సినిమాలు మధ్య తరగతికి అందని ద్రాక్ష పళ్లు అయ్యాయా?

సినిమా హాల్లో చిరుతిండి నుంచి స్క్రీన్ దాకా అంతా దోపిడియే!

Update: 2025-11-21 09:39 GMT

సినిమా వేషగాళ్ళు నష్టపోతున్నారని ఐ బొమ్మ (iBomma)  రవిని అరెస్టు చేసి ప్రభుత్వం సినిమా వాళ్లకు న్యాయం చేసినట్లుగా భావించవచ్చు. కాని,  4 గురున్న ఒక కుటుంబం థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే  ₹5000 లు ఖర్చు ఔతున్నాయి! ఇలా మూవీలు మధ్యతరగతికి అందని ద్రాక్షల్లా తయారయ్యాయి! ఇందుకు ఆర్టిస్టుల హై డిమాండ్, ప్రొడ్యూసర్ల అత్యాశే కారణాలు! టికెట్ ధర  మొదలుకుకి ధియోటర్లో విక్రయించే స్నాక్స్ వరకు సినిమా హాళ్లలో ఎక్కడ చూసినా దోపిడీనే!

ఐబొమ్మ అరెస్ట్ రవి నేపథ్యం.. అర్థం అయ్యిందనుకుంట.

కానీ సినిమా థియేటర్ల విషయంలో పక్కా ప్రణాళికతో కూడిన విధి,విధానం అవసరం.  సామాన్యుడి విషయంలో... ప్రభుత్వమే సినిమా టిక్కెట్టు పెంచుకోవడం కోసం నిర్మాతలకు పర్మిషన్ ఇవ్వడం అంటే ప్రజలను దోపిడీ చేసుకోండి అని చెప్పి పరోక్షంగా చెప్పడమే.  ఎక్కువ మంది ప్రజలు ఐబొమ్మ రవిని హీరోగా చూస్తున్నారు. అతనికి అనుకూలంగా మెసేజ్ లు సోషల్ మీడియాలో పెడుతున్నారు,


Full View


ముఖ్యంగా ప్రభుత్వం పట్టుకోవాల్సింది ఐ బొమ్మ రవి కంటే దారుణమైన నేరస్తులును. వాళ్లంతా మనమధ్యే తిరుగుతున్నారు.

1) సైబర్ క్రైమ్ కు పాల్పడే వారిపై నిఘా పెట్టి అరెస్టు చేయాలి

2) బెట్టింగ్ యాప్స్ నిర్వహించే వారిని పట్టుకోవడానికి ప్రత్యేక టీం లు ఏర్పాటు చేసి అరెస్టు చేయాలి

3) గంజాయి ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతుంది విద్యార్థులు కూడా ఉపయోగిస్తున్నారు కాబట్టి గంజాయి స్మగ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకునే లాగా చట్టం చేయాలి విచ్చలవిడిగా హైదరాబాద్ నగరం తో పాటుగా తెలంగాణలో అన్ని నగరాల్లో గంజాయి లభ్యమవుతుంది

3) డ్రగ్స్ ఈ డ్రగ్స్ ని సినిమా వేషగాళ్ళు సంపన్న కుటుంబాలకు చెందినటువంటి వారు కొంతమంది మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారు కూడా వాడుతున్నారు ఈ డ్రగ్స్ అమ్మే వారిని వాడే వారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు సినిమా వేష గాళ్ళు డ్రగ్స్ వాడి దొరికారు. వారికి శిక్షలు పడినట్లుగా ప్రజలకు తెలియదు

5) ఇకపోతే అవినీతి ఇందు గలదు అందులేదనే సందేహంబు లేదు ఏ ప్రభుత్వ శాఖలో చూసిన అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతుంది అవినీతిని అరికడితే ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.

6) ఏ రెస్టారెంట్ లో చూసినా కల్తీ ఫుడ్ విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రజలు ఆ ఫుడ్ ని తిని అనేక రోగాల బారిన పడుతున్నారు

ఆపరేషన్ కగార్ లాగానే

ఆపరేషన్ సైబర్ క్రైమ్ టీం ను ఏర్పాటు చేయండి

ఆపరేషన్ బెట్టింగ్ యాప్స్ టీం ను ఏర్పాటు చేయండి

ఆపరేషన్ గంజాయి టీం ఏర్పాటు చేయండి

ఆపరేషన్ డ్రగ్స్ టీం ఏర్పాటు చేయండి

ఆపరేషన్ కల్తీ ఫుడ్ టీం ను ఏర్పాటు చేయండి

ఆపరేషన్ అవినీతి వ్యతిరేక టీం ను ఏర్పాటు చేయండి. ప్రజలు హర్షి

-నారగోని ప్రవీణ్ కుమార్

Tags:    

Similar News