేశ్ ను సందర్శించడానికి సిద్ధంగా ఉంది. ఖటక్ ఐఎస్ఐ లో డైరెక్టర్, ఏడో ఆర్మీ డివిజన్ జీఓసీలో ఉన్నారు.
ఇందులో ముఖ్యమైన అంశాలు..
ఈ రెండు పర్యటన సందర్భంగా పాక్- బంగ్లా మధ్య నాలుగు కీలక రంగాలలో ఒప్పందాలు కుదిరాయి. నిఘా సహకారం, నిఘా, ఆస్తులను కూడా పంచుకోవడానికి ఉమ్మడి కమిటీ ప్రత్యేకతలను డీజీఎఫ్ఐతో చర్చించడం, మరో ఐఎస్ఐ బృందం ఢాకాను సందర్శించిన తరువాత విధివిధానాలు ఖరారు చేయబోతున్నారు.
పాకిస్తాన్ బోధకులచే బంగ్లాదేశ్ సైనిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వివిధ స్థాయిలలో కమాండ్ కోర్సుల కోసం పాకిస్తాన్ సైనిక అకాడమీలకు బంగ్లాదేశ్ అధికారులను పంపడం.
సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మధ్య ఉమ్మడి విన్యాసాలు
బంగ్లాదేశ్ సాయుధ దళాల కోసం పాకిస్తాన్ కోసం పాకిస్తాన్ నుంచి సైనిక పరికరాల సేకరణ, ముఖ్యంగా చైనా రూపొందించిన సైనిక హర్డ్ వేర్.
బంగ్లాదేశ్ రక్షణ మంత్రిత్వశాఖలోని ఒక ఉన్నత స్థాయి అధికారి మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఇటీవల సౌదీ అరేబియాతో సంతకం చేసిన ఒప్పందం లాంటి ఒప్పందాలను కుదుర్చుకునే యోచనలో ఉందన్నారు.
ఇది బంగ్లాదేశ్ కు కూడా అణ్వస్త్ర కవచం ప్రయోజనం అందిస్తుంది. ఈ దిశగా యూనస్ ను అమెరికా పరిపాలనలోని అతని సన్నిహితులు ప్రొత్సహిస్తున్నారని, ఇజ్రాయెల్ కు అనుమానాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్- సౌదీ మాత్రం రక్షణ ఒప్పందాన్ని ప్రొత్సహిస్తున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
రహస్య ముప్పు..
అలాంటి ఒప్పందం అమల్లోకి వస్తే భవిష్యత్ లో రెండువైపులా సంప్రదాయ యుద్ధ ముప్పు గురించి భారత్ ఆందోళన చెందాల్సి ఉంటుంది. అయితే ఇది తక్షణం జరుగుతుందని కాదు.
కాకపోతే ఇప్పుడు ఇది త్రీ ఫ్రంట్ వార్ ముప్పు, ఉగ్రవాద సంస్థల ముప్పును పెంచవచ్చు. పాకిస్తాన్ మద్దతు గల ఇస్లామిస్ట్ ఉగ్రవాద గ్రూపులు తూర్పు, ఈశాన్య భారత్ లోని సైనిక, సైనికేతర లక్ష్యాలపై దాడి చేసే విపరీతాలను తోసిపుచ్చలేము.
ఇటీవల నెలలో బంగ్లాదేశ్ సందర్శించిన ప్రతి పాకిస్తాన్ సైనిక ప్రతినిధి బృందంలో కశ్మీర్-పంజాబ్ సెక్టార్ లో భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రొత్సహించడంలో పాల్గొన్న కొంతమంది ఐఎస్ఐ అధికారులు ఉన్నారు.
ఇస్లామిస్ట్ రాడికల్ గ్రూపులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా కొంతమంది రిటైర్డ్ బంగ్లాదేశ్ సైనిక అధికారులతో వారు రహస్యంగా సమావేశాలు జరుపుతున్నారు. ఈ సమావేశాల తరువాత యూనస్ జాతీయ సాయుధ రిజర్వ్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇది ఇస్లామిక్ మిలీషియాను ప్రభుత్వ నిధులను నడపడం లాంటిది. ఈ ఆలోచన మాజీ జమాతే ఇ ఇస్లామీ ఎమిర్ ఘోలం అజామ్ కుమారుడు, రిటైర్డ్ బ్రిగేడియర్ అబ్ధుల్లాహిల్ అమన్ ఆజ్మీ ఆలోచన. షేక్ హసీనా కాలంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయన సేవ నుంచి తొలగించి జైలులో పడేశారు.
ఇస్లామిక్ రాడికల్స్..
లష్కరే తోయిబా వంటి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులలో భాగంగా పనిచేసే లేదా పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్న బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులలో చేరే బంగ్లాదేశ్ ఉగ్రవాద మాడ్యుళ్లను పెంచడంలో మొదటి దశగా వేలాది మంది యువ తీవ్రవాద మదర్సాలలో చదువుతున్న ముస్లిం యువతకు సాయుధ శిక్షణ ఇస్తారు.
యూనస్ పరిపాలన ఇప్పటి వరకూ వందలాది మంది బంగ్లాదేశ్ ఇస్లామిస్ట్ ఉగ్రవాదులను విడుదల చేసింది. అన్సరుల్లా బంగ్లా బృందం చీఫ్ జాషిముద్దీన్ రెహమానీ, ఎల్ఈటీ, జేఎం వంటి పాకిస్తానీ జిహాదీ తంజీమ్ లతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు.
ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి అగ్ర ఉగ్రవాద సూత్రధారులు తరుచుగా బంగ్లాదేశ్ ను సందర్శించారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలలో కొత్త ఉగ్రవాద రెండో ఫ్రంట్ ను తెరవడానికే అని అర్థమవుతోంది.
లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ సన్నిహితుడు రెండుసార్లు బంగ్లాదేశ్ కు వచ్చాడు. మొదట ఫిబ్రవరిలో తరువాత అక్టోబర్ లో భారత్ సరిహద్దుకు వచ్చాడు.
పాకిస్తాన్ మర్కజీ జమియత్ అహ్ల్ ఏ హదీత్ జనరల్ సెక్రటరీ, ఐరాస ఉగ్రవాదీ హఫీజ్ సయిద్ దీర్ఘకాల మిత్రుడు ఇబ్తిసామ్ ఎలాహీ జహీర్ సలాఫీ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. అలాగే రాడికల్ గ్రూపును ఏర్పాటు చేసుకున్నాడు.
రోహింగ్యాల సంబంధం..
బంగ్లాదేశ్ లోని రోహింగ్యా శరణార్థి శిబిరాల్లో పాకిస్తాన్ నిఘా అధికారులు, ఉగ్రవాద శక్తుల కార్యకలాపాలు పెరుగుతున్నాయని భారత నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ లో జన్మించిన రోహింగ్యాలతో సంబంధాలు ఉన్నా అరకాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీకి, లష్కరే తోయిబాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీనికి మానవ వనరులను సప్లై చేసేది, మానవతా విభాగం ఫలాహ్ ఏ ఇన్సాయత్ రోహింగ్యా శరణార్ధి శిబిరాలలో సహయ సిబ్బంది ద్వారా రహస్య ఉనికిని కొనసాగిస్తోంది.
బంగ్లాదేశ్ లోని రద్దీగా ఉండే శిబిరాల్లో పదిలక్షలకు పైగా రోహింగ్యాలు నివసిస్తున్నారు. వీరిలో దాదాపు ఏడు లక్షల మంది 2017 లో మయన్మార్ నుంచి పారిపోయి వచ్చినవారే. బర్మీస్ సైన్యం చేతిలో వీరు అనుభవించిన బాధలు ఇప్పటికి గుర్తు చేసి, మరింత తీవ్రవాద భావానికి గురవుతున్నారు.
ఈ శిబిరాలలోని దాదాపు 15 వేల మంది అరకాన్ ఆర్మీ వంటి సాయుధ గ్రూపులలో చేరారని బంగ్లాదేశ్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. యూనస్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఫలా ఏ ఇన్సాయత్ సహాయ కార్యకర్తల ముసుగులో పాకిస్తానీ బోధకులు చిట్టగాంగ్ కొండ ప్రాంతాలలో వీరికి శిక్షణ ఇస్తున్నారు.
ఇది బంగ్లా ఆర్మీ సహాకారంలో జరుగుతోందని స్థానిక చక్మా గిరిజనులు ఆరోపిస్తున్నారు. భారత నిఘా వర్గాలు రెండు రెట్లు ముప్పును సూచిస్తున్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐ భారత్ లో చర్య కోసం బెంగాలీ, రోహింగ్యా ముస్లిం నియామకాలు పెంపొందించడం, సన్నద్దం చేయడమే కాకుండా బంగ్లాదేశ్ లోని తమ సురక్షిత స్థావరాలను ఉపయోగించి భారత్ పై దాడులు చేయడానికి కఠినమైన పాకిస్తానీ జిహాదీలను కూడా పంపవచ్చు.
బంగ్లాదేశ్ భద్రతా సలహదారు ఖలీలూర్ రెహమాన్ తో ఇటీవల జరిగిన సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ సమస్యలను లేవనెత్తారని విశ్వసనీయంగా నివేదించబడింది.
కానీ యూనస్ పరిపాలన వాటిని పరిష్కరించే అవకాశం లేదు. అతని సలహదారు కఠినమైన ఇస్లామిస్టులలో పెరుగుతున్న భారత వ్యతిరేక దుష్ప్రచారానికి మద్దతు ఇచ్చారు. ముఖ్యంగా పదవీచ్యుతుడైన ప్రధానమంత్రి షేక్ హసీనా, ఆమె పార్టీ సహచరులతో చాలామంది భారత్ కు ఆశ్రయం కల్పించడంపై ఢాకా ఇప్పటికి గుర్రుగా ఉంది.
Tags:    

Similar News